Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: రెపో రేటు 4.40%తగ్గింపు, 3 నెలలు ఈఎంఐలపై మారటోరియం

కరోనా ప్రభావం కారణంగా ఆర్ బీ ఐ రెపో రేటును తగ్గించింది. ద్రవ్యొల్భణం అదుపులోనే ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.
 

Coronavius pandemic:RBI cuts repo rate by 75 basis points to 4.40%
Author
New Delhi, First Published Mar 27, 2020, 10:20 AM IST

న్యూఢిల్లీ: కరోనా ప్రభావం కారణంగా ఆర్ బీ ఐ రెపో రేటును తగ్గించింది. ద్రవ్యొల్భణం అదుపులోనే ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. మూడు నెలల పాటు ఈఎంఐల చెల్లింపులపై మారటోరియం విధించేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. 

శుక్రవారం నాడు ఉదయం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ముంబైలో మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకొంది. రెపో రేట్ ను తగ్గించినట్టుగా ఆర్బీఐ ప్రకటించింది. రేపో రేటును 4.4 శాతానికి తగ్గించింది. 

Coronavius pandemic:RBI cuts repo rate by 75 basis points to 4.40%

బేసిక్ పాయింట్స్ ను 75కు తగ్గించింది. రివర్స్ రెపో రేటును కూడ తగ్గించింది. రివర్స్ రేపో రేటును 90 పాయింట్లకు తగ్గించినట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.

మానిటరీ పాలసీ కమిటి ఈ నెల 24, 26, 27 తేదీల్లో సమావేశం నిర్వహించింది.ఈ సమావేశాల్లో చర్చించారు. 4:2 మెజారిటీతో రెపోరేటును తగ్గించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.

గతంలో రెపో రేటు 5.15 శాతంగా ఉండేది. దీన్ని ప్రస్తుతం 4.40 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకొన్నారు.గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన ఆర్బీఐ 25 బేసిక్ పాయింట్లను తగ్గించి రెపో రేటును 5.15 శాతానికి తగ్గించింది. పండుగ సమయాల్లో తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చేందుకు ఆ సమయంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకొంది. 

నిధుల కొరత లేకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కోరారు. టర్మ్ లోన్ల చెల్లింపుపై మూడు మాసాల పాటు తాత్కాలిక నిషేధాన్ని అనుమతించేందుకు అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు అనుమతి ఉందని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు.

కరోనా ప్రభావం ఆర్బీఐ సిబ్బందిపై ఉందని గవర్నర్ చెప్పారు. 150 మంది ఆర్బీఐ సిబ్బంది క్వారంటైన్ లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios