ఐసొలేషన్ కేంద్రాలుగా ఇక రైల్వే బోగీలు... సికింద్రాబాద్ లో సర్వం సిద్ధం
రైళ్లలోని స్లీపర్ క్లాస్ బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చేందుకు రైల్వే శాఖ ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి రైల్వే ఉన్నతాధికారులు అన్ని రైల్వే జోన్స్ కి ఆదేశాలను ఇచ్చినట్టు సమాచారం. ఈ ఆదేశాల్లో భాగంగానే దక్షిణమధ్య రైల్వే అధికారులకు కూడా ఆదేశాలు అందాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
ప్రపంచంలో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తుంది. భారతదేశంలో కూడా ఈ రక్కసి కరాళ నృత్యానికి యావత్ దేశమంతా వణికిపోతుంది. సరైన మందు లేక, నివారణ ఒక్కటే మార్గంగా భావించిన ప్రభుత్వం సోషల్ డిస్టెంసింగ్ మాత్రమే ఇప్పుడు కరెక్ట్ అని భావించి దేశమంతా లాక్ డౌన్ ప్రకటించింది.
ఇకపోతే.... కరోనా వైరస్ ప్రస్తుతానికి రెండవ దశలోనే ఉన్నప్పటికీ... థర్డ్ స్టేజి లోకి ఎంటర్ అయితే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఆ పరిస్థితుల్లో దేశంలో రోగులను ట్రీట్ చేయడానికి ఉన్న ఆసుపత్రులు కూడా సరిపోవు.
ఈ నేపథ్యంలోనే కొత్తగా అవసరమైన భవంతులను అన్నిటినీ ప్రభుత్వం ఇప్పుడు క్వారంటైన్ సెంటర్లుగా, ఐసొలేషన్ వార్డలుగా మార్చేందుకు చూస్తోంది. తాజాగా భారతీయ రైల్వేస్ కూడా ఇందుకు సంబంధించి రంగంలోకి దిగింది.
Also Read: లాక్ డౌన్: 200 కిమీ నడిచి, హైవేపై కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు
రైళ్లలోని స్లీపర్ క్లాస్ బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చేందుకు రైల్వే శాఖ ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి రైల్వే ఉన్నతాధికారులు అన్ని రైల్వే జోన్స్ కి ఆదేశాలను ఇచ్చినట్టు సమాచారం. ఈ ఆదేశాల్లో భాగంగానే దక్షిణమధ్య రైల్వే అధికారులకు కూడా ఆదేశాలు అందాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
ఇక మన దక్షిణ మధ్య రైల్వే విషయానికి వస్తే.... ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ నుంచి వచ్చేనెల ఏప్రిల్ 14 వరకు వీటిని పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఈ రైళ్లన్నీ నడవకపోతుండడంతో రైల్వే యార్డుల్లో నిలిపివేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్, మౌలాలీ, చర్లపల్లి, లింగంపల్లి, మహారాష్ట్రలోని నాందేడ్, పూర్ణ పట్టణాల్లో రైల్వే యార్డులు ఉన్నాయి.
సగటున ప్రతి రైలూకు 12 బోగీలుంటాయి. జనరల్ కంపార్ట్‌మెంట్, ఇతర కూర్చొని ప్రయాణించే బోగీలను మినహాయిస్తే... ఈ అన్ని రైళ్లలో కలిపి దాదాపు 5 వేల వరకు స్లీపర్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని ప్రాథమికంగా అధికారులు ఒక అంచనాకు వచ్చారు.
దేశంలో కరోనా మహమ్మారి గనుక స్టేజి3 లోకి ఎంటర్ అయ్యి తన కోరలను గనుక చాస్తే.... తట్టుకునేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వాడుకోవాలని ధృడ సంకల్పంతో ఉంది.
వీటితోపాటు రైల్వే హెల్త్ సెంటర్లలో డాక్టర్లతో కూడా రైల్వే అధికారులు టచ్ లో ఉన్నారు. ఎంతమంది దోటర్లు అందుబాటులో ఉన్నారు. ఇంకెంతమంది అవసరం పడతారు తదితరాలన్నిటిపై చర్చలు జరుపుతున్నారు. ఎప్పుడు రంగంలోకి దిగమన్నా తాము సిద్ధమని రైల్వే అధికారులు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.