బెంగళూరు: కరోనా వైరస్ లక్షణాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు బెంగళూరులోని డాలర్స్ కాలనీలో గల ముఖ్యమంత్రి యడియూరప్ప ఇంటి చుట్టుపక్కల తిరిగినట్లు అనుమానిస్తున్నారు. శనివారంనాడు కరోనా వైరస్ లక్షణాలున్న జాబితాను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసింది. 

జాబితాలో ఏ -59, ఏ-25 నంబర్ కలిగిన వ్యక్తులు ముఖ్మయంత్రి నివాసం చుట్టూ తిరిగారని తెలుస్తోంది. ఇది తీవ్ర ఆందోళనకు కారణమైంది. విదేశాల నుంచి వచ్చిన ఏ-25 రోగితో పాటు వారి ఇంటిలో పనిచేస్తున్న మహిళ (ఏ-59)కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.

ముఖ్యమంత్రి నివాసం చుట్టూ తిరిగిన ఇద్దరు రోగులు ఓ ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్స పొందుతున్నారు. వారిద్దరు డాలర్స్ కాలనీలో ఉన్న యడియూరప్ప ఇంటి చుట్టూ తిరిగినట్లు బీబీఎంపీ జాయింట్ కమిషర్ పల్లవి, బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీ శశికుమార్ పరిశీలించారు.

ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన ఓ మహిళ ప్రతి రోజు నాలుగు ఇళ్లలో పాచీపనులు చేస్తుంది. వారి ఇళ్ల ముందు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వారిని బయటకు పంపించడం లేదని పోలీసులు అంటున్నారు.