Asianet News TeluguAsianet News Telugu

కరోనా లాక్ డౌన్.. అంత్యక్రియలకు రాలేని పరిస్థితి.. ముస్లిం సోదరులే..

బంధువులు రాకపోయినా.. ఆత్మ బంధువుల్లా ముస్లింలు వచ్చారు. సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ, ముస్లింల బంధానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

coronavirus lockdown: Muslims Assist funeral procession of deceased hindu in UP's Bulandshahr
Author
Hyderabad, First Published Mar 30, 2020, 7:29 AM IST

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ దీని ప్రభావం రోజు రోజుకీ పెరిగి పోతోంది. ముందుగానే స్పందించి భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఇందులో భాగంగా అందరూ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. కనీసం బంధువుల ప్రాణాలు పోయినా అంత్యక్రియలకు కూడా ఎవరూ రాలేకపోతున్నారు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ లో చోటుచేసుకుంది. 

Also Read ఎక్కడికి వెళ్లొద్దు... మీ ఇంటి అద్దె కడతాం, అన్నం పెడతాం: వలస కార్మికులకు కేజ్రీవాల్ విజ్ఞప్తి...

అయితే.. బంధువులు రాకపోయినా.. ఆత్మ బంధువుల్లా ముస్లింలు వచ్చారు. సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ, ముస్లింల బంధానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

బులంద్ షహర్ ప్రాంతానికి చెందిన రవి శంకర్ అనే వ్యక్తి క్యాన్సర్ పై పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతని అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు రాలేని పరిస్థితి  నెలకొంది. విషయం తెలుసుకున్న కొందరు ముస్లిం సోదరులు రామ్ నామ్ సత్య హై అంటూ రవిశంకర్ కు హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా మృతుని కుమారుడు మాట్లాడుతూ తనకు ఎదురైన కష్టకాలంలో  ముస్లింలు ఆదుకుని, అండగా నిలిచారన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios