Asianet News TeluguAsianet News Telugu

మందుబాబులకు గుడ్ న్యూస్: షట్ డౌన్ ఉన్నా ఇక మద్యం అమ్మకాలు...

ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిత్యావసరాలన్నీ తెరుచుకునే ఉంటాయి. అయితే నిత్యావసరాలంటే... పాలు, పండ్లు కూరగాయలు, పెట్రోల్, గ్యాస్ ఇట్లాంటివి. కానీ ఎవరైనా ఊహించగలరా మందు కూడా నిత్యావసర వస్తువు అని?

Corona Lockdown: Liquor to be classified as essential supply and made available
Author
New Delhi, First Published Mar 25, 2020, 1:56 PM IST

ప్రపంచమంతా కరోనా వైరస్ బారినపడి బయటపడలేక కొట్టుమిట్టాడుతుంది. అంతకంతకు పెరుగుతున్న కేసులు, మరణాలతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఏమి చేయాలో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. 

భారతదేశంలో కూడా ఈ కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది. చాలా రాష్ట్రాలు ఇప్పటికే షట్ డౌన్ ప్రకటించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా షట్ డౌన్ ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నాయి. షట్ డౌన్ కూడా పనిచేయడం లేదు అని భావిస్తే ఏకంగా కర్ఫ్యూ విధిస్తున్నారు. తెలంగాణాలో ఇప్పటికే రాత్రి 7 గంటల నుండి తెల్లవారుఝామున 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది. 

also read:దారుణం: కరోనా అంటూ తల్లిని రోడ్డునే వదిలేశాడు, కానీ....

ఇకపోతే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిత్యావసరాలన్నీ తెరుచుకునే ఉంటాయి. అయితే నిత్యావసరాలంటే... పాలు, పండ్లు కూరగాయలు, పెట్రోల్, గ్యాస్ ఇట్లాంటివి. కానీ ఎవరైనా ఊహించగలరా మందు కూడా నిత్యావసర వస్తువు అని?

ఏమిటని వాపోకండి మీరు చదివింది నిజమే. మందును కూడా నిత్యావసరంగా ప్రకటించారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కాదు లెండి. పంజాబ్, కేరళలో మందును నిత్యావసరాల కిందకు తెస్తూ ఆ దుకాణాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 

కేరళ రాష్ట్ర ప్రాభుత్వ వాదన గనుక వింటే మనకయు ఆఆశ్చర్యం కలుగుతుంది. దాదాపుగా సంవత్సరానికి 2,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రం గడిస్తోంది. కేరళలో కూడా ఇదే పరిస్థితి. 

సో మొత్తానికి ఈ రాష్ట్రాల్లో మద్యాన్ని కూడా నిత్యావసరాల కిందకు జమ కట్టారన్నమాట. ఇకపోతే దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ 21 రోజులు కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది. కూరగాయాలు, ఆహార పదార్థాలు, పండ్లు వంటి నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా లాక్ డౌన్ ప్రకటించారు. షట్ డౌన్ కాలంలో ఏవేవి అందుబాటులో ఉంటాయి, ఏవేవీ అందుబాటులో ఉండవనేది ఒక్కసారి చూద్దాం.

ఇవి మూతపడుతాయి

* అన్ని రకాల రవాణా వ్యవస్థలు, విమానాలు, రైళ్లు, రోడ్డు మార్గాలు
కొన్ని మినహాయింపులతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు
* వాణిజ్య, ప్రైవేట్ సంస్థలు
* పారిశ్రామిక సంస్థలు
* హాస్పిటాలిటీ ఎస్టాబ్లిష్ మెంట్స్
* విద్యా సంస్థలు
* అన్ని ప్రార్థనా మందిరాలు, మత వేడుకలు
* అన్ని సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, అకడమిక్, సాంస్కృతిక, మత కార్యక్రమాలు

షట్ డౌన్ నుంచి మినహాయింపులు ఇవీ...

* బ్యాంకులు, బీమా కార్యాలయాలు, ఏటిఎంలు 
* మంచినీటి సరఫరా, శానిటేషన్, విద్యుత్తు సరఫరా వంటి నిత్యావసర సేవలు
* ఆస్పత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన అన్ని వైద్య సంబంధ సంస్థలు, మందుల తయారీ సంస్థలు, మందుల సరఫరా యూనిట్లు, డిస్పెన్షరీ, కెమిస్టులు, ల్యాబ్స్, క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్, అంబులెన్స్ లు
* వైద్య సంబంధమైన అధికారులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ఇతర ఆస్పత్రులకు సంబంధించినవి.
* ఆహారపదార్థాలు, పండ్లు, కూరగాయాలు, డైరీ, మిల్క్ బుత్స్, మాంసం, ఫిష్, పశు దాణాలకు చెందిన దుకాణాలు, రేషన్ దుకాణాలు.
* ఆహార పదార్థాలు, మందులు, వైద్య పరికరాల హోమ్ డెలివరీ
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసులు, బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సర్వీసులు, ఐటీకి సంబంధించిన సర్వీసులు
* పెట్రోల్ పంపులు, ఎల్పీజీ, పెట్రోలియం, గ్యాస్ రిటైల్, స్టోరేజ్ ఔట్ లెట్స్
* విద్యుదుత్పత్తి, ట్రాన్స్ మిషన్, పంపిణీ యూనిట్లు, సేవలు
సెబీ నోటిఫై చేసిన మేరకు క్యాపిటల్, డెబిట్ మార్కెట్ సర్వీసులు
ప్రైవేట్ సెక్యూరిటీ  సర్వీసులు
* కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ సర్వీసులు
* నిత్యావసర సరుకుల తయారీ సంస్థలు
* రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి పొందిన తర్వాత నిరంతరాయంగా సాగాల్సిన ఉత్పత్తి యూనిట్లు
* నిత్యావసర సరుకుల రవాణా, ఫైర్,  శాంతిభద్రతలు, అత్యవసర సర్వీసులు
* పర్యాటకుల కోసం, లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న హోటల్స్, హోమ్ స్టేస్, లాడ్జీలు, మోటెల్స్. క్వారంటైన్ కు వాడే అత్యవసర సిబ్బంది, నావికా సిబ్బంది, సంస్థలు
* అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనకూడదు
* రక్షణ, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ట్రెజరీ
* పెట్రోలియం, సిఎన్జీ, ఎల్పీజీ, పిఎన్జీ వంటి ప్రజా వినియోగాలు
డిజాస్టర్ మేనేజ్ మెంట్, పోస్టాఫీసులు, పోలీసులు, హోమ్ గార్డులు, ఫైర్, అత్వసర సర్వీసులు, జైళ్లు

శిక్షలు

* ఫిబ్రవరి 15వ తేదీన భారత్ వచ్చిన వ్యక్తులందరూ తమంత తాముగా ఇళ్లలో క్వారెంటైన్ చేసుకోవాలి. లేదంటే ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది.
* విధులకు అడ్డు తగిలితే ఒకటి లేదా రెండేళ్ల జైలు లేదా జరిమానా
* తప్పుడు క్లెయిమ్ చేస్తే రెండేళ్ల వరకు జైలు, జరిమానా
* తప్పుడు హెచ్చరికలు చేస్తే ఏడాది వరకు జైలు లేదా జరిమానాతో పాటు జైలు

Follow Us:
Download App:
  • android
  • ios