Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో గుజరాత్‌లో 45 ఏళ్ల మహిళ మృతి: ఆరుకు చేరిన మృతుల సంఖ్య

గుజరాత్ రాష్ట్రంలో కరోనాతో సోమవారం నాడు ఓ మహిళ మృత్యువాత పడ్డారు.  రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య రాష్ట్రంలో ఆరుకు చేరుకొంది.

45-year-old woman dies from coronavirus in Gujarat; death toll reaches six in state
Author
Gujarat, First Published Mar 30, 2020, 1:31 PM IST

గాంధీనగర్:గుజరాత్ రాష్ట్రంలో కరోనాతో సోమవారం నాడు ఓ మహిళ మృత్యువాత పడ్డారు.  రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య రాష్ట్రంలో ఆరుకు చేరుకొంది.

గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ కు చెందిన 45 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి. దీంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సోమవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందినట్టుగా ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయంతి రవి ప్రకటించారు.

ఆ మహిళ రెండు వారాల క్రితం గుండెపోటు వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తు చేశారు. అహ్మదాబాద్ లో మూడు కేసులు, భావ్ నగర్ లో రెండు, సూరత్ లో ఒక్కరు కరోనాతో మృతి చెందారు. 

ఆదివారం నాడు అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. శనివారం నాడు ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం నాడు భావ్ నగర్ కు చెందిన మహిళ మృతి చెందింది. 

Also read:గుజరాత్‌లో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరిక: అహ్మదాబాద్‌లో ఒకరి మృతి

గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికే 53 మందికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్య,ఆరోగ్య శాఖాధికారులు ప్రకటించారు. అయితే వీరిలో ఆరుగురు మృతి చెందారు.

రాష్ట్రంలో 4,46,60,856 జనాభా ఉంది. పదివేల మంది హెల్త్ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. 60,708 మంది రాష్ట్రం నుండి ఇతర ప్రాంతాల్లో పర్యటించి  వచ్చినట్టుగా గుర్తించారు. 

50,169 మంది రాష్ట్రంలోనే పలు ప్రాంతాల్లో పర్యటించారు. 10,539 మంది విదేశాల్లో పర్యటించి వచ్చినట్టుగా గుర్తించారు. వీరి ట్రావెల్ హిస్టరీ ఆధారంగా అధికారులు వారికి చికిత్స నిర్వహిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios