Asianet News TeluguAsianet News Telugu

కరోనా కట్టడికి కర్నూలు పోలీసుల వినూత్న ప్రయోగం: ట్రాన్స్‌జెండర్స్‌తో ప్రచారం

కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్రమోడీ 21 రోజుల పాటు దేశంలో లాక్‌డౌన్ ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

coronavirus: transgender helping hand to kurnool police
Author
Kurnool, First Published Mar 29, 2020, 8:21 PM IST

కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్రమోడీ 21 రోజుల పాటు దేశంలో లాక్‌డౌన్ ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, క్రీడా ప్రముఖులు  సైతం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ కొందరు మాత్రం బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి జనాన్ని కట్టడి చేస్తున్నారు.

Also Read:కరోనా వైరస్ పోలిన హెల్మెట్‌: చెన్నై పోలీసుల వినూత్న ప్రయోగం

కొందరు ఆకతాయిలు పనీపాటా లేకుండా రోడ్లమీద జులాయిగా తిరగడంతో ఖాఖీలు తమ లాఠీలకు పని చెప్పారు. అయితే వీటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగటంతో జాగ్రత్త పడ్డా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటోంది.

బలప్రయోగం కాకుండా ప్రజలకు మంచి రీతిలో అర్థమయ్యే విధంగా చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో తమ లాఠీ లను పక్కకు పెట్టి తెలివికి పని చెప్పారు. దీనిలో కర్నూలు నగర మూడవ పట్టణ పోలీసులు కొత్తగా ఆలోచించి హిజ్రాల సహాయం తీసుకున్నారు.

Also Read:లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలే: రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

వారి సహాయంతో ప్రభుత్వం ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత కూడా రోడ్ల మీద తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇప్పించారు. తమదైన శైలిలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాల ద్వారా వచ్చే వారికి కరోనా పై అవగాహన పెంచుతూ పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ట్రాన్స్‌జెండర్స్.

Follow Us:
Download App:
  • android
  • ios