Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కరోనా కరాళనృత్యం: 8 గంటల్లో కొత్తగా 37 కేసులు, 303కు చేరిన సంఖ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత ఎనిమిది గంటల్లో కొత్తగా 37 కరోనా వైరస్ కేసులు నిర్దారణ  అయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 303కు చేరుకుంది.

Coronavirus cases increased to 303 by Monday evening
Author
Amaravathi, First Published Apr 6, 2020, 6:59 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. సోమవారం 8 గంటల వ్యవధిలో కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో కరోనా వైరస్ కేసులు 303కు చేరుకున్నాయి. కొత్తగా కర్నూలు జిల్లాలో 18, కడప జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కొత్త ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి.

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. నెల్లూరుల 42 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 29, కడప జిల్లాలో 27, విశాఖపట్నం జిల్లాలో 20, అనంతపురం ఆరు కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 32 కేసులు రికార్డయ్యాయి. మర్కజ్ వెళ్లి వచ్చినవారికే ఎక్కువగా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీకి వెళ్లినవచ్చినవారందరినీ గుర్తించామని, వారికి సంబంధించినవారిని కూడా గుర్తించామని, వారందరినీ క్వారంటైన్ కు తరలించామని ప్రభుత్వం చెబుతోంది. కర్నూలు జిల్లాలో మరో 70 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కృష్ణా జిల్లాలో సోమవారం మరో రోగి రికవరీ అయినట్లు, అతన్ని డిశ్చార్జీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ఆరుగురు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయినట్లు తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు.

జిల్లాలవారీగా కరోనా వైరస్ కేసులు ఈ కింది విధంగా ఉన్నాయి.

అనంతపురం 6
చిత్తూరు 17
తూర్పు గోదావరి 11
గుంటూరు 32
కడప 27
కృష్ణా 29
కర్నూలు 74
నెల్లూరు 42
ప్రకాశం 24
విశాఖపట్నం 20
పశ్చిమ గోదావరి 21

Follow Us:
Download App:
  • android
  • ios