Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో కరోనా అనుమానితుడు: బందరు యువతికి కరోనా నెగెటివ్

కృష్ణా జిల్లాలో ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతను మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చాడు. ఓ యువతికి కరోనా నెగెటివ్ ఉన్నట్లు తేలింది.

Corona suspect in Krishna district of AP
Author
Machilipatnam, First Published Mar 25, 2020, 12:13 PM IST

అమరావతి: కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రాంలో ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర అతను బుధవారం ఉదయం ఉల్లెపాలెం గ్రామానికి వచ్చాడు. దాంతో పరీక్షల నిమత్తం అతన్ని పోలీసు, వదైయ్ శాఖల అధికారులు ప్రత్యేక అంబులెన్స్ లో మచిలీపట్నం జిల్లా అస్పత్రికి తరలించారు.

కజికిస్తాన్ నుండి మచిలీపట్నం వచ్చిన యువతికి కరోనా నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. ఆ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు. నెగిటీవ్ రిపోర్ట్ రావటంతో అధికార యంత్రాంగం, నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా లక్షణాలతో గత కొన్ని రోజులుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఆ యువతి చికిత్స పొందుతోంది.నెగిటీవ్ రిపోర్ట్ రావటంతో ఆమెను వైద్యులు ఇంటికి పంపనున్నారు. హౌస్ ఐసోలేషన్ లో మరో 14 రోజుల పాటు ఆ యువతిని వైద్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి చేరుకుంది. తాజాగా చిత్తూరు జిల్లా కాళహస్తిలో ఓ కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి చేరుకుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 

ఆ యువకుడు శ్రీకాళహస్తికే చెందిన మిత్రుడితో కలిసి లండన్ లో ఎంసీఏ చదువుతున్నాడు. ఇద్దరు కలిసి ఈ నెల 18వ తేదీ రాత్రి లండన్ నుంచి బయలుదేరి 19వ తేదీ మధ్యాహ్నం చెన్నైకి చేరుకున్నాడు. అక్కడి నుంచి కారులో శ్రీకాళహస్తి వచ్చాడు. 

దగ్గు, జ్వరం, జలుబు ఉండడంతో ఈ నెల 23వ తేదీన తిరుపతి రుయా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. అతని నమూనాలను సేకరించి స్విమ్స్ లో పరీక్షించారు. దాంతో అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. విశాఖలో ఇటీవల పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూతురు నమూనాలను కూడా పరీక్షించారు. ఆమెకు నెగెటివ్ వచ్చిందని వైద్యులు తేల్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios