Asianet News TeluguAsianet News Telugu

కరోనా కల్లోలం: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ సాక్షిగా జగన్ చుట్టూ వివాదం, అసలు విషయం ఇదీ !

తాజాగా అమెరికా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో జగన్ మోహన్ రెడ్డి గారి పేరు మీద వెలిసిన పోస్టర్ ఇప్పుడు బాగా వివాదస్పదమైంది. కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ అమెరికాలో ఉన్న తెలుగువారిని ఉద్దేశించి ఆ పోస్టర్ వెలిసింది. 

AP CM YS Jagan's Flexi in Newyork Times Square creates Political tremors, Has nothing to do with Govt says Rathnakar
Author
Amaravathi, First Published Apr 5, 2020, 7:54 AM IST

దేశమంతా కరోనా వైరస్ సందిగ్ధంలో, ఆ వైరస్ ని ఎలా ఎదుర్కోవాలని తలలు పట్టుకుంటుంటే.... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మాత్రం ఈ కరోనాతోపాటుగా విమర్శలను డీల్ చేయాల్సి వస్తున్నది.

తాజాగా అమెరికా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో జగన్ మోహన్ రెడ్డి గారి పేరు మీద వెలిసిన పోస్టర్ ఇప్పుడు బాగా వివాదస్పదమైంది. కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ అమెరికాలో ఉన్న తెలుగువారిని ఉద్దేశించి ఆ పోస్టర్ వెలిసింది. 

ఆ పోస్టర్ లో ప్రవాసాంధ్రులు జాగ్రత్తగా ఉండాలని, వారు అక్కడ నిశ్చింతగా ఉండొచ్చని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవారి సంగతి ప్రభుత్వం చూసుకుంటుందని ఆ పోస్టర్ లో తెలపడం జరిగింది. 

కరోనా వైరస్ పూర్తిగా న్యూయార్క్ నగరాన్ని కమ్మేసినవేళ ఎవరు ఈ పోస్టర్ ని చూస్తారు అంటూ టీడీపీ నేతలు, సోషల్ మీడియా యూజర్లు ఎద్దేవా చేసారు కూడా. ఇక తాజాగా ఆ పోస్టర్ పై మరోమారు దుమారం చెలరేగింది. 

Also read: వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ప్రభుత్వ పెన్షన్లు పంచుతున్నారా?, ఫోటో వైరల్

ఇప్పటికే కారొనపై పోరులో జగన్ సర్కార్ విఫలమైందంటూ పదే పదే బ్లీచింగ్ పౌడర్, పారాసెటమాల్ అంటూ ఎద్దేవా చేసే టీడీపీ నాయకులు ఇప్పుడు ఈ పోస్టర్ పైన విరుచుకుపడుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పై పోరాడానికి డబ్బులు లేవని కేంద్రాన్ని అడుగుతారు, ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తారు కానీ విదేశాల్లో మాత్రం ప్రచార ఆర్భాటాల కోసం విపరీతంగా ఖర్చుబెడతారు అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో న్యూ యార్క్ లో జగన్ పోస్టర్ కింద ఎవరి పేరయితే ఉందొ, ఆ పోస్టర్ ఎవరు వేయించారో ఆయనే ఇప్పుడు స్వయంగా బయటకు వచ్చారు. ఆ పోస్టర్ కి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, దాని ఖర్చు అంతా కూడా తానే పెట్టుకున్నానని రత్నాకర్ పండుగాయాల వివరణ ఇచ్చారు. 

ఉత్తర అమెరికా వైసీపీ కన్వీనర్ గా ఉన్న ఆయన జగన్ సీఎం అయ్యాక ఉత్తర అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. కరోనా ను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా బాగుండడంతో తాను తన సొంత ఖర్చుతో ఏర్పాటుకి చేయించానని ఆయన అన్నారు.

అలా చేస్తే కరోనాను ఈజీగా జయించవచ్చు: విజయవాడ కరోనా పేషంట్

న్యూయార్క్ లో కూడా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ తెలుగు ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి ఇలా పోస్టర్ ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios