Asianet News TeluguAsianet News Telugu

3వేలు కాదు 32 వేలు... కరోనాపై ఏపి ప్రభుత్వ చిత్తశుద్ది ఇది...: బుచ్చయ్య చౌదరి ఫైర్

గత నెల మార్చి 12వ తేదీనే తాను కరోనా తీవ్రత గురించి హెచ్చరించినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. 

AP CM YS Jagan fails to control corona virus: Gorantla Butchaiah Chowdary
Author
Guntur, First Published Apr 3, 2020, 8:33 PM IST

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. శుక్రవారం  నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముందుగానే మనం మేల్కోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎలాంటి అవగాహన గానీ ఆలోచన కానీ లేదని మండిపడ్డారు. 

గత నెల మార్చి 12వ తేదీనే తాను కరోనా తీవ్రత గురించి హెచ్చరించడం జరిగిందన్నారు. జనవరి 16వ తేదీన కూడా మీడియా సమావేశం నిర్వహించి హెచ్చరించడం జరిగిందన్నారు. ప్రధాని మార్చి 22వ తేదీన పిలుపునిచ్చినప్పటికీ జగన్ మేల్కోలేదని... పొరుగు రాష్ట్రాలు ముందుగానే మేల్కొన్నారని... జగన్ ముందుగానే ఎందుకు మేల్కోలేదని ప్రశ్నించారు. 

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా జగన్ పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలోకి ఎంతమంది విదేశీయులు వచ్చారో కూడా తెలియదని... గతంలో 3 నుండి 5వేల మంది అని ఇప్పుడు 32 వేలు అంటున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఇప్పటికీ ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదన్నారు. 

ఉచిత బియ్యం అంటూ ఏప్రిల్ కోటానే ముందుగా ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ సాయం వెయ్యి రూపాయలు అన్నారని... ఈ వెయ్యి  సాయం కూడా రేషన్ కార్డులు పెండింగ్ లో ఉన్నవారికి ఇవ్వడం లేదన్నారు. ఇసుక, మట్టిని జగన్ నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చినట్లుగా ఉందన్నారు.  మైనింగ్ మాఫియా, జే ట్యాక్స్ కొనసాగుతోందని మండిపడ్డారు. 

జగన్ ప్రభుత్వం ఇప్పటికే 60వేల కోట్ల అప్పులు చేశారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని.. ఈ డబ్బంతా ఏం చేశారని నిలదీశారు. కంటి వెలుగు పరీక్షలు కొత్తగా జగన్ చేయడం లేదన్నారు. నీటిపారుదల రంగంలో కూడా పనులు జరగడం లేదని... పంటలకు మద్దతు ధరలు లేవన్నారు. రూ.2.87 లక్షల కోట్లు జగన్ ఏం చేశారని మండిపడ్డారు. 

పనికిమాలిన విధానాలతో ముందుకు వెళ్తున్నారని... వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని అడిగారు. టీడీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమన్నారు. రైతులకు రుణమాఫీ, చంద్రన్నబీమా చెల్లించడం లేదన్నారు. అన్న క్యాంటీన్లు రద్దు చేశారని... హౌసింగ్ కు రూపాయి కూడా ఇవ్వలేదని...కోర్టుతో రోజూ తిట్లు తింటుతున్నారని గుర్తుచేశారు. 

అవసరమైన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నారని... ఒక్క పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయడం లేదని... రేషన్ సరుకులు అందించకుండా వాలంటీర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ ముందుచూపు లేకుండా పబ్ జీ ఆడుకుంటూ కూర్చున్నారని మండిపడ్డారు. 

సీఎం జగన్ నాయకత్వం వల్ల ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడిపోతోందన్నారు. పేదలు, రోజువారీ కూలీలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హుద్ హుద్ వచ్చినప్పుడు చేసిన సాయాన్నే ఇప్పుడు అందించాలని... ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఏప్రిల్ నుంచి పెరిగే పెన్షన్ ను ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. 

రాష్ట్రం ఆర్థికంగా బాగున్నా జీతాలు ఆపడం సరికాదన్నారు. వచ్చిన విరాళాలతోనే కరోనాను ఎదుర్కోవచ్చని... వీటన్నింటిపై ఏనాడూ చర్చ జరగలేదన్నారు. దళితులు నేడు కళ్లు తెరుస్తున్నారని... ఏ వర్గానికి న్యాయం జరగడం లేదన్నారు. వైసీపీలోనే అసంతృప్తి ఉందన్నారు. రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరిలా చేయవద్దని... కేంద్ర సాయం కాకుండా జగన్ ఏమిస్తారో చెప్పాలని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios