ప్రముఖ కార్ల తయారీ సంస్థలకు పండుగ సీజన్ లో డిమాండ్ దాదాపు 10-15 శాతం పెరిగినట్లు పేర్కొంటున్నాయి. మొత్తం అమ్మకాలలో వాటా భారీగా పెరిగినట్లు, పట్టణ మార్కెట్లతో పోలిస్తే గ్రామీణ మార్కెట్లలో మొదటిసారి కార్ కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉందని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. ఈ సంవత్సరం పండుగ సీజన్ అక్టోబర్ 16 ఓనంతో ప్రారంభమై నవంబర్ మధ్యలో భాయ్ దూజ్ తో ముగిసింది.

అయితే హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) ఈ ప్రశ్నలకు స్పందించలేదు, అయితే మారుతి కంపెనీ పండుగ సీజన్ లో 2,33,000 కార్లను పంపిణీ చేసిందని, కిందటి ఏడాదితో పోలిస్తే సుమారు 10-11 శాతం  పెరుగుదల ఉందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్‌ఐఎల్)  ఎగ్జిక్యూటివ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.

గత 4-5 సంవత్సరాలలో ఇదే  అత్యధికం అని తెలిపారు. మరోవైపు డిమాండ్ కూడా పెరుగుతుందని అన్నారు. దీపావళి తరువాత బుకింగులు, ఎంక్వైరీలు బాగున్నాయని, డిసెంబర్ చివరి వరకు ఈ ధోరణి కొనసాగుతుందని ఆయన ఆశిస్తున్నారు.

మొత్తం అమ్మకాలలో దాదాపు 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాయని చెప్పారు. గతేడాది గ్రామీణ అమ్మకాలు 38.5 శాతంగా ఉన్నాయి. అయితే మొదటిసారి కార్ కొనుగోలుదారులు గ్రామీణ మార్కెట్ లో 4-5 శాతం పెరిగి 54 శాతానికి చేరుకోగా, పట్టణ మార్కెట్లలో 47-48 శాతంగా ఉంది.

also read ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఇన్నోవా క్రిస్ట 2021 మోడల్ లాంచ్.. ధర, ఫీచర్స్ అదుర్స్.. ...

ఉత్పత్తుల విషయానికొస్తే ఎంఎస్ఐఎల్ దాని లోయర్ ఎండ్ హ్యాచ్‌బ్యాక్‌లకు మంచి ట్రాక్షన్‌ను చూసింది, గ్రామీణ మార్కెట్లలో ఎస్‌యూవీ కార్ల కోసం ట్రాక్షన్ తక్కువగా ఉంది. మారుతి సంస్థ ఎంపివి ఈకో వ్యాన్లు, ఆల్టో, వాగన్ ఆర్ సహా చిన్న కార్లు గ్రామీణ ప్రాంతాల్లో బాగా అమ్ముడయ్యాయి.

దుర్గా నవరాత్రిలలో 5 వేలకు పైగా, దంతెరాస్ ఇంకా దీపావళికి 3 వేలకు పైగా కార్లను పంపిణీ చేసినట్లు రెనాల్ట్ ఇండియా వర్గాలు తెలిపాయి. లాక్ డౌన్ తర్వాత మార్కెట్లు ఓపెన్ చేశాక గ్రామీణ ప్రాంతాలలో ప్రీ కోవిడ్ స్థాయిలతో పోలిస్తే (సుమారు 19% ప్రీ కోవిడ్ అలాగే 29% పోస్ట్ కోవిడ్) 50 శాతానికి పైగా పెరిగాయని చెప్పారు.

రెనాల్ట్ ఇండియా ప్రస్తుతం రైతులు, ఇతర గ్రామీణ ప్రాంతాల వారి కోసం ప్రత్యేక పథకాలను అందిస్తోంది, దీనికి అదే సానుకూల స్పందనను ఇచ్చింది. చాలా మంది మొదటి కొనుగోలుదారులను ఆకర్షించింది. డిమాండ్ ఎక్కువగా రెనాల్ట్ క్విడ్, ట్రైబర్ కార్లకు ఉందని తెలిపింది.

గత 7-8 సంవత్సరాలుగా గ్రామీణ అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ వృద్ధిని కొనసాగిస్తుంది, అయితే ఆదాయ కేంద్రాలు పడిపోవడం వల్ల పట్టణ కేంద్రాల అమ్మకాలు మందగించవచ్చని శ్రీవాస్తవ అన్నారు. రుతుపవనాలు, రబీ పంటలు, చౌక రుణాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి కార్ల విక్రయాలు పెరిగినట్లు ఆటో పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

సగటు వర్షపాతం 891 ఎం‌ఎం, గత సంవత్సరంతో పోలిస్తే 7 శాతం ఎక్కువ. రబీ పంట ఉత్పత్తి 152 మిలియన్ టన్నులు, గత సంవత్సరం 134 మిలియన్ టన్నులు అంటే 6 శాతం పెరిగింది. రబీ పంటలకు కనీస మద్దతు ధరను ప్రభుత్వం పెంచింది. అంతేకాకుండా ఖరీఫ్ పంటల విస్తీర్ణం గత ఏడాది 1005 మిలియన్ హెక్టార్ల నుండి 1100 మిలియన్ హెక్టార్లకు పెరిగింది.

 గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అమ్మకాలు పెరిగినప్పటికీ, ఎంఎస్‌ఐఎల్‌కు ఇంకా ఫిజికల్ షోరూమ్‌లు అవసరం, ఎందుకంటే ప్రజలు అధిక విలువ కలిగిన వాహనాన్ని కొనుగోలు చేసే ముందు చూడాలనుకుంటున్నారు అని శ్రీవాస్తవ అన్నారు. ఈ మార్కెట్లలో 14వేల మంది సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో 900 అవుట్‌లెట్లను కంపెనీ నియమించింది.