Asianet News TeluguAsianet News Telugu

మహీంద్రా నుండి కొత్త ఆఫ్-రోడ్ వాహనం....

మహీంద్రా కంపెనీ నుండి రోక్సర్ 2020 ఎడిషన్  ఆఫ్-రోడ్ వాహనన్నీ వెల్లడించింది. ఇది ఉత్తర అమెరికాలో విక్రయించబడుతున్న థార్ ఆధారిత ఆఫ్-రోడ్ వాహనం. ఇప్పుడు దీనికి మరికొన్ని అప్ డేట్స్ తో పాటు కొత్త గ్రిల్ అప్ ఫ్రంట్‌ను అమర్చారు.

mahindra revealed roxor 2020 off road vehicle
Author
Hyderabad, First Published Jan 27, 2020, 3:06 PM IST

మహీంద్రా ఆటోమోటివ్ నార్త్ అమెరికా (MANA) 2018 లోనే రోక్సర్ ఆఫ్-రోడ్ సైడ్ బై సైడ్ మోడల్‌ను విడుదల చేసింది. ఇది మహీంద్రా థార్‌ వాహనానికి అప్ డేట్ గా నిలుస్తుంది.  మహీంద్రా కంపెనీ నుండి రోక్సర్ 2020 ఎడిషన్  ఆఫ్-రోడ్ వాహనన్నీ చివరికి వెల్లడించింది. ఇది ఉత్తర అమెరికాలో విక్రయించబడుతున్న థార్ ఆధారిత ఆఫ్-రోడ్ వాహనం.

also read మెర్సిడెస్ బెంజ్ కొత్త సర్వీస్ ప్రోగ్రాం... కేవలం 3 గంటలో...

ఇప్పుడు దీనికి మరికొన్ని అప్ డేట్స్ తో పాటు కొత్త గ్రిల్ అప్ ఫ్రంట్‌ను అమర్చారు.ఇప్పుడు ఎం‌ఏ‌ఎన్‌ఏ 2020 రోక్సర్‌ కు  5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వేరియంట్‌కు ధర $ 15,999 డాలర్ల నుండి ప్రారంభమవుతుంది.అలాగే 6-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ ధర $ 16,999 డాలర్లు. కొత్త రోక్సోర్ లో అతిపెద్ద స్టైలింగ్ అప్ డేట్ ఏంటి అంటే దీని ఫ్రంట్ ఎండ్. ఇది 1970 ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జె సిరీస్‌ పోలికతో ఉంటుంది.

mahindra revealed roxor 2020 off road vehicle

దీనికి స్ట్రిప్ ఆఫ్ మెటల్ లాంటి 'రేస్ ట్రాక్' ఉంది. ఇది హెడ్‌ల్యాంప్‌ల చుట్టూ ఉంటుంది. ఇది చూడడానికి ఓల్డ్ స్కూల్ రూపాన్ని ఇస్తుంది.ఫ్రంట్ ఎండ్‌ను అప్‌డేట్ చేయడానికి మహీంద్రా ఎంచుకోవడానికి ఒక కారణం ఏమిటంటే, ఫిక్ట్ క్రిస్లర్ ఆటో రోక్సర్  గ్రిల్ అప్ ఫ్రంట్ డిజైన్ జీప్  ఐకానిక్ సేవన్-స్లాట్ డిజైన్ ఒకేలాగా ఉంది అని ఆరోపించింది.

also read యూత్ కోసం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్... హై స్పీడ్, లేటెస్ట్ ఫీచర్లతో...

మహీంద్రా రోక్సర్ దాని ఫీచర్లని, డిజైన కాపీ చేస్తుందని, నియమాలను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. మెకానికల్ బిట్స్ విషయానికొస్తే మహీంద్రా రోక్సర్ 2.5-లీటర్, 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇంజిన్ 62 బిహెచ్‌పి  ఉత్పత్తి చేస్తుంది.

యునైటెడ్ స్టేట్స్ లో అక్కడి నియమాల ప్రకారం రోక్సర్ వాహనం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్‌లో కూడా లభిస్తుంది. ట్రెడిషనల్ మాన్యువల్ ఫోర్-వీల్-డ్రైవ్ షిఫ్టర్‌తో పాటు మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కూడా ఉంది. రోక్సర్ టాప్ స్పీడ్ 88 కి.మీ. క్లెయిమ్ చేసింది. మహీంద్రా రోక్సర్‌ వాహనాన్ని మిచిగాన్‌లోని ఆబర్న్ హిల్స్‌లోని కంపెనీ ప్లాంట్‌లో తయారు చేస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios