భారతీయ విపణిలోకి జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి మరో కారును ఆవిష్కరించింది. తన వాహన శ్రేణిలో ‘క్యూ’ ఫ్యామిలీలో ఆడి క్యూ8 ఎస్‌యూవీ వాహనాన్ని విడుదల చేసింది. ప్రముఖ క్రీడాకారుడు, టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దీన్ని ఆవిష్కరించారు. దీని ధర రూ. 1.33 కోట్లుగా ఆడి కారు నిర్ణయించింది. 

ఈ మోడల్ డిజైన్‌, భద్రతాపరమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆడి సంస్థ ప్రకటించింది. దీనిలో భాగంగానే ఎనిమిది ఎయిర్‌ బ్యాగ్స్‌, ఆడి పార్క్‌ అసిస్ట్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలైజేషన్‌ ప్రోగ్రామ్‌ ప్రత్యేకంగా రూపొందించారు. 3.0 లీటర్‌ టీఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్‌ ఇంజిన్‌, 500 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ వద్ద 340 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. కేవలం 5.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే విధంగా ఈ మోడల్‌ను తీర్చిదిద్దారు. ట్రాన్స్‌మిషన్‌ డ్యూటీస్‌ను 8-స్పీడ్‌ టిప్‌ట్రోనిక్‌ లివర్ ద్వారా నిర్వహిస్తారు. 

సింగిల్ ఫ్రేమ్ ఆక్టాగోనాల్ డిజైన్‌తో రూపుదిద్దుకున్నదీ ఆడీ ‘క్యూ8’. 
21 అంగుళాల ఆప్షన్‌తో 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది ఆడీ క్యూ8. విత్ కంట్రోల్డ్ డాంపింగ్ అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ గల ఈ కారు స్పోర్ట్స్ సెటప్‌తో ఈ ఏర్పాటైంది. హెచ్డీ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ టెక్నాలజీ, హెడ్ ల్యాప్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. త్రీ డైమెన్షనల్ సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, లైట్ స్ట్రిప్ కనెక్ట్స్ టెయిల్ ల్యాంప్స్ పోర్షే కైండ్ లుక్ అందిస్తుందీ క్యూ8. గరిష్ఠంగా గంటకు 250 కిలోమీటర్ల దూరంతో దూసుకెళ్ల గల సామర్థ్యం కలిగి ఉంటుంది. 48 వోల్టుల మెయిన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ గల లిథియం ఆయాన్ బ్యాటరీ, బెల్ట్ ఆల్టర్నేటర్ స్టార్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.