భారతదేశంలో ఫుడ్ డెలివరీ చేయటంలో  ఆగ్రగామిగా ఉన్న జోమటో ఒక కొత్త సంచలనం సృష్టించింది. ఫుడ్ డెలివేరి సర్విస్ చేయటంలో భాగంగా ఉన్న ఉబర్  ఈట్స్ ని జోమటో చేజిక్కిచుకుంది. ఆల్-స్టాక్ ఒప్పందంలో భారతదేశంలోని ఉబెర్ ఈట్స్  ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను కొనుగోలు చేసినట్లు జోమాటో మంగళవారం ప్రకటించింది. దీపిందర్ గోయల్ నేతృత్వంలోని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో ఉబెర్ 9.99 శాతం వాటాను కలిగి ఉంది.

ఈ ఒప్పందానికి దగ్గరగా ఉన్న వర్గాల సమాచారం ప్రకారం ఇది 350 మిలియన్ డాలర్లు లేదా దాదాపు 2,500 కోట్ల రూపాయల ఉండొచ్చని అంచనా.భారతదేశంలో ఉబెర్ ఈట్స్ ప్రత్యక్ష రెస్టారెంట్లు, డెలివరీ భాగస్వాములు, ఉబెర్ ఈట్స్ యాప్ వినియోగదారులు వంటి కార్యకలాపాల నుండి తప్పుకోనున్నది. జోమాటో ప్లాట్‌ఫామ్‌ మంగళవారం నుండి ఆ కార్యకలాపాలు అమలు చేస్తుంది.

also read budget 2020: ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో.... రూ.90 వేల కోట్లు....

"భారతదేశంలోని 500 కి పైగా నగరాల్లో రెస్టారెంట్ ఆవిష్కరణలు, ప్రముఖ ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని ప్రారంభించినందుకు మేము గర్విస్తున్నాము. ఉబెర్ ఈట్స్ కొనుగోలు ఈ విభాగంలో మా స్థానాన్ని మరింత బలపరుస్తుంది" అని జోమాటో వ్యవస్థాపకుడు, సి‌ఈ‌ఓ దీపిందర్ గోయల్ అన్నారు.

కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం 2019 మొదటి మూడు త్రైమాసికాలలో, "మా ఉబెర్ ఈట్స్ వ్యాపారం గ్లోబల్ ఈట్స్ మొత్తం బుకింగ్‌లలో 3 శాతం కలిగి ఉంది". ఉబెర్ ఈట్స్  2017 మధ్యలో భారతదేశంలో తన ఫుడ్ డెలివరీ సర్విస్ ను  ప్రారంభించింది. కాని జోమాటో, స్విగ్గీ వంటి పెద్ద సంస్థల పోటీతో  లాభాలను పొందలేకపోయింది.ఇది ప్రస్తుతం 40కి పైగా నగరాల నుండి దాదాపు 26,000 రెస్ట్రూరెంట్లను కలిగి ఉంది.


బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్ తాజా అధ్యయనం ప్రకారం భారతదేశంలో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ మార్కెట్ ఏటా 16 శాతానికి పైగా పెరిగి 2023 నాటికి 17.02 బిలియన్ డాలర్లను తాకే అవకాశం ఉందని తెలిపింది.భారతదేశంలో ఉబెర్ ఈట్స్ బృందం గత రెండేళ్లుగా నమ్మలేని లాభాన్ని సాధించిందని ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి తెలిపారు.

also read బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలపై ఐటీ శాఖ దర్యాప్తు....

"ఉబర్‌కు భారతదేశం ముఖ్యమైన మార్కెట్‌గా ఉంది. మా ఉబెర్ రైడ్స్ వ్యాపారాన్ని మరింత పెంచుకోవటానికి మేము పెట్టుబడులు పెడతాము" అని ఖోస్రోషాహి అన్నారు."సమర్థవంతమైన పద్ధతిలో వేగంగా వృద్ధి చెందుతున్న జోమాటో సామర్థ్యానికి మేము చాలా అట్ట్రాక్ట్ అయ్యము. అది విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాము" అని ఆయన చెప్పారు.

చైనాకు చెందిన దిగ్గజం అలీబాబా అనుబంధ సంస్థ అయిన యాంట్ ఫైనాన్షియల్ నుండి 150 మిలియన్ డాలర్ల తాజా నిధులను సంపాదించినట్లు జనవరి 10న జోమాటో ప్రకటించింది. ప్రస్తుతం జోమాటో 3 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంది.