Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో పేదరికంలోకి 1.1 కోట్ల మంది.. కమ్ముకొస్తున్న తీవ్ర మాంద్యం

న్యూయార్క్ : కరోనా కల్లోలం కారణంగా తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో 1.1 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. కరోనా వైరస్ సృష్టించిన విలయానికి చైనాలో అభివృద్ధి నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నట్టు పేర్కొంది.

World economy will go into recession with likely exception of India, China: United Nations
Author
New Delhi, First Published Apr 1, 2020, 12:10 PM IST

న్యూయార్క్ : కరోనా కల్లోలం కారణంగా తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో 1.1 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. కరోనా వైరస్ సృష్టించిన విలయానికి చైనాలో అభివృద్ధి నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నట్టు పేర్కొంది. కరోనాకు ముందు తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో 3.5 కోట్ల మంది, ఒక్క చైనాలోనే 2.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడతారని గతంలో అంచనా వేశామని వెల్లడించింది. 

కానీ కరోనా కాటుతో పరిస్థితులు మరింత దిగజారాయని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారి అధమ స్థాయికి చేరితే పేదరికం పెరుగుతుందని తెలిపింది.

‘‘కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీనికారణంగా అభివృద్ధి నిలిచిపోవడంతో పాటు ఈ ప్రాంతంలో పేదరికం భారీగా పెరుగుతుంది...’’ అని ప్రపంచ బ్యాంకు తూర్పు ఆసియా, పసిఫిక్ వ్యవహారాల చీఫ్ ఆదిత్య మట్టూ పేర్కొన్నారు.

2019లో 6.1 శాతంగా ఉన్న చైనా వృద్ధి రేటు 2.3 శాతం మేర క్షీణించడం వల్ల ప్రాంతీయ వృద్ధిరేటు భారీగా పతనమవుతుందని ఆదిత్య మట్టూ వెల్లడించారు. కాగా రెండు నెలల క్రితమే చైనా ఈ సంవత్సరంలో 5.9 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 1990 తర్వాత చైనాలో ఇంత తక్కువ వృద్ధి రేటు నమోదు కావడం ఇదే తొలిసారి అని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. 

కోవిడ్-19 కారణంగా ఇప్పటికే సగానికి పైగా ప్రపంచ దేశాల్లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేస్తుండడంతో, పలు వ్యాపారాలు నష్టాల బాట పట్టాయి. దీనికి తోడు ఎక్కడికక్కడ రవాణా కూడా స్తంభించడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. 

అభివ్రుద్ధి చెందుతున్న తూర్ప ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో గతేడాది 5.8 శాతంగా ఉన్న ఆర్థిక వ్రుద్దిరేటు ఈ ఏడాది కనీసం 2.1 శాతానికి, పరిస్థితులు మరింత దిగజారితే -0.5 శాతానికి మందగించవచ్చుననని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. కరోనాను నిరోదించగలిగితేనే తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాలు కోలుకునే అవకాశం ఉంటుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 

కమ్ముకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు: ఐరాస
ఈ ఏడాది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యంలో కూరుకుంటుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. కరోనా కాటుతో ప్రపంచ దేశాలు లక్షల కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతాయని అంచనా వేసింది. భారత్, చైనా మినహా అభివ్రుద్ది చెందుతున్న దేశాలపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. 

అభివ్రుద్ధి చెందుతున్న దేశాలకు 2.5 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ అవసరం ఉందని ఐరాస వాణిజ్య అభివ్రుద్ది విభాగం (యూఎన్సీటీఏడీ) నివేదిక అభివ్రుద్ది చెందిన దేశాలకు సూచించింది. బాధిత దేశాలు రానున్న రెండేళ్లలో 2-3 లక్షల కోట్ల పెట్టుబడులు కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్, చైనా మాత్రం మాంద్యం నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయన్న ఐరాస అందుకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. 

also read:కరోనా ఎఫెక్ట్: స్టే చేసేందుకు గడువు పెంచాలి.. ట్రంప్ హెచ్‌-1బీ వీసాదారుల పిటిషన్

రెండు నెలల్లోనే పేద, వర్ధమాన దేశాలు దారుణంగా దెబ్బ తిన్నాయని ఐరాస నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఎగుమతులు ప్లస్ దిగుమతులు నిలిచిపోయాయి. పర్యాట రంగం స్తంభించి పోవడంతోపాటు దరలు పెరుగుతున్నాయని పేర్కొంది. 

అభివ్రుద్ది చెందిన జీ-20 దేశాలకు బయట 600 కోట్ల జనాభా ఉందని, వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ఆ దేశాలదేనని యూఎన్సీడీఏడీ సూచించింది. గడ్డు పరిస్థితుల నుంచి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నిబంధనలను సడలించి ఆయా దేశాలకు లక్ష కోట్ల డాలర్ల మేరకు ద్రవ్య లభ్యత కల్పించాలని పేర్కొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios