సోషల్‌ మీడియాలో స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌ పేరిట వచ్చిన ఒక సరికొత్త ఛాలెంజ్ ట్రెండ్‌ అవుతుంది. ఈ ప్రమాదకర ఛాలెంజ్‌ వీడియాలు సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌లో బాగా వైరల్ అవుతోంది. స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌ అంటే ముగ్గురు వ్యక్తులు నిల్చుంటారు.

అందులో ఇద్దరు వ్యక్తులు గాలిలో ఎగురుతుండగా, మూడో వ్యక్తి వారి మధ్యలో నిల్చుని అలాగే చేస్తుంటాడు. మధ్యలో వ్యక్తి పైకి ఎగిరినపుడు అతడి కాళ్లపై మిగిలిన ఇద్దరూ తన్నడం ఈ గేమ్ ప్రత్యేకత. మధ్యలో వ్యక్తి పైకి ఎగిరినపుడు కింద పడేలా తన్నడం చేయాలి.

also read ట్రంప్‌ పర్యటనపై ఇండియన్ కార్పొరేట్ల భారీ ఆశలు....

అయితే ఏ గేమ్ కాస్త వైరల్ అయ్యి  యువత ఈ ఛాలెంజ్‌ మత్తులో కూరుకుపోయారు.గతంలో కూడా సిన్నామన్ ఛాలెంజ్, టైడ్ పాడ్ ఛాలెంజ్, కైలీ జెన్నర్ లిప్ ఛాలెంజ్ వంటి ప్రమాదకరమైన చాల్లెంజులో కూడా యువకులు పాల్గొన్నారు.

 తాజాగా వెనిజులా దేశంలోని స్కూల్ విద్యార్దులు స్కల్‌ బ్రేకర్‌ ఛాలెంజ్‌లో పాల్గొనడం వల్ల  ఒక బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఛాలెంజ్ వీడియొ చేయడం వల్ల తలకు గాయాలు అయ్యి బాలుడిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్పించినట్లు ఒక పత్రిక  తెలిపింది.

ప్రస్తుతం ఆ ఛాలెంజ్ వీడియో వైరల్ అయ్యింది.ఛాలెంజ్‌లో పాల్గొన్న ముగ్గురు స్కూల్ విద్యార్దులపై కూడా యాజమాన్యం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.ఇలాంటి  ఛాలెంజ్‌లో  పాల్గొనేవారికి తీవ్రమైన గాయాలు, ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సోషల్ మీడియాలో చాలా మంది ఈ ప్రమాదకరమైన వీడియొలను షేర్ చేస్తున్నరు. ప్రజలను, ముఖ్యంగా యువకులను ఇందులో పాల్గొనకుండా ఉండాలని నిపుణులు  విజ్ఞప్తి చేస్తున్నారు.

 also read  కరోనా వైరస్ కారణంగా పెరగానున్న స్మార్ట్​ఫోన్ ధరలు...


సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియొలు చేయటం నిజంగా ప్రమాదకరమని  దీనివల్ల తలకు దెబ్బ తగిలి, తీవ్రమైన సమస్యను కలిగిస్తుంది అని డాక్టర్లు చెబుతున్నారు.

 
 ఒక ప్రకటనలో  టిక్‌టాక్  యాప్ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ "మా వినియోగదారుల భద్రత, శ్రేయస్సు అనేది టిక్‌టాక్‌ యాప్ ముఖ్య ఉద్దేశం. మా కమ్యూనిటీ మార్గదర్శకాలలో మేము స్పష్టం చేశాము.

ఈ లాంటి ప్రమాదకరమైన  ప్రోత్సహించే వీడియొలను లేదా అలాంటి కంటెంట్‌ను మేము అనుమతించము, ప్రోత్సహించము. ఇంకా అలాంటి  వీడియొ కంటెంట్‌ను మేము మా యాప్ నుండి తొలగిస్తాము." అని అన్నారు.