ఏప్రిల్-మేలో జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందు జరగనున్న చివరి సెషన్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 9 వరకు కొనసాగే అవకాశం ఉంది.

మధ్యంతర బడ్జెట్‌లో ఆధ్యాత్మిక పర్యాటకం, ఉత్పత్తి లింక్ ప్రోత్సాహకాలు (పిఐఎల్)పై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) నేషనల్ కౌన్సిల్ ఫర్ MSME చైర్మన్ మంగూరిష్ పై రైకర్ విజ్ఞప్తి చేశారు. 

ఈ మేరకు రైకర్ ఏఎన్ఐతో మాట్లాడుతూ, "వ్యాపారాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు తీసుకుంటోంది... అతి త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నాం... ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్స్ మెరుగుపరచబడుతుంది, మరిన్ని ఉత్పత్తులు ఇందులోకి తీసుకురాబడతాయి, మరిన్ని ఉత్పత్తులు పెరుగుతాయి. భారతదేశంలో పెట్టుబడులకు మరింత అవకాశం ఉంటుంది" అని చెప్పుకొచ్చారు. 

"రెండవది, వారణాసి. అయోధ్యలో మనం చూసినట్లుగా చాలా మందిని ఆకర్షించిన ఆధ్యాత్మిక పర్యాటకం కోసం కూడా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఇతర ప్రదేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కొత్త బడ్జెట్‌లో ప్రచారం కోసం ఏదో ఒకదాన్ని తీసుకువస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు... ఆరోగ్యం, విద్యా రంగంపై ఇతర కార్యక్రమాలు తీసుకుంటారు. ఇదే మేం ప్రభుత్వం నుండి ఆశిస్తున్నాం"అన్నారాయన.

Union Budget 2024: పారిస్ ఒలింపిక్స్ టార్గెట్, భారీ బడ్జెట్‌ ఆశిస్తున్న క్రీడారంగం!

ఏప్రిల్-మేలో జరిగే సాధారణ ఎన్నికలకు ముందు చివరి సెషన్ అయిన పార్లమెంట్ బడ్జెట్ సెషన్ జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 9 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడే వరకు మధ్యంతర బడ్జెట్ సాధారణంగా ఆర్థిక అవసరాలను చూసుకుంటుంది.

ఇదిలావుండగా, భారత పరిశ్రమల సమాఖ్య (CII) బడ్జెట్ సమర్పణకు ముందు కీలక సిఫార్సులను జారీ చేసింది. అవి డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను చేరుకోవడం, డిజిన్వెస్ట్‌మెంట్ కోసం 3-సంవత్సరాల షెడ్యూల్‌ను ఏర్పాటు చేయడం; పెట్రోలియం, విద్యుత్ & రియల్ ఎస్టేట్‌ను జీఎస్టీలో చేర్చడం, 3-రేటు నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకోవడం; క్యాపెక్స్‌ను 20% పెంచి రూ. 12 లక్షల కోట్లకు పెంచడంతోపాటు పూర్తి స్థాయి పెట్టుబడి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం...వంటివి ఉన్నాయి.