Asianet News TeluguAsianet News Telugu

స్టార్లను మించిన క్రేజ్... సోషల్ మీడియాలో దూకుకెళ్తున్నా వ్యాపారవేత్తలు

కార్పొరేట్ ఇండియా అంటే అనునిత్యం వ్యాపార లావాదేవీలు.. సమావేశాలు బిజీబిజీగా గడిపే పారిశ్రామిక వేత్తల సమాహారం. అయితే వీరిలో కొందరు విభిన్నం. ఒకవైపు తమ సంస్థల కార్యకలాపాలు కొనసాగిస్తూనే మరోవైపు సమకాలీన పరిస్థితులు, తమ రంగాల్లోని విశేషాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. తమ అభిమానులను అలరింపజేస్తుంటారు. వారి గురించి ఓసారి పరిశీలిద్దాం..

They are legends not only in  business in social media  also
Author
Hyderabad, First Published Feb 15, 2020, 11:41 AM IST

న్యూఢిల్లీ: సెలబ్రిటీలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది సినిమా రంగం వారు మాత్రమే. తర్వాతి స్థానంలో రాజకీయ పార్టీల నాయకులుంటారు. అయితే వారు తమ వ్యక్తిగత, వృత్తి విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తమ అభిమానులతో పంచుకుంటుంటారు. అందుకే వీరిని ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఎక్కువ మంది ఫాలో అవుతారు. 

మరి వ్యాపారవేత్తలయితే నిత్యం ప్రణాళికలు, సమావేశాలతో రోజంతా తీరికే ఉండదు. ఇక వారికి సోషల్ మీడియా వేదికల కోసం టైం కేటాయించే తీరికే ఉండదు. అయితే దీనికి భిన్నంగా కొంత మంది వ్యాపారవేత్తలు సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటూ సమకాలీన అంశాలపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

దానితోపాటు తమ వ్యాపార సంబంధ విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు కార్పొరేట్ ఇండియా ప్రముఖులు. అలా సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్‌తో కొంత మంది వ్యాపారవేత్తలు సెలబ్రిటీలతో పోటీ పడుతున్నారు. 

also read  రైల్వే టికెట్‌ బుకింగులపై సంచలన నిర్ణయం...రానున్న రోజుల్లో ఇక పూర్తిగా....


మహీంద్రా గ్రూప్ చైర్మన్‌గా కీలకమైనా..  
మహీంద్రా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఆనంద్ మహీంద్రా కీలకమైన పదవిలో ఉన్నా సమకాలీన అంశాలపై ట్విటర్‌ వేదికగా తనదైన శైలిలో స్పందిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు ఆలోచింప జేస్తారు. ఆయనను ట్విటర్లో 74 లక్షల మంది ఫాలో అవుతున్నారంటే మహీంద్రాకు ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 

ప్రజలతో మమేకానికి సోషల్ మీడియా వేదిక
మహీంద్రా గ్రూప్ కంపెనీల్లో ఉద్యోగులు, ప్రజలతో మమేకం అయ్యేందుకు సోషల్ మీడియా వేదికలు ఎంతో ఉపయోగ పడుతున్నాయని ఆనంద్ మహీంద్రా ఓ సందర్భంలో ప్రస్తావించారు. తనను కారు ఎంత మైలేజీ ఇస్తుందని అడిగిన వ్యక్తికి ఇది (ఎలక్ట్రిక్‌ కారు) మైలేజీ ఇవ్వదు షాక్‌ ఇస్తుందని చమత్కరించటం ఆనంద్ మహీంద్రాకే చెల్లింది.

సమాజంలోని మరో కోణం కోసం రతన్ టాటా ఇన్ స్టాగ్రామ్  
టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకొన్నాక ప్రజలతో మమేకం అవటంతో పాటు, సమాజాన్ని మరో కోణం నుంచి చూసేందుకు తాను ఇన్‌స్టాగ్రాం ఖాతా తెరుస్తున్నట్లు రతన్‌ టాటా తెలిపారు. 

They are legends not only in  business in social media  also

రతన్ టాటా ఫాలోవర్లు 10 లక్షలు
రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన నాలుగు నెలల్లోనే ఫాలోవర్ల సంఖ్య ఒక మిలియన్‌ (10 లక్షల) మార్క్‌ను చేరుకోవడం ఆయనకు నెట్టింట్లో ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఆయన పెట్టిన ఫొటో ఒకటి ఎంతో పాపులర్‌ అయ్యింది. అంతే కాకుండా తనను ‘చోటు’ అని పిలిచిన నెటిజన్‌కు ఆయన ఇచ్చిన సమాధానం ఎంతో మందిని ఆకట్టుకుంది.

సర్కార్ తీరుపై కిరణ్ మంజుదార్‌ షా నిశిత విమర్శలు
మహిళా పారిశ్రామికవేత్త, బయోకాన్ ఛైర్‌పర్సన్‌ కిరణ మజుందార్‌ షా కూడా సామాజిక మాధ్యమాల్లో తన శైలిలో స్పందిస్తుంటారు. పలు సందర్భాల్లో ట్విటర్‌ వేదికగా ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు గుప్పించారు.

ట్విట్టర్‌లో 14 లక్షల మందికి పైగా కిరణ్ ఫాలోవర్స్
వ్యక్తిగత విషయాలను కాకుండా వృత్తి పరమైన, రాజకీయ, సమాజానికి సంబంధించిన ఎన్నో అంశాలపై ఆమె ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. అందుకేనేమో ఆమెకు ట్విటర్లో 14 లక్షల మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.

ఢిల్లీ ఫలితాలపై హర్ష గోయెంకా ఫన్నీ ట్వీట్
‘‘నీటి నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని నేను నా ఇంజనీరింగ్‌లో చదివాను. కానీ నీరు, విద్యుత్‌ కలిసి ప్రభుత్వ అధికారాన్ని ఇస్తాయని ఢిల్లీలో ఒక ఐఐటీ ఇంజనీర్‌ నన్ను నేర్చుకునేలా చేశాడు’ అని ప్రముఖ వ్యాపార వేత్త హర్ష గోయంకా చేసిన ట్వీట్‌తో ఆయన సోషల్ మీడియాలో ఎంత చురుకైన వ్యక్తో తెలియజేస్తుంది. ట్విటర్లో ఆయన్ను 15 లక్షల మంది ఫాలో అవుతున్నారు.


టెక్నాలజీపై నీలేకనికి పట్టు.. 25 లక్షల మంది ఫ్యాన్స్

ఇన్ఫోసిస్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా, ఆధార్‌ ప్రాజెక్ట్‌ ఛైర్మన్‌గా, రచయితగా నందన్‌ నీలేకని కీలకమైన పదవులను సమర్థంగా నిర్వహించారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు.  ట్విటర్‌లో ఆయన్ను 25 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇక నీలేకని ఎక్కువగా ఆధార్‌, వ్యాపారం, సాంకేతికత, ఆర్థికపరమైన అంశాలను ఎక్కువగా షేర్‌ చేస్తున్నారు.

also read "ప్రేమలో పడిపోయాను, దాదాపు పెళ్లి కూడా...": రతన్ టాటా

ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా స్థానం సంపాదించుకున్న అమెజాన్ అధినేత జెఫ్‌ బెజోస్‌ను ట్విటర్లో 12లక్షల మంది ఫాలో అవుతున్నారు. అమెజాన్‌ పేరుతో ఆన్‌లైన్‌ మార్కెట్‌ను ప్రపంచంలో మారుమూల ప్రాంతాలకు చేరువ చేసిన బెజోస్‌ ఎక్కువగా తన వ్యాపార విషయాలనే ట్విటర్లో షేర్‌ చేసుకుంటున్నారు.

అతి తక్కువ ధరకే విద్యుత్ కార్లు ఎలాన్‌ మస్క్‌ స్పెషాలిటీ
తక్కువ ధరకు వేగవంతమైన విద్యుత్ కార్లను అందించే సంస్థగా అనతికాలంలోనే టెస్లా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అంతే కాక స్పేస్‌ ఎక్స్‌ పేరుతో చౌకగా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టడం, భవిష్యత్ ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు హైపర్‌లూప్ లాంటి సంస్థలతో పాటు కార్లలో కృత్రిమ టెక్నాలజీని అందుబాటులోకి తేవడం వంటి ఎన్నో విలక్షణ వ్యాపారాలు ఆయన మానస పుత్రికలు. 

ఎలన్ మాస్క్ కు మూడు కోట్ల మంది ట్విట్టరీల పాలో
ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతోపాటు వ్యాపారం, టెక్నాలజీ, తన భవిష్యత్తు ప్రణాళికలవిషయాలు ట్విటర్లో షేర్‌ చేసుకుంటారు. దాదాపు 3.1 కోట్ల మంది ఆయన్ను ట్విటర్లో ఫాలో అవుతున్నారు. ఇటీవల ఆయన ‘బాజీరావ్ మస్తానీ’ సినిమాలోని దీవాన్‌ మస్తాన్‌ పాట జిఫ్‌ ఇమేజ్‌ను పోస్ట్ చేస్తూ దాని సంబంధించిన వీడియో లింక్‌ను షేర్‌ చేశారు. ఆయన ఈ ట్వీట్ చేయగానే భారత్ నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు స్పందించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios