స్థానిక హస్తకళాకారులు, చేనేత కార్మికుల ఉత్పాదనలకు ఆన్‌లైన్ లో భారీ డిమాండ్
తమ సంప్రదాయాలు, జీవనోపాధిని కాపాడుకోవడం కోసం భారతీయ కళాకారులు, చేనేత కార్మికులు ఏళ్లుగా ఎంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల కారణంగా ప్రస్తుతం వీరి అమ్మకాలలో భారీ పెరుగుదల చోటు చేసుకోవడం ఓ విశేషం.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆదిలక్ష్మి టాయ్స్ యజమాని అడవి శ్రీనివాస్ నే ఉదాహరణగా తీసుకుంటే ఆయన తన సొంత వ్యాపార కలలను నిజం చేసుకునేందుకు సోషల్ మీడియా, జియోమార్ట్ తో సహా కొత్త పంపిణీ ఛానెల్‌లను ఆశ్రయించారు. జియోమార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్స్ నిర్వహించే హస్తకళా మేళాలు శ్రీనివాస్ వంటి కళాకారులు, వ్యాపారులు తమ సంప్రదాయ హస్తకళలను దేశవ్యాప్తంగా ఉన్న కొత్త వినియోగదారులకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్‌లో ఆదిలక్ష్మి టాయ్స్ ను ప్రారంభించడానికి 2019లో తాను 18 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టిన శ్రీనివాస్ కూడా డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్‌లను ఆశ్రయించడం ద్వారా, ఫేస్‌బుక్ ప్రకటనల వైపు మళ్లడం, సోషల్ మీడియా ఉనికిని బలంగా నిర్మించుకోవడం ద్వారా అధిక విక్రయాలను సంపాదించగలిగారు.
జియోమార్ట్ లో విక్రేతగా ఉన్న శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లడుతూ, ‘‘సంప్రదాయ కళాకారులు, చేనేత కార్మికులకు డిజిటలైజేషన్ గురించి చాలా తక్కువ తెలుసు. వారి కళను మార్కెట్లోకి తీసుకురావడం, వారిని ఆదుకోవడం చాలా ముఖ్యం. విషతుల్యం కాని, మన్నికైన, సుస్థిరదాయకమైన చెక్క బొమ్మలకు ప్రాచుర్యం కల్పించడమే నా లక్ష్యం" అని అన్నారు.
అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుండి అధిక ఆర్డర్‌లను పొందడమే కాకుండా, ఆయన ప్రస్తుతం బొమ్మలను కూడా ఎగుమతి చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతని కస్టమర్లలో అధిక భాగం 40-50 సంవత్సరాల వయస్సులో ఉన్నారు.
ఇంకొక స్వదేశీ అమ్మకందారుడు అదిల్, అంతరించిపోతున్న హస్తకళల్లో ఒకదానికి జీవం పోయడానికి డిజిటల్ శక్తిని ఉపయోగించడం ప్రారంభించారు. వందేళ్ల కాలంగా ఆయన కుటుంబం నిర్వహించే వ్యాపారం చెన్నపట్న బొమ్మలు అనేక మంది స్థానిక హస్తకళాకారులపై ప్రభావం చూపుతున్నాయి.
“నాతో దాదాపు 35 మంది కళాకారులు పనిచేస్తున్నారు. కొందరు 40 ఏళ్లకు పైగా పని చేస్తుంటే, మరి కొందరు 60 ఏళ్లు పైబడిన వారు ” అని ఆయన అన్నారు.
“ఈ కళాకారులకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు జీవనోపాధికి ప్రధాన వనరుగా మారాయి. ఈ సౌకర్యాలు మా నాన్నకి, తాతకి లేవు. కానీ నేడు, నేను తక్కువ పెట్టుబడితో కొనుగోలుదారులతో సన్నిహితంగా ఉండటానికి, అమిత ప్రభావాన్ని కలిగించడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల శక్తిని ఉపయోగించగలీగాను. మన అద్భుతమైన హస్తకళల వారసత్వాన్ని కాపాడుకోవడంతో పాటు, వ్యాపారాన్ని విస్తరించాలని, భారతదేశం నుండి ఈ విలక్షణమైన చెన్నపట్న బొమ్మలను ప్రపంచానికి అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నాను” అని అన్నారాయన.