కొత్త పన్ను విధానం ఎంపిక చేసుకున్న వారి సంఖ్య 5.50 కోట్లు దాటింది...రెవెన్యూ గణాంకాల్లో వెల్లడి..

రెవెన్యూ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 5.5 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు కొత్త టాక్స్ సిస్టం లోకి మారారు. ఈ పన్ను చెల్లింపుదారులలో ఎక్కువ మంది వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు కలిగి ఉన్నారని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు వార్తా సంస్థతో  తెలిపారు.

The number of people who have opted for the new tax system has crossed 5.50 crores Revealed in the revenue statistics MKA

ఈ ఏడాది బడ్జెట్‌లో కొన్ని మార్పులతో కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. నిజానికి కొత్త టాక్స్ సిస్టం 2020-21లో ప్రారంభించినప్పటి నుండి చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి దూరంగా ఉన్నారు.   అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యల ద్వారా చాలామంది కొత్త ఉద్యోగులు నూతన పన్ను విధానానికి  మార్పు చెందుతున్నారు. 

 బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పేర్కొన్నటువంటి సమాచారం ప్రకారం  5.5 కోట్ల మంది ప్రజలు కొత్త పన్ను విధానాన్ని  స్వీకరించినట్లు పేర్కొంది.  సంవత్సరానికి రూ. 7.5 నుండి 8 లక్షలు లేదా రూ. 10 లక్షల మధ్య సంపాదిస్తున్నచాలా మంది యువ పన్ను చెల్లింపుదారులు అనువైన, పారదర్శక పద్ధతిలో పన్నులు చెల్లించడానికి ఇష్టపడుతున్నట్లు పేర్కొంది. అయితే కొత్త టాక్స్ సిస్టం  తమకు ఉపయోగపడుతుందో లేదో చూసి, తిరిగి చాలా మంది పాత పన్ను వ్యవస్థకు తిరిగి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆదాయపు పన్ను శాఖ  FY 2023 డేటా ప్రకారం మొత్తం 4.84 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు రూ. 5 లక్షల వరకు పన్ను విధించదగిన ఆదాయాన్ని కలిగి ఉన్నారు. 1.12 కోట్ల మందికి పైగా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉండగా, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య పన్ను చెల్లింపుదారుల సంఖ్య 47 లక్షలుగా ఉంది. మిడ్-హై ఇన్ కమ్ గ్రూప్ కేటగిరీలో (రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షలు) పన్ను చెల్లింపుదారుల సంఖ్య 20 లక్షలు కాగా, రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య పన్ను చెల్లించే ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారులు 3.8 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా, 2.6 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు కోటి రూపాయల కంటే ఎక్కువ పన్ను విధించదగిన ఆదాయాన్ని కలిగి ఉన్నారు.

కొత్త టాక్స్ సిస్టం లో పాత విధానంలో లాగా ఎలాంటి మినహాయింపులు లేవు. వేతన జీవులు చాల మంది  కొత్త టాక్స్ సిస్టం లోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ఏడాది బడ్జెట్‌లో కొన్ని మార్పులు చేశారు. కొత్త టాక్స్ సిస్టం  ఇప్పుడు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు డిఫాల్ట్‌గా మార్చారు. కొత్త టాక్స్ సిస్టం లో, సంవత్సరానికి రూ.7 లక్షల వరకు సంపాదిస్తున్న వారిపై ఎలాంటి పన్ను విధించబడదు. అలాగే రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ అందుబాటులో ఉంటుంది ,  ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచారు. కొత్త టాక్స్ సిస్టం  ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అటువంటి పరిస్థితిలో, యజమానులు ఏ వ్యవస్థను ఎంచుకుంటున్నారని అడిగారు, తద్వారా వారి జీతం నుండి తదనుగుణంగా పన్ను తగ్గించవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios