చంద్రయాన్ 1,2,3 సాధించిన విజయాలు అపూర్వం..ప్రతీ భారతీయుడు తెలుసుకోవాల్సిన జైత్రయాత్ర విశేషాలు ఇవే..

భారతదేశ మిషన్ చంద్రయాన్-3 చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.  అమెరికా, రష్యా వంటి దేశాలు కూడా పలు మార్లు విఫలమైన ఈ మిషన్ లో భారత్ మాత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. 

The achievements of Chandrayaan 1,2,3 are unprecedented These are the features of Jaitrayatra that every Indian should know MKA

ఇస్రో చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేవలేనుంది.  చంద్రయాన్ 3  ప్రయోగం మరికొద్ది గంటల్లోనే చంద్రుడు పై ల్యాండ్ కానుంది.  దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉద్విగ్న భరితంగా ఉన్నారు. శాస్త్రవేత్తలు అకుంఠిత దీక్షతో చేస్తున్నటువంటి ఈ ప్రయోగం ఇప్పటికే పలు విజయాలు సాధించింది ఆ విజయాల పరంపర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశం చంద్రయాన్-2 మిషన్ ఫెయిల్ అయినప్పటికీ, , భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) తన ప్రయోగాలతో చంద్రయాన్- 3 కి శ్రీకారం చుట్టింది. చంద్రుని మిషన్‌లో అమెరికా 26 సార్లు విఫలమైతే రష్యా 14 సార్లు విఫలమైనప్పటికీ భారత్ మాత్రం చంద్రయాన్ 3 దశల్లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. అసలు చంద్రయాన్ సాధించిన విజయాలు ఏంటో తెలుసుకుందాం. 

చంద్రయాన్ 1 సాధించిన విజయాలు ఇవే..

చంద్రునిపైకి భారతదేశం పంపిన మొదటి మిషన్ చంద్రయాన్-1. ఈ మిషన్ లో భారతదేశం  పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV-C II నుండి 22 అక్టోబర్ 2008న శ్రీ హరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించబడింది. ఈ వ్యోమనౌక చంద్రునికి 3400 కంటే ఎక్కువ సార్లు తిరిగింది.  చంద్రునిపై నీటి ఉనికిని చంద్రయాన్-1 నిర్ధారించింది, ఈ ఆవిష్కరణ భిన్నంగా ఉంది. చంద్రుని ఉత్తర ధ్రువ ప్రాంతంలో మంచు రూపంలో నీరు చేరడాన్ని కూడా చంద్రయాన్-1 కనుగొంది. ఇది చంద్రుని ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్‌లను కూడా గుర్తించింది, చంద్రుని  గ్లోబల్ మ్యాప్‌ను సిద్ధం చేయడం ఈ మిషన్ మరొక ప్రధాన విజయం.

చంద్రయాన్ 2 నేర్పిన పాఠం ఏంటి..? 

చంద్రయాన్-2 నిజానికి చంద్రయాన్-1 మిషన్‌కు సీక్వెల్. చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్) ను చంద్రుడిపై ఇన్ స్టాల్ చేయాల్సి ఉంది. చంద్రయాన్-2 తన 'విక్రమ్' మాడ్యూల్‌ను చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ చేయించి, చంద్రునిపై 6 చక్రాల రోవర్ "ప్రజ్ఞాన్"ని చంద్రుడిపై ఇన్ స్టాల్ చేయాల్సి ఉంది. చంద్రయాన్-1లో రోవర్ లేదు. చంద్రయాన్-1 లిఫ్ట్-ఆఫ్ బరువు 1380 కిలోలు కాగా, చంద్రయాన్-2 బరువు 3850 కిలోలుగా ఉంది.  చంద్రయాన్-2 లక్ష్యం చంద్రునిపై దిగడం, దాని ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి రోవర్‌ను అమర్చడం, తద్వారా చంద్రయాన్-1 పరిధిని మరింత పెంచడంగా పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తూ చంద్రయాన్ 2 మిషన్ అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఈ మిషన్ క్రాష్ లాండింగ్ వల్ల ఫెయిల్ అయ్యింది. అందుకే శాస్త్రవేత్తలు మరింత జాగ్రత్తగా ఈ సారి చంద్రయాన్ 3లో జాగ్రత్తలు తీసుకున్నారు. 

చంద్రయాన్-3 ఎందుకు గర్వకారణం..

ఇస్రో ప్రకారం, చంద్రయాన్-3 మిషన్. చంద్రయాన్-2  తదుపరి దశ, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది ఈ మిషన్ ప్రారంబించారు. ఇందులో చంద్రుని ఉపరితలంపై రోవర్  దిగి పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ లాంచింగ్ దశలు ఉంటాయి. భారతదేశం ప్రతిష్టాత్మక చంద్రయాన్-3  ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతుంది. ప్రపంచం మొత్తం ఈ ల్యాండింగ్‌ గురించి ఎదురు చూస్తోంది.  ఎందుకంటే చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి వాహనం చంద్రయాన్-3 కావడం విశేషం. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో బుధవారం సాయంత్రం 6.4 0గంటలకు చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్‌ను ల్యాండ్ చేయనుంది.   చంద్రునిపై చంద్రయాన్-3 దిగడానికి 2 గంటల ముందు, ఆగస్టు 23న, ల్యాండర్ మాడ్యూల్ పరిస్థితి చంద్రునిపై పరిస్థితుల గురించి తెలుసుకుంటుంది. ఆపై వాహనాన్ని ఇక్కడ ల్యాండ్ చేయడం సముచితమో లేదో నిర్ణయిస్తామని ఇస్రో అధికారులు తెలిపారు. ఆ సమయం లేదా సమస్య లేకుంటే ఆగస్టు 23న రోవర్ ను సకాలంలో ల్యాండ్‌ చేస్తాం. భారత్‌ చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతమైతే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన తొలి దేశంగా అవతరిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios