Asianet News TeluguAsianet News Telugu

కొత్తగా 20 విమానాలను ప్రారంభించనున్న స్పైయిస్ జెట్....

స్పైయిస్ జెట్ వైమానిక సంస్థ  కొత్త విమానాలను త్వరలోనే ప్రవేశపెడుతున్నట్లు బుధవారం ప్రకటించింది. 29 మార్చి 2020 నుండి 20 కొత్త విమానాలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. 

spicejet launches 20 new domestic flights from march 29
Author
Hyderabad, First Published Feb 22, 2020, 4:52 PM IST

స్పైయిస్ జెట్ వైమానిక సంస్థ  కొత్త విమానాలను త్వరలోనే ప్రవేశపెడుతున్నట్లు బుధవారం ప్రకటించింది. 29 మార్చి 2020 నుండి 20 కొత్త విమానాలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. వారణాసి-పాట్నా, అమృత్ సర్-పాట్నా మార్గాల్లో నాన్‌స్టాప్ ఫ్లైట్ సేవలను ప్రారంభించింది.

దేశంలో మొట్టమొదటి ఏకైక క్యారియర్‌గా ఈ వైమానిక సంస్థ ఉంటుంది. ఈ కొత్త విమానాల ప్రారంభంతో, వైమానిక సంస్థ ఇప్పుడు ప్రాంతీయ కనెక్టివిటీ పథకం కింద 12 నగరాలను కలిపి మొత్తం 52 విమానాలను నడుపుతుంది.

also read ఆపిల్‌ సీఈవోకు ఎదురైన వింతైన సంఘటన, కోర్టులో ఫిర్యాదు

ఆర్‌సిఎస్ కింద భారతీయ విమానయాన సంస్థ నడుపుతున్న అత్యధిక విమానాలు స్పైస్‌జెట్ సంస్థవే.వీటితో పాటు, తక్కువ ధర కలిగిన క్యారియర్ గువహతి-పాట్నా, హైదరాబాద్-మంగళూరు, బెంగళూరు-జబల్పూర్, పాట్నా-వారణాసి, ముంబై- ఔరంగాబాద్ రుట్లలో కొత్త విమానాలను ప్రవేశపెట్టింది.

ముంబై-బాగ్డోగ్రా, ముంబై-చెన్నై, హైదరాబాద్-మంగళూరు, గువహతి- ఢిల్లీ రుట్లలో స్పైస్‌జెట్ అదనపు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. 20 కొత్త దేశీయ విమానాలను ప్రారంభించినందుకు  సంతోషంగా ఉందని స్పైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్పా భాటియా తెలిపారు.

also read చైనా విమానాలకు కరోనా వైరస్.... 2లక్షల కోట్ల నష్టం అంచనా....

తమ నెట్‌వర్క్‌ను కొత్త నగరాలుకు విస్తరించి, మరింత ఎక్కువ మందికి సరసమైన ధరల్లో విమాన ప్రయాణ సేవలను అందిస్తామన్నారు. అలాగే మెట్రోలు, నాన్-మెట్రోల మధ్య కనెక్టివిటీని పెంచడంతో పాటు దేశంలోని అనుసంధానించబడని భాగాలను కూడా అనుసంధానించడంపై కూడా  దృష్టి పెట్టామని చెప్పారు. ప్రవేశపెట్టిన కొత్త విమానాలన్నీ ప్రతిరోజూ పనిచేస్తాయి అని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios