Raksha Bandhan 2023: ప్రధాని మోదీ దెబ్బకు చైనాకు చెక్...మార్కెట్ నుంచి చైనా రాఖీలు మాయం..

గత కొన్నేళ్లుగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ   పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్  నినాదం బలంగా పనిచేస్తోంది.  దీంతో భారతీయ పండగలపై కన్నేసి డబ్బులు సంపాదించాలని చూస్తున్న చైనాకు పెద్ద ఎత్తున దెబ్బ తగిలింది. ఈ సంవత్సరం మార్కెట్లో  చైనా తయారు చేసిన రాఖీలు మార్కెట్‌లో కనిపించకుండా పోయాయి. 

Raksha Bandhan 2023: Check to China due to Prime Minister Modi's blow...Chinese rakhis disappeared from the market MKA

ఢిల్లీలోని అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ సదర్ బజార్‌లో, ఈసారి రక్షా బంధన్ పండుగ సందర్భంగా, చైనా తయారు చేసిన రాఖీలు  కనిపించడం లేదు. కేవలం భారతీయ రాఖీలు మాత్రమే విస్తారంగా ఉన్నాయి. దీంతో దుకాణదారులలో ఉత్సాహం నెలకొని ఉంది.  ఈసారి మంచి వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. సదర్ బజార్‌లో చైనాలో తయారు చేసిన రాఖీలు  గతంలో భారీగా లభించేవి.  స్థానిక గడిచిన కొద్ది సంవత్సరాలుగా  కస్టమర్లు చైనా రాఖీలను కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు దీంతో దేశీయ రాఖీలకు మంచి డిమాండ్ పెరిగిందని స్థానిక దుకాణాదారులు చెబుతున్నారు. చైనా రాఖీలకి డిమాండ్ తగ్గడానికి దాని  ధర, నాణ్యత తక్కువగా ఉండటం కూడా ఒక ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. 

మార్కెట్‌లో 80 శాతం భారతీయ రాఖీలు

ఢిల్లీ ట్రేడ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ దేవ్‌రాజ్ బవేజా పిటిఐతో వార్తా సంస్థతో మాట్లాడుతూ, "భారతీయ రాఖీలు మార్కెట్లో 80 శాతం  ఆక్రమించినట్లు ఆయన పేర్కొన్నారు. రాఖీల మార్కెట్‌లో చైనా వాటా దాదాపు 20 శాతం  మాత్రమే ఉందని అది కూడా ముడిసరుకు రూపంలో మాత్రమే. ఉందని  ఆయన పేర్కొన్నారు.  గత మూడు-నాలుగేళ్లలో చైనా రాఖీలకు డిమాండ్ తగ్గిందని  మరికొందరు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో చైనా నుంచి చాలా రాఖీలు వచ్చేవి. రాఖీల హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. 

రాఖీ పండగ సందర్భంగా 10 వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందని అంచనా

దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారుల జాతీయ సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ ఖండేల్వాల్ ఈసారి రాఖీ సందర్భంగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా రూ.10,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు.  కొన్నేళ్ల క్రితం వరకు భారత మార్కెట్‌లో చైనా ఆక్రమణ పరిస్థితి ఉండేదని, దాదాపు రూ. 4,000 కోట్ల  విలువైన రాఖీలు లేదా ఉత్పత్తులు చైనా నుంచి దిగుమతి అయ్యేవని  ఖండేల్వాల్ చెప్పారు.

అయితే ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, వరదల కారణంగా గతేడాదితో పోలిస్తే ఈసారి రాఖీల విక్రయాలు తగ్గాయని దుకాణదారులు కూడా చెబుతున్నారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వర్షాలు, వరదల కారణంగా గతేడాదితో పోలిస్తే ఈసారి రాఖీల వ్యాపారం తక్కువగానే జరిగిందని వ్యాపారి అనిల్ తెలిపారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios