PM Modi US Visit: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో GE-414 జెట్ ఇంజన్ తయారీ ఒప్పందం కీలక మైలురాయి కానుందా..

భారత ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ (GE) డిజైన్ చేసిన GE- 414 రకం ఇంజన్స్ ఉపయోగించడానికి సూత్రప్రాయంగా సంసిద్ధత వ్యక్తం చేసింది.  వీటిని మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ధిలో వినియోగించనున్నారు.  ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా GE టెక్నాలజీ వినియోగానికి మార్గం సుగమం అవుతుందని న్యూఢిల్లీ వర్గాలు ఆశిస్తున్నాయి.

PM Modi US Visit  Will the bilateral agreement for the manufacture of GE-414 jet engine be a milestone in Prime Minister Modi's US visit..

(గిరీష్ లింగన్న, స్పేస్ అండ్ డిఫెన్స్ అనలిస్ట్)

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన దిగ్విజయంగా ప్రారంభమైంది అటు దౌత్య పరంగాను వాణిజ్యపరంగాను  ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత దృఢ పరిచేలా ఈ పర్యటన కొనసాగనుంది. జూన్ 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమెరికా అధ్యక్షుడు ఇరువురు కలిసి ఇరుదేశాల మధ్య ఓ ద్వైపాక్షిక ప్రకటన చేసే  వీలుంది. ముఖ్యంగా అమెరికా  భారత వైమానిక దళం అవసరార్థం వినియోగించే జెట్ ఇంజన్ల తయారీకి  జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ నుంచి అనుమతులను ఇవ్వనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒప్పందాలపై అన్ని రకాల చర్చలు పూర్తయ్యాయి. కేవలం అమెరికన్ కాంగ్రెస్ ను  అప్రూవల్ మాత్రమే మిగిలి ఉంది.

ఇప్పటికే భారత ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ (GE) డిజైన్ చేసిన GE- 414 రకం ఇంజన్స్ ఉపయోగించడానికి సూత్రప్రాయంగా సంసిద్ధత వ్యక్తం చేసింది.  వీటిని మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ధిలో వినియోగించనున్నారు.  ఈ పర్యటనలో భాగంగా GE టెక్నాలజీ వినియోగానికి మార్గం సుగమం అవుతుందని న్యూఢిల్లీ వర్గాలు ఆశిస్తున్నాయి.

మే 18వ తేదీన  అమెరికా రక్షణ శాఖకు చెందిన కీలక కార్యాలయం పెంటగాన్ ఫైటర్ ఇంజన్లు,  లాంగ్ రేంజ్ కెనాన్,  ఇన్ఫాంట్రీ కాంబినేట్ వెహికల్స్ జాయింట్ ప్రొడక్షన్ కోసం ఇరుదేశాల మధ్య ఒప్పందం  కుదిరినట్లు ప్రకటించింది.  ఈ ఒప్పందం ప్రకారం ఇరుదేశాల్లోని డిఫెన్స్  ఇండస్ట్రీలు కలిసి పనిచేసే వీలు కలిగింది

డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ  కథిలిన్ హిక్స్, అలాగే ఇండియన్ డిఫెన్స్ సెక్రటరీ ఈ మేరకు పెంటగాన్ లో అదే రోజు భేటీ అయ్యారు.  వీరి ఇరువురి భేటీలో రక్షణ రంగంలో ఉభయ దేశాల మధ్య సహకారం గురించి ప్రముఖంగా చర్చించారు అలాగే ఇరుదేశాలు కలిసి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలను సైతం వివరించారు. 

నిజానికి 1986 లోనే భారత్ సొంత ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ తయారీకి ప్రయత్నాలు ప్రారంభించింది అయితే కావేరి ఇంజన్ పేరిట చేసిన ప్రయత్నాలు అంతగా విజయవంతం సాధించలేదు మొత్తం తొమ్మిది రకాల ఇంజన్ మోడల్స్  భారత్ అభివృద్ధి చేసినప్పటికీ అంతగా సక్సెస్ సాధించలేదు చివరగా తేజస్ ఫైటర్ విమానం మాత్రం సక్సెస్ అయింది.  అయితే ఇందులో అమర్చిన ఇంజిన్ :GE F404  కావడం విశేషం.  2016 నుంచి తేజస్ ఫైటర్ విమానాలను భారత వైమానిక దళంలో చేర్చుకున్నారు. 

అయితే ప్రస్తుతం Tejas MK2 విమానాలను భారత్ అభివృద్ధి చేస్తోంది. ఈ విమానం తయారీలో  అత్యాధునికమైన Twin Engine Deck based Fighter  (TEDBEF),  Advanced Medium Combat Aircraft (AMCA) టెక్నాలజీని  వినియోగిస్తున్నారు.  అయితే ఇందులో వినియోగించే ఇంజన్ విషయానికి వస్తే GE-414  రకం ఇంజన్ ను వాడుతున్నారు.  ప్రస్తుతం GE కంపెనీ ఎఫ్414 ఇంజన్ తయారు చేస్తోంది. ఇందులో మరిన్ని అత్యాధునికమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు 20 శాతం ఎక్కువ సామర్ధ్యంతో ఈ ఇంజన్ పని చేయనుంది.  ఈ ఇంజన్ ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న విమానం Advanced Medium Combat Aircraft (AMCA)  ప్రాజెక్టులో కీలకం కానుంది

2010 సంవత్సరంలో GE కంపెనీ విజయవంతంగా  F414-INS6  తరహాకు చెందిన 99 ఇంజన్లను  Mk-2 LCA-Tejas విమానాల తయారీకి ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.  అయితే అదనంగా మరో 40 ఇంజన్లను సైతం ఆర్డర్ చేసింది. 

జీఈ సంస్థ తయారు చేసిన F414-GE-400 ఇంజిన్, 22,000-పౌండ్ల బరువు ఉంటుంది. ఇది జనరల్ ఎలక్ట్రిక్ ఆఫ్టర్‌బర్నింగ్ టర్బోఫాన్. ఇందులో మూడు ఫ్యాన్ స్టేజ్‌లు, ఏడు హై-ప్రెజర్ కంప్రెసర్ స్టేజ్‌లు, ఒక హై-ప్రెజర్ టర్బైన్ స్టేజ్ ,  ఒక లో ప్రెజర్ టర్బైన్ స్టేజ్‌ సుమారు 2,445 పౌండ్ల బరువు ఉంటుంది. 

US నావికాదళం GE-414 ఇంజన్‌ను ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనది పరిగణిస్తుంటారు, ఎందుకంటే దీని అధునాతన సాంకేతికత, గతంలో వాడిన F404 కన్నా కూడా మరింత సమర్థవంతమైనదని నిరూపితం అయ్యింది. GE-414 వల్ల  విమానం మైలేజ్, పేలోడ్ సైతం మెరుగుపడుతుంది.

2024 ఏడాది ప్రారంభం నాటికి, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) LCA మార్క్ IIని గగనతలంలో ఎగరేయనుంది. ఇందులో GE-414 INS6 ఇంజన్ వినియోగించనున్నారు. ఈ విమానం 2024 నాటికి వైమానిక దళంలో చేరుతుందని అంచనా వేస్తున్నారు. 

F414 కుటుంబం నుండి వచ్చిన F414-GE-INS6 ఇంజిన్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన వెర్షన్. ఇది  భారతదేశ వైమానిక దళం ,  నౌకాదళ  అవసరాలను తీర్చడానికి   సరిగ్గా సరిపోతుంది. ఈ మోడల్‌లో ఫుల్ అథారిటీ డిజిటల్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ (FADEC) ,  సింగిల్-ఇంజిన్ ఆపరేషన్‌ల కోసం అదనపు సెక్యూరిటీ వంటి విభిన్న అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇంకా 98kN క్లాస్ ఆఫ్ వెట్ థ్రస్ట్ శక్తివంతమైన ప్రదర్శనలను అనుమతిస్తుంది.

అయితే  ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య జరిగే ఒప్పందంలో GE-414 ఇంజిన్ తయారీలో 70-100 శాతం సాంకేతిక  పరిజ్ఞానం బదిలీ చేసుకునే సదుపాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. జనరల్ అయితే ఈ బదిలీలో ఎలక్ట్రిక్  పేటెంట్ (మేధో సంపత్తి) హక్కులను కలిగి ఉంది. అయితే దేశీయంగా ఉత్పత్తి చేసే ఇంజన్లు కలిగిన విమానాలను ఇతర దేశాలకు విక్రయించాలంటే మాత్రం భారత్‌కు అమెరికా అనుమతి తప్పనిసరి.

బైడెన్ అడ్మినిస్ట్రేషన్ జనరల్ ఎలక్ట్రిక్‌కు ఇప్పటికే టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ కు సంబంధించిన అనుమతులకు దాదాపు గ్రీన్ లైట్ ఇచ్చింది, తద్వారా 110 kN కంటే ఎక్కువ థ్రస్ట్‌తో అధునాతన ఇంజిన్‌ల  రెండు దేశాల మధ్య సహకార రూపకల్పన, అభివృద్ధి ,  ఉత్పత్తికి మద్దతు ఇవ్వగల వేదికను సృష్టించింది.

ఇప్పటికే మన దేశానికి చిరకాల శత్రుదేశాలు అయిన  చైనా తన J-20 ఫైటర్ జెట్ రూపొందించగా అందులో బ్లేడ్‌లు వేడెక్కడం వంటి సమస్యలు బయటపడ్డాయి. ఇక పాకిస్తాన్ వైమానిక దళం మోహరించిన J-10CE ఫైటర్ విమానాలు చైనీస్ నిర్మిత WS-10 ఇంజిన్‌లతో అమర్చబడి ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో GE-414 ఇంజన్లను కలిగి ఉన్న భారతీయ విమానాలు ఇప్పుడు మరింత అధిక సామర్థ్యం, ఇంధన-సమర్థతను ఇంజిన్‌లను కలిగి ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios