PM Modi US Visit: ప్రధాని మోదీ US పర్యటనలో సవాళ్లు ఇవే..ఆ 20 పాలసీల రద్దుకు పట్టుబడుతున్న అమెరికన్ కంపెనీలు
అమెరికాలోని బడా టెక్నాలజీ కంపెనీలన్నీ కూడా భారత్ లో తమ వ్యాపారాలను విస్తరించాలంటే, తమకు అడ్డంకిగా ఉన్న 20 చట్టాలను వెనక్కు తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటన చేపడుతున్న నేపథ్యంలో అమెరికన్ డిజిటల్ కంపెనీల సమాఖ్య లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Google, Uber, Meta, Amazon సభ్యులుగా ఉన్న కంప్యూటర్, కమ్యూనికేషన్స్ అసోసియేషన్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ (CCAI), అమెరికా , భారతదేశం మధ్య డిజిటల్ వాణిజ్యానికి '20 పాలసీ అడ్డంకులుగా గుర్తించి వాటిని జాబితా చేసింది. వాషింగ్టన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న CCAI తన జాబితాలో సమాచార సాంకేతిక చట్టం, కంటెంట్ మోడరేషన్ చట్టం, ఈక్వలైజేషన్ లెవీ, ప్రతిపాదిత టెలికాం బిల్లుకు సవరణలను ఉదాహరణలుగా పేర్కొంది. ఈ చట్టాలన్నీ కూడా భారత్ అమెరికా మధ్య డిజిటల్ వాణిజ్యానికి అడ్డంకులుగా ఉన్నాయని పేర్కొంది.
'డిజిటల్ ట్రేడ్‌లో కీలక మార్పులు, 2023' పేరుతో తన రిపోర్టులో, టెలికాం బిల్లు ముసాయిదాలో టెలికాం సేవల నిర్వచనం డిజిటల్ భద్రత , భావప్రకటనా స్వేచ్ఛకు ముప్పు కలిగిస్తుందని అసోసియేషన్ పేర్కొంది. ఈ నివేదికను CCAI అమెరికన్ కంపెనీల కోసం తయారు చేసింది.
బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్-ఆధారిత సేవలను చేర్చడానికి టెలికాం సేవల నిర్వచనాన్ని మార్చినట్లు బాడీ తెలిపింది. మునుపటి టెలికాం చట్టంలో టెలికాం బ్రాడ్‌బ్యాండ్ సేవలకు కొత్త చట్టం చాలా భిన్నంగా ఉందని పేర్కొంది.
'సెల్ఫ్-రిలెంట్ ఇండియా' వంటి కార్యక్రమాల కారణంగా, US డిజిటల్ కంపెనీలకు వ్యతిరేకంగా భారత్ అనుసరిస్తున్న ప్రొటెక్షనిజం వైఖరి ఇరు దేశాల డిజిటల్ వాణిజ్యాన్ని కఠినతరం చేస్తుందని CCAI పేర్కొంది. ఇలాంటి చర్యల వల్ల భారత్‌లోని అమెరికన్ కంపెనీలపై వివక్షగా పేర్కొనకపోయినప్పటికీ, ఈ తరహా చర్యలు డిజిటల్ వాణిజ్యానికి అడ్డంకిగా మారుతాయని తెలిపింది. భారతదేశంలో ఆన్‌లైన్ సేవల వృద్ధికి అపారమైన అవకాశం ఉన్నప్పటికీ, 2020 నాటికి దేశం డిజిటల్ సేవల వ్యాపారంలో 27 బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయినట్లు అంచనా వేసింది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెలికమ్యూనికేషన్స్, డిఫెన్స్ మొదలైన రంగాలలో డిజిటల్ టెక్నాలజీలలో మరింత సహకారం కోసం క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైలాగ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, యుఎస్ జాతీయ భద్రతా సలహాదారులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో CCAI ఈ విషయాన్ని తెలిపింది
ప్రెసిడెంట్ జో బిడెన్‌తో పాటు, ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 20 నుండి అమెరికా పర్యటనలో అగ్రశ్రేణి టెక్ కంపెనీల CEOలను కూడా కలవనున్నారు. మోదీ, బిడెన్ మధ్య చర్చల్లో డిజిటల్ రంగంలో సహకారం కీలకం కావచ్చని భావిస్తున్నారు.
'యూరోపియన్ డిజిటల్ మార్కెట్స్ యాక్ట్' (డీఎంఏ) తరహాలో 'డిజిటల్ కాంపిటీషన్ యాక్ట్' రూపొందించాలన్న భారత పార్లమెంటరీ కమిటీ సూచనపై కూడా CCAI ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. అమెరికా కంపెనీలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత చట్టాన్ని తీసుకువస్తున్నట్లు CCAI భావిస్తోంది.
2021లో, భారతదేశం చేసిన జియోస్పేషియల్ మార్గదర్శకాల ప్రకటనపై CCAI కూడా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ మార్గదర్శకాలు అమెరికా కంపెనీలు , విదేశీ కంపెనీలు భారత్‌తో కొత్త టెక్నాలజీలో సహకరించకుండా అడ్డుకుంటున్నాయని తెలిపింది.