Asianet News TeluguAsianet News Telugu

నేటి నుండి కొత్త GST రూల్.. భారతీయ కంపెనీలు ఈ విషయాలను తెలుసుకోవాలి..

ఆగస్టు 1 నుండి రూ. 5 కోట్ల కంటే ఎక్కువ B2B లావాదేవీల విలువ కలిగిన కంపెనీలు ఎలక్ట్రానిక్ లేదా ఇ-ఇన్‌వాయిస్‌ను రూపొందించాల్సి ఉంటుంది. అన్ని B2B లావాదేవీల కోసం కంపెనీలు  వార్షిక ఆదాయం రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ను రూపొందించాలి. 
 

New GST Rule Kicks In From Today  Indian Companies Should Know THIS New Threshold-sak
Author
First Published Aug 1, 2023, 1:53 PM IST

న్యూఢిల్లీ: 5 కోట్లకు పైగా వ్యాపారాల టర్నోవర్ పై కొత్త GST రూల్ నేటి నుండి ప్రారంభమవుతుంది. వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వ్యవస్థకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ మే నెలలో సర్క్యులర్‌ను విడుదల చేసింది. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ఆగస్టు 1 నుంచి ఇ-ఇన్‌వాయిస్‌ను  జారీ చేయడం తప్పనిసరి అని సర్క్యులర్‌లో పేర్కొంది.

ఆగస్టు 1 నుండి రూ. 5 కోట్ల కంటే ఎక్కువ B2B లావాదేవీల వాల్యూ  కలిగిన కంపెనీలు ఎలక్ట్రానిక్ లేదా ఇ-ఇన్‌వాయిస్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. అన్ని B2B లావాదేవీల కోసం కంపెనీలు  వార్షిక ఆదాయం రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ను అందించాలి. 

రూ. 500 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పెద్ద కంపెనీల కోసం ఇ-ఇన్‌వాయిస్‌ను మొదట (2020) అమలు చేశారు,  3 సంవత్సరాలలోపు థ్రెషోల్డ్ ఇప్పుడు రూ. 5 కోట్లకు తగ్గించబడింది. అక్టోబరు 1, 2020 నుండి రూ. 500 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయాలు కలిగిన కంపెనీలకు, ఆపై జనవరి 1 నుండి ప్రారంభమయ్యే వార్షిక ఆదాయం రూ. 100 కోట్లకు పైగా ఉన్న కంపెనీలకు జిఎస్‌టి చట్టం ప్రకారం బిజినెస్-టు-బిజినెస్ (బి2బి) లావాదేవీలకు ఇ-ఇన్‌వాయిసింగ్ తప్పనిసరి చేయబడింది.  2021 
రూ.50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు ఏప్రిల్ 1, 2021 నుండి B2B ఇ-ఇన్‌వాయిస్‌లను జారీ  చేయడం ప్రారంభించాయి. ఏప్రిల్ 1, 2022 నుండి బారియర్ రూ.20 కోట్లకు తగ్గించబడింది. తరువాత అక్టోబర్ 1 2022 నాటికి థ్రెషోల్డ్ రూ.10 కోట్లకు తగ్గించబడింది.

స్కైడో వ్యవస్థాపకుడు అండ్ CEO శ్రీవత్సన్ శ్రీధర్ మాట్లాడుతూ, "ఇ-ఇన్‌వాయిస్‌ను జారి చేయడం ద్వారా ప్రభుత్వం పన్ను ఎగవేతను ఎదుర్కోవడం,  క్లయింట్లు  ఇంకా విక్రేతల మధ్య రియల్ టైం ఇన్‌వాయిస్ మ్యాచింగ్‌ను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దశ పారదర్శకతను నిర్ధారిస్తుంది ఇంకా పన్ను వసూలు వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా సమ్మతిని పెంచుతుంది. అలాగే ఇ-ఇన్‌వాయిసింగ్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది, ఇది  రియల్ టైం  వెరిఫికేషన్ అండ్  కొనుగోలుదారులు అలాగే విక్రేతల మధ్య ఇన్‌వాయిస్‌ల సరిపోలికను అనుమతిస్తుంది.  లోపాలు, నకిలీ ఇంకా పన్ను ఎగవేత అవకాశాలను తగ్గిస్తుంది." అని అన్నారు. 

"అయితే, దీని అమలుతో సంబంధం ఉన్న కొన్ని ప్రతికూలతలు అలాగే  సవాళ్లు కూడా ఉన్నాయి. ఇ-ఇన్‌వాయిస్ సిస్టమ్‌లు ఇంకా ప్రక్రియలను అమలు చేయడానికి హార్డ్‌వేర్, టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ అండ్ శిక్షణలో ప్రాథమిక పెట్టుబడి అవసరం కాబట్టి ప్రారంభ సెటప్ ఖర్చులు ప్రారంభంలో చిన్న వ్యాపారాలకు అడ్డంకిగా ఉంటాయి. సైబర్ బెదిరింపులు అండ్ హ్యాకింగ్ ప్రయత్నాలకు లోనయ్యే సున్నితమైన ఆర్థిక డేటా యొక్క ప్రసారం అండ్   స్టోరేజ్   కూడా ఉంటుంది," అని అన్నారాయన.

ఇదిలా ఉండగా, ఆన్‌లైన్ గేమింగ్‌పై జిఎస్‌టి అమలును ఎట్టకేలకు నిర్ణయించడానికి జిఎస్‌టి కౌన్సిల్ రేపు, అంటే ఆగస్టు 02 న సమావేశమయ్యే అవకాశం ఉంది. 28% జిఎస్‌టి డిపాజిట్లపై విధించాలా లేదా ప్రతి గేమ్‌పై విధించాలా అనే విషయాన్ని కూడా కౌన్సిల్ నిర్ణయిస్తుంది. ప్రతి గేమ్‌పై 28% పన్ను విధించడం వల్ల అదే రూపాయికి పదేపదే పన్ను విధించబడుతుందని రెవెన్యూ కార్యదర్శి   అంగీకరించారు, ఫలితంగా ప్రభావవంతమైన పన్ను రేటు 50%-70% వరకు ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios