Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో పర్యటించనున్న మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓ సత్యా నాదేళ్ళ

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై ఇటీవల భారత సంతతికి చెందిన సిఇఒ సత్య నాదెల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపాయి.
 

microsoft ceo satya nadella to visit india in february month end
Author
Hyderabad, First Published Feb 14, 2020, 5:27 PM IST

న్యూ ఢిల్లీ: మైక్రోసాఫ్ట్ కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), భారత సంతతికి చెందిన సత్య నాదెల్లా ఈ నెల చివర్లో భారతదేశాన్ని సందర్శించనున్నట్లు   మైక్రోసాఫ్ట్ కంపెనీ గురువారం తెలిపింది.

ఒక  ఉన్నతాధికారి సత్య నాదెల్లా  భారత పర్యటనను కంపెనీ ధృవీకరించగా అతను ఏ తేదీలలో, ఎ నగరాలలో పర్యటిస్తాడు అనే  వివరాలు గురించి సమాచారం లేదు.

also read 'ప్లీజ్, మీ డబ్బు తీసుకోండి': విజయ్ మాల్యా

 మైక్రోసాఫ్ట్ ఇ-మెయిల్ ప్రశ్నకు సమాధానంగా అవును మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెల్లా ఈ నెల చివర్లో భారతదేశం సందర్శిస్తారు, వినియోగదారులు, యువ ఔత్సాహిక వ్యాపార,  విద్యార్థులు, డెవలపర్లు, పారిశ్రామికవేత్తలు,  వ్యవస్థాపకులను ఉద్దేశించి మాట్లాడుతారని తెలిపారు.

microsoft ceo satya nadella to visit india in february month end

ఫిబ్రవరి 24-26 తేదీల్లో నాదెల్లా భారత పర్యటనకు వస్తారని కొన్ని వర్గాలు తెలిపాయి. ఆయన ఢిల్లీ, ముంబై, బెంగళూరులను సందర్శించే అవకాశం ఉందని, ఆయన పర్యటన సందర్భంగా పరిశ్రమల అధినేతలు, ప్రభుత్వ కార్యకర్తలను కలిసే అవకాశం ఉందని వారు తెలిపారు.

also read ఎయిర్ ఇండియా కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజీవ్ బన్సాల్

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై ఇటీవల భారత సంతతికి చెందిన సిఇఒ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపాయి.

 డేటా స్థానికీకరణ మరియు ఇ-కామర్స్ కంపెనీలతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కోసం నిబంధనలను కఠినతరం చేయడం వంటి అంశాలపై భారత ప్రభుత్వం బలమైన స్థానం తీసుకుంటున్న తరుణంలో నాదెల్ల పర్యటన ఒక మంచి పరిణామం. అమెరికా కంపెనీల ఒత్తిడికి తలొగ్గడానికి నిరాకరించి, ఈ సమస్యలపై భారత్ ఇప్పటివరకు గట్టిగా నిలబడింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios