Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ వ్యాధికి ‘ఐవర్ మెక్టిన్’మెడిసిన్..? కానీ...

దాదాపు ఐదు నెలలుగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ ఆట కట్టించేందుకు మార్గం సుగమం అవుతుందా? అంటే అవుననే అంటున్నారు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు వాగ్ స్టఫ్.. కరోనా కట్టడికి ఐవర్ మెక్టిన్ ఔషధం సాయ పడుతుందని అంచనా వేశారు. అయితే క్లినికల్ ట్రయల్స్‌లో నిర్ధారణ కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
 

Ivermectin: This 'head lice' drug will cure coronavirus in 48 hours, claims study
Author
Hyderabad, First Published Apr 5, 2020, 10:55 AM IST

మెల్‌బోర్న్: అందరినీ గడగడ వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతమొందించే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ప్రపంచ మానవాళి ఆశగా, ఆర్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే భారత్, అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు పరిశోధనలు చేపట్టాయి. ట్రయల్స్ కూడా ప్రారంభం అయ్యాయి. 

అయితే, వ్యాక్సిన్ రూపొందించిన అది విపణిలోకి అంటే వినియోగంలోకి రావాలంటే కనీసం 18 నెలల సమయం పడుతుందని వైద్య నిపుణుల మాట. ఈ తరుణంలో ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్శిటీ చేసిన రీసెర్చి అందరిలోనూ ఊరట కలిగిస్తున్నది.

పారాసైట్స్ నుంచి వచ్చే సంక్రమణ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే యాంటీ పారాసైటిక్ డ్రగ్ ‘ఐవర్ మెక్టిన్’ ఔషధం.. కరోనా వైరస్ ను పూర్తిగా నాశనం చేస్తోందిన మోనాష్ యూనివర్శిటీ పరిశోధకుడు కైలీ వాగ్ స్టఫ్ చెప్పారు. 

పరిశోధన కోసం వేరు చేసిన కణాల్లో (సెల్ కల్చర్) పెరుగుతున్న కరోనా సూక్ష్మ క్రిమిని 48 గంటల్లో అంతమొందిస్తుందని వాగ్ స్టఫ్ అన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఔషధంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తే, కొవిడ్-19 చికిత్సకు ఉపకరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కేవలం ఒక్క డోస్ 48 గంటల్లో వైరస్ ఆర్ఎన్ఏ అణువులన్నీ తొలగించడాన్ని తాము గుర్తించామని వాగ్ స్టఫ్ చెప్పారు. 24 గంటల్లోనే వైరస్ తగ్గుదల నమోదైందని తెలిపారు. ఐవర్ మెక్టిన్ ఆమోదిత యాంటీ పారాసైటిక్ ఔషధం అని ఆయన వెల్లడించారు. విట్రోలో హైచ్ఐవీ, డెంగ్యూ, ఇన్ ఫ్లూయెంజా, జికా వైరస్‌లపై ఈ ఔషధం చాలా బాగా పని చేసిందని వాగ్ స్టఫ్ వెల్లడించారు. 

గాజు గొట్టం అంటే విట్రోలోనే పరిశోధనలు చేసినందున మానవులపై క్లినికల్ ట్రయల్ జరుపాల్సిన అవసరం ఉందని మోనాష్ యూనివర్శిటీ పరిశోధకుడు వాగ్ స్టఫ్ వెల్లడించారు. ఐవర్ మెక్టిక్ విస్త్రుతగా వాడుతున్న సురక్షితమైన ఔషధ అని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఈ ఐవర్ మెక్టిన్ ఔషధం డోస్‌లు ప్రభావ వంతంగా పని చేస్తాయా? లేదా? తాము గుర్తించాల్సి ఉందని వాగ్ స్టఫ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ మానవాళిని వణికిస్తున్న మహమ్మారి రోగాన్ని అంతం చేసే ఔషధం అందుబాటులో లేనందున.. అందుబాటులో ఉన్న ఔషధాలపై పరిశోధనలు చేయడం వల్ల ప్రజలకు త్వరితగతిన సాయం అందుతుందన్నారు. 

కరోనా చికిత్స కోసం ఈ ఐవర్ మెక్టిన్ ఏ పద్దతిలో అంటే ఇంట్రా వీనస్ లేదా ఓరల్ పద్దతిలో చికిత్సనందించాలన్న విషయమై స్పష్టత లేదని మోనాష్ వర్శిటీ పరిశోధకుడు వాగ్ స్టఫ్ తెలిపారు. ఇతర వైరస్ లపై పోరుకు ఉపయోగించిన విధానంలో వాడితే ఫలితం కనిపిస్తుందన్నారు. 

తాను ఒక వైరాలజిస్టుగా ఈ టీంలో భాగస్వామినయ్యానని వాగ్ స్టఫ్ పేర్కొన్నారు. గత జనవరిలోనే ఐసోలేషన్ వార్డుకు వెళ్లానని ఆస్ట్రేలియాలోని రాయల్ మెల్ బోర్న్ దవాఖాన పరిశోధకురాలు లియోన్ కెలీ తెలిపారు. కరోనాపై ఐవర్ మెక్టిన్ ఔషధం ఉపయోగించడం పట్ల తాను ఉత్సాహంగా ఉన్నాయని చెప్పారు. అయితే దాన్ని ఖచ్చితంగా వాడాలంటే ముందు క్లినికల్ ట్రయల్ చేయాల్సిందేనన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios