ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ వాహనాల (ఈవీ) మార్కెట్లలో ఒకటిగా భారత్‌ మారనున్నదని ఉందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌)- ఓలా మొబిలిటీ ఇనిస్టిట్యూట్‌ సంయుక్త నివేదిక వెల్లడించింది.

దేశంలో కాలుష్య నివారణతోపాటు ముడిచమురు దిగుమతుల తగ్గింపునకు గాను విద్యుత్‌ వాహనాల వినియోగం పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. 

ఈ వాహనాల కొనుగోలు వ్యయం అధికంగా ఉండటంతో ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదని తెలిపింది. పరిశోధనా, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)పై మరింతగా పెట్టుబడులు పెట్టి వ్యయాలను తగ్గించగలిగితే వినియోగం పుంజుకోవచ్చని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌)- ఓలా మొబిలిటీ ఇనిస్టిట్యూట్‌ సంయుక్త నివేదిక పేర్కొంది.

దీనితోపాటు ప్రభుత్వ మద్దతు, దిశానిర్దేశం కూడా ఎంతో అవసరమని, అప్పుడే ఎలక్ర్టిక్‌ మొబిలిటీకి ప్రాధాన్యం పెరుగుతుందని తెలిపింది.

దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం పెరిగే విధంగా 10 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, సర్వీసులను పెంచుతున్నాయని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌)- ఓలా మొబిలిటీ ఇనిస్టిట్యూట్‌ సంయుక్త నివేదిక  పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బీహార్‌, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ ఉన్నట్టు వెల్లడించింది. ఈ రంగంలో ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, సర్వీసులు ప్రధానమైనవని పేర్కొంది. పై రాష్ర్టాల్లో ఎక్కువగా ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
 
అంతేకాక ప్రభుత్వ, ప్రైవేటు ప్రాంతాల్లో చార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రజల్లో అవగాహన పెంచడం, నైపుణ్యాల కార్యక్రమాలు చేపట్టడం, ఆర్థికపరమైన ప్రోత్సాహకాల గురించి తెలియజేయడం, చార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన రియల్‌ టైమ్‌ సమాచారం అందించడం, చెల్లింపుల సదుపాయాలు వంటి సర్వీసులను అందిస్తున్నాయి. 

2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం వృద్ధికేకాకుండా పర్యావరణపరంగా సుస్థిరతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.
 
అత్యధిక సామర్థ్యం కలిగిన యువ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉందని, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం ఉన్న నేపథ్యంలో తన సత్తాను ప్రదర్శించిందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ప్రెసిడెంట్‌ బోర్జ్‌ బ్రెండే పేర్కొన్నారు. దక్షిణాసియా అభివృద్ధిలోనే కాక  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతలోనూ భారత్‌ కీలక పాత్ర పోషించనుందన్నారు. 

‘ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న భారీ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా ఉంది. అద్భుతమైన సామర్థ్యం కలిగిన యువ ఆర్థిక వ్యవస్థ. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం ఉన్నా తన సామర్థ్యాన్ని చాటుకుంది’’ అని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ప్రెసిడెంట్‌ బోర్జ్‌ బ్రెండే  పేర్కొన్నారు.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరంగా చూస్తే భారత్‌ చాలా అభివృద్ధి చెందిన దేశాలకన్నా ముందంజలో ఉందన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పరంగా చూస్తే అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయని తెలిపారు.