Asianet News TeluguAsianet News Telugu

పెరుగుతున్న బంగారం ధరలు... ఇండియన్ కరెన్సీ ఎఫెక్ట్ కారణమా ?

అమెరిన్ డాలర్ తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ పడిపోవడంతో బంగారం ధర పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

gold prices in india today rise up again
Author
Hyderabad, First Published Jan 18, 2020, 12:11 PM IST

జాతీయ అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరిగిపోతుంది. అమెరిన్ డాలర్ తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ పడిపోవడంతో బంగారం ధర పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు

 అమెరికా -  చైనాల మధ్య  వాణిజ్య ఒప్పొందాలు కుదిరినా  ఇన్వెస్టర్లు మాత్రం భిన్నంగా  ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రస్తుత టారిఫ్ లు ఒక భాగం కావడంతో టారిఫ్ లను కొనసాగించాలా వద్ద అన్న మీమాంసపై ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో  పసిడి ధరపై సానుకూల ప్రభావం పడింది.

also read  భారతదేశంలో ఆన్‌లైన్ ద్వారా... బంగారం, ఆభరణాలపై రుణాలు...


దీంతో  హైదరాబాద్ లో  శుక్రవారం 1 గ్రాము 22 క్యారట్ల  బంగారం ధర రూ.3,802 ఉంటే  శనివారం అదే 22క్యారట్ల బంగారం ధర రూ. 3,809గా ఉంది.హైదరాబాద్ లో శుక్రవారం 1 గ్రాము 24 క్యారట్ల బంగారం ధర రూ.4,100గా ఉంటే శనివారం అదే 24 క్యారట్ల బంగారం ధర రూ.4,105 గా ఉంది.

హైదారబాద్ లో  శుక్రవారం 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.38,020 గా ఉంటే శనివారం 22 క్యారట్ల బంగారం ధర రూ.38,909 గా ఉంది. హైదరాబాద్ లో శుక్రవారం 1 గ్రాము 24 క్యారట్ల బంగారం ధర రూ.41, 000గా ఉంటే శనివారం అదే 24 క్యారట్ల బంగారం ధర రూ.41,050 గా ఉంది.

gold prices in india today rise up again


విజయవాడలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.38,090 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ.41,050 గా ఉంది. విశాఖలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.38,090 గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ.41,050గా ఉంది.

also read స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.38,900గా ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రూ.40,100గా ఉంది

ఈ రోజు మార్కెట్ లో వెండి ధరలు ఇలా ఉన్నాయి

1 గ్రాము వెండి ధర రూ.49.40

10 గ్రాముల వెండి ధర రూ.494

100గ్రాముల వెండి ధర రూ.4940

1000గ్రాముల వెండి ధర రూ.49,400 గా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios