Asianet News TeluguAsianet News Telugu

సరికొత్త రికార్డు స్థాయికి చేరుకొనున్న బంగారం, వెండి ధరలు...

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డు స్ధాయికి చేరుకుంటున్నాయి. గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సరికొత్త గరిష్ట స్ధాయికి చేరేలా దూసుకెళ్తున్నాయి. 

gold and silver may hit to record setting price in india due to coronavirus
Author
Hyderabad, First Published Feb 20, 2020, 10:31 AM IST

న్యూఢిల్లీ : చైనా నుంచి ప్రపంచం మొత్తం వ్యాపిస్తూ  ప్రపంచాన్ని ప్రస్తుతం భయపెడుతున్న కరోనా వైరస్ కారణంగా ఈక్విటీ మార్కెట్ల పతనం అవుతున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డు స్ధాయికి చేరుకుంటున్నాయి.

also read బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసుల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లు...

గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సరికొత్త గరిష్ట స్ధాయికి చేరేలా దూసుకెళ్తున్నాయి. గురువారం ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభమయిన తరువాత ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ఏకంగా రూ.180 పెరిగి రూ. 41,601కు చేరుకుంది.

ఇన్వెస్టర్లు ప్రస్తుత పరిస్థితుల్లో తమ పెట్టుబడులకు బంగారమే సురక్షిత మార్గమని వారు భావిస్తున్నారు. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌- న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌- నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర బుధవారం ట్రేడింగ్‌ ఒక దశలో 1,614.25 డాలర్లను తాకింది.

also read ట్రంప్‌ విమానంలో ఉండే సౌకర్యాలు చూస్తే షాకవ్వాల్సిందే...

మరోవైపు వెండి ధరలు కూడా బంగారంతో పెరిగిపోతున్నాయి. కిలో వెండి ధర రూ.335 పెరిగి ఏకంగా రూ 47,598కి చేరింది. గోల్డ్‌, సిల్వర్‌ ధరలు పెరుగటం చూస్తుంటే ఈ ఏడాదిలోగా రూ.50 వేల మార్క్‌ను చేరవచ్చనే బులియన్‌ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి, మందగమనం, ఉద్రిక్తతలు అరుదైన లోహాలకు డిమాండ్‌ పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే ఈ ఏడాదిలో బంగారం ధర 21 శాతం పెరిగింది. ఇంకా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో దేశంలో బంగారం ధరను ఇంక పెంచుతోంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios