Ginger Price Hike: అల్లం కొనేటట్టు లేదు..టమాటా తినేటట్టు లేదు...భారీగా పెరిగిన అల్లం ధర...కారణం ఇదే..?
దేశవ్యాప్తంగా టమాటా ధరలతో పాటు అల్లం పంట ధర కూడా చుక్కలను తాకుతోంది. భారతీయ వంటల్లో అల్లం వెల్లుల్లికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అల్లం లేకుండా కూరగాయల రుచులను ఊహించుకోలేము. అలాంటి అల్లం ధర ప్రస్తుతం ఒక కేజీ నాలుగు వందలు దాటేసింది.
కూరగాయల ధరలు పెరగడంతో దేశంలోనే ప్రధాన వాణిజ్య పంట అయిన అల్లం ధర కూడా ఆకాశాన్ని తాకింది. మార్కెట్ చరిత్రలో తొలిసారిగా 100 కిలోల పాత అల్లం రూ.18 నుంచి రూ.20 వేలకు చేరింది. ఈ ఏడాది పండించిన కొత్త అల్లానికి రూ.10 నుంచి 12 వేలు ఉంది. గతేడాది అల్లం పొదుపు చేసిన రైతులకు ఈసారి భారీగా ధర పలుకుతోంది. ఉత్తర భారతదేశంలోని ఢిల్లీలో అల్లం డిమాండ్ పెరగడంతో 2023లో తొలిసారిగా అల్లం ధర రూ.20 వేలు దాటనుంది.
అల్లం సాధారణంగా ఏప్రిల్-మేలో విత్తుతారు. ఈ పంట 8 నెలలకు పైగా ఉంటుంది. జనవరిలో చేతికి వస్తుంది. అయితే ప్రస్తుతం రైతులు జనవరిలో పండించిన పంటను విక్రయించారు. అయితే అల్లం విక్రయించని రైతులకు మాత్రం భారీ లాభంతో ధర లభిస్తుంది. జనవరిలో పంటను అమ్ముకోని రైతులకే జాక్ పాట్ తగిలిందని చెప్పవచ్చు. మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండగా.. అల్లం ధర మూడు రెట్లు పెరగడంతో అల్లం రైతులు రెట్టింపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అల్లం బస్తాకు 16-18 వేలు :
ప్రస్తుతం మార్కెట్‌లో అల్లం ధరను చూసి అల్లం రైతులు పండగ చేసుకుంటున్నారు. అల్లం ధర విపరీతంగా పెరిగిపోయింది. వాస్తవానికి గత నాలుగైదేళ్లుగా కురిసిన భారీ వర్షాలకు అల్లం దాదాపుగా నాశనమైంది. ఈసారి మోస్తరు వర్షాలు కురియడంతో పంట బాగా పెరిగింది.
ముఖ్యంగా అల్లం పంటకు విదేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉంది. అల్లం రెండు రకాలుగా గ్రేడింగ్ చేస్తారు. ఒకటి పాత అల్లం రెండోది కొత్త అల్లం. కొత్త పంటను స్టోర్ చేసి ఎనిమిది నెలల తర్వాత విక్రయిస్తే మంచి ధర లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎవరైతే పాత అల్లం స్టోర్ చేసుకున్నారు ఆ రైతులకు మంచి విలువ లభిస్తోంది. అదే సమయంలో కొత్త అల్లం విక్రయించే వారికి సైతం డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు మంచి ధర లభిస్తుంది
అల్లం దిగుబడి ఒడిశా, పశ్చిమ యుపిలో ఎక్కువ. కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో కూడా ఉత్పత్తి ఎక్కువ. కానీ ఈ రాష్ట్రాల్లో అల్లం ఉత్పత్తి దెబ్బతిన్నది.
ఈ సారి ఒడిశాతో సహా పలు రాష్ట్రాల్లో మెరుగైన విత్తనం పంపిణీ కాలేదు. దీంతో అక్కడ నష్టం వాటిల్లింది. పలు రాష్ట్రాల్లో బిపర్జాయ్ తుఫాను కారణంగా భారీ వర్షాల కురిసి అల్లం ఉత్పాదకత తగ్గిపోయింది. అందుకే తక్కువ ఉత్పత్తి కారణంగా డిమాండ్, పెరిగింది. అటు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనూ ఈసారి అల్లం ఉత్పత్తి దెబ్బతింది. అందుకే ఇక్కడ దాని ధర పెరిగింది.
కూరగాయల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు
దేశంలోని ప్రధాన మార్కెట్‌లలోని కూరగాయల దుకాణాల్లో అల్లం అందుబాటులో ఉండటం లేదు. ఉన్నవారు కూడా దీని రేటు చూసి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే, భారీ వర్షాలు కురిసి అల్లంకు గిరాకీ పెరిగి సరఫరా కూడా దొరకడం ఉండటం లేదు. అల్లం ధర రూ.400 పలుకుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. ఇది మా వ్యాపారంపై ప్రభావం చూపుతోంది. మరోవైపు మార్కెట్‌లో అల్లం రాక కూడా తగ్గింది.