G20 Summit 2023: భారత ఆర్థిక వ్యవస్థ శక్తి ప్రదర్శనకు సరైన వేదిక..జీ 20 సదస్సు..
ప్రపంచ వాణిజ్యంలో భారత్ నేడు కేంద్ర బిందువుగా మారుతోంది ఈ నేపథ్యంలో g20 సమావేశాలు ప్రత్యేక ఆకర్షణను తేనున్నాయి ముఖ్యంగా భారత్ రాబోయే సవాళ్లను అధిగమించడానికి అలాగే ప్రపంచ వాణిజ్యంలో తన సత్తా చాటేందుకు ఈ సమావేశాలు తోడ్పడునున్నాయి.
ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, భారతదేశం నేడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలవడం మనందరకీ ఎంతో గర్వకారణం. అంతేకాదు అగ్రరాజ్యాలతో పోటీపడుతూ నేడు భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపు దిద్దుకుంది. కరోనా తర్వాత దిగ్గజ ఆర్థిక వ్యవస్థలన్నీ మాంద్యంలో చిక్కుకుపోతే భారతదేశం మాత్రం ఆర్థిక విస్తరణ దిశగా కొనసాగింది. జూన్ 2023తో ముగిసిన చివరి త్రైమాసికంలో 7.8 శాతం ఆర్థికాభివృద్ధితో ముందుకు అడుగువేయడం గమనార్హం. 3.5 ట్రిలియన్ డాలర్ల జిడిపితో భారతదేశం నేడు అగ్రరాజ్యాలకు సైతం పోటీ ఇచ్చే స్థాయికి చేరింది. ముఖ్యంగా చైనా లాంటి దేశాలు సైతం వెనకడుగు వేస్తున్న తరుణంలో భారతదేశం ముందడుగు వేయడం గమనార్హం.
సెప్టెంబరు 9-10 తేదీలలో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన నేతలంతా G20 శిఖరాగ్ర సమావేశాల కోసం భారతదేశానికి వస్తున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ అనే శక్తి సామర్థ్యాలను ప్రపంచంలోని అగ్రదేశాల ముందు పరిచయం చేసే ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు.
ప్రపంచ వాణిజ్యంలో భారత్ నేడు కేంద్ర బిందువుగా మారుతోంది ఈ నేపథ్యంలో g20 సమావేశాలు ప్రత్యేక ఆకర్షణను తేనున్నాయి ముఖ్యంగా భారత్ రాబోయే సవాళ్లను అధిగమించడానికి అలాగే ప్రపంచ వాణిజ్యంలో తన సత్తా చాటేందుకు ఈ సమావేశాలు తోడ్పడునున్నాయి. ముఖ్యంగా జి20 సమావేశాల్లో భారత్ పలు అవకాశాలను వినియోగించుకునేందుకు ఒక వేదికగా మారనుంది అలాగే ప్రపంచ వాణిజ్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా గుర్తించే వీలు దక్కుతుంది.
రుతుపవనాల జాప్యం, ప్రపంచ సరఫరా గొలుసులో నిరంతర అంతరాయాలు, సరుకుల ఎగుమతుల్లో సవాళ్లు , తయారీలో అస్థిరత్వం వంటి కారణాలు ఉన్నప్పటికీ, ఏప్రిల్-జూన్ 2023-24 త్రైమాసికానికి దాదాపు ఎనిమిది శాతం వృద్ధిని భారత్ సాధించింది. అయితే తదుపరి త్రైమాసికాల్లో ఈ రేంజులో అభివృద్ధి కొనసాగించడం కష్టం. అందుకే, ఆర్‌బిఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వార్షిక అభివృద్దిని 6.5 శాతంగా అంచనా వేస్తున్నాయి..
G20 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కొనసాగుతోంది. భారత అధ్యక్షత వహిస్తున్న ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రీసెట్ చేసే సమయం వచ్చిందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ సమస్యలను పరిష్కరించేందుకు అగ్ర రాజ్యాల నేతలు ఈ శక్తివంతమైన వేదికను ఉపయోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఒక వెలుగుతున్న ధృవతారగా కనిపించడం తథ్యం.
భారతదేశ తాజా GDP సంఖ్యలను పరిశీలిస్తే, దేశీయ డిమాండ్‌కు సంబంధించినంతవరకు మనం మంచి గణాంకాలు సాధించినట్లు కనిపిస్తుంది. నిర్మాణ, హోటళ్లు, వాణిజ్యం,రవాణా, కమ్యూనికేషన్ , ఆర్థిక సేవలు వంటి రంగాలు డిమాండ్‌ను పెంచుతున్నాయి. కానీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. భారత జిడిపిలో సరుకుల ఎగుమతి వాటా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 24.4 శాతం ఉండగా, ఇది ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20.9 శాతానికి పడిపోయింది.
US, పశ్చిమ ఐరోపా వంటి ప్రధాన మార్కెట్లు అధిక ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నాయి. మాంద్యం ఎగుమతులపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని ఇతర దేశాలకు సరుకుల రవాణా సవాలుగా మారుతోంది.
ఇదిలా ఉంటే ఎగుమతులు మందగించడం వల్ల ఎక్కువగా నష్టపోయే రంగం ఏదైనా ఉందంటే అది MSMEలు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో జైపూర్‌లో జరిగిన G20 వాణిజ్య, పెట్టుబడి మంత్రుల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించినప్పుడు MSMEల సమస్యను చాలా చక్కగా వివరించారు.
న్యూఢిల్లీలో జరిగే సదస్సులో భారత్ ఎక్కువగా వస్తు సరఫరా విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం తరువాత ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయం ప్రపంచ వాణిజ్యానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా నల్ల సముద్రంలో వ్యవసాయ వస్తువుల తరలింపుకు సంబంధించి పరిస్థితిని సాధారణ స్థాయికి తగ్గించడానికి నాయకులు అత్యవసరంగా తీసుకునేందుకు ఈ సదస్సు ఒక చొరవగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కార్గో తరలింపులో అంతరాయం కారణంగా గోధుమలు , ఇతర ఆహార వస్తువుల వంటి నిత్యావసరాల ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి.
అదేవిధంగా, జులైలో G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల గాంధీనగర్ సమావేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అస్థిరత షాక్‌ను ఎదుర్కోగల స్వాభావిక నష్టాలను అంచనా వేసింది. RBI గవర్నర్ శక్తికాంత దాస్ అనేక రిస్క్‌లను ప్రస్తావించారు. తక్కువ , మధ్య-ఆదాయ దేశాలలో రుణ సదుపాయం పెంచేందుకు సమర్థవంతంగా, సమగ్రంగా , క్రమపద్ధతిలో పరిష్కరించడం అవసరం అనే ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. డెట్ రౌండ్ టేబుల్ (GSDR) కీలకమైన వాటాదారుల మధ్య కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడానికి సదస్సు దోహదపడింది.
కొత్త, పర్యావరణ హిత ఆర్థిక రంగం పరివర్తనకు ఈ సదస్సు దోహదం కానుంది. గ్లోబల్ సౌత్‌లోని అభివృద్ధి చెందుతున్న దేశాలపై పర్యావరణ హిత ఎకానమీ పేరుతో అనవసరమైన ఖర్చులు విధించకుండా . ఈ చర్చల్లో భారత్ చొరవ తీసుకొని తన వాదన బలంగా వినిపించనుంది
ఈ విషయాన్ని ఇప్పటికే శక్తికాంత దాస్ చక్కగా వివరించారు. - ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకాలు , వృద్ధి సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు సజావుగా , క్రమబద్ధమైన పర్యావరణ హిత పరివర్తన అవసరమని సూచించారు. సజావుగా పర్యావరణ హిత పరివర్తన కోసం పెట్టుబడి అవసరాలు పెద్దవి అయితే, వాస్తవ ఆర్థిక ప్రవాహం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు పర్యావరణ హిత ప్రాజెక్టులు భారం అయితే పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఎత్తి చూపారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో జరగనున్న G20 సమ్మిట్ ఆర్థిక వ్యవస్థ గురించి చాలా విషయాలు అందించే అవకాశం ఉంది.
రచయిత న్యూఢిల్లీలో ఉన్న స్వతంత్ర పాత్రికేయుడు, వ్యాఖ్యాత. పైన వ్యక్తీకరించిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవి.