న్యూ ఢీల్లీ: సాధారణంగా ఫోన్ వినియోగించే  వారు ఎదురుకొంటున్న కొన్ని ప్రధాన సమస్యల గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అధికంగా పోర్న్ చూసే వీక్షకులు కొంతకాలం తర్వాత లైంగిక నేరాలకు పాల్పడవచ్చని హెచ్చరిస్తున్నారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్, ఢీల్లీ ఎయిమ్స్‌లోని మానసిక ఆరోగ్య రంగం నిపుణులను ఉటంకిస్తూ ఐఎఎన్ఎస్ ఈ విషయాన్ని నివేదించింది. 

అశ్లీల వీడియోలకు బానిస అయిన వ్యక్తి యొక్క లైంగిక జీవితంని మారుస్తుందని ఢీల్లీలోని ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో మానసిక ఆరోగ్య విభాగాధిపతి సమీర్ పరీక్ అన్నారు. అతని అభిప్రాయం ప్రకారం పోర్న్ ఎక్కువగా చూసే వారు పోర్న్ కి  బానిసలుగా మారే అవకాశం ఉందని ముఖ్యంగా చిన్న వయసులోనే ప్రవర్తనా లోపాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అని తెలిపారు.

also read ఎన్నికల సీజన్, విహారయాత్రలకు కుబేరుల ప్లాన్.. ఛార్టెర్డ్ ఫ్లైట్స్‌కి గిరాకీ ...

ఢీల్లీ ఎయిమ్స్‌ సైకాలజీ ప్రొఫెసర్ నందా కుమార్ ప్రకారం, పోర్న్ చూడటానికి ఎక్కువ సమయం గడిపే వారి మాటల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే అశ్లీల దృశ్యాలు హింసను ప్రోత్సహిస్తాయి. పోర్న్ వీడియోలలో కనిపించే దృశ్యాల కారణంగా చాలా మంది లైంగిక నేరాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు.

 ఇటువంటి అశ్లీల వీడియోలు గృహ హింస, అత్యాచారాలపై  కూడా ప్రభావం చూపవచ్చు. అతిగా పోర్న్ చూసే వారి రోజువారీ కార్యకలాపాలపై ఇది ప్రభావం చూపుతుంది. ఇది వారి నిద్ర, పని, సామాజిక పరస్పర చర్యలలో ప్రతిబింబిస్తుంది.  దీనికి ఫోన్ వాడకుండా నిషేధించడం సమాధానం కాదని సమీర్ పరిఖ్ చెప్పారు.  ఎందుకంటే పోర్న్ చూడకుండా ఫోన్ పై నిషేధం విధిస్తే బాధితులు ఒక మార్గం నుండి మరొక మార్గాన్ని కనుగొంటారు. దీనికి బదులుగా చిన్న వయస్సు నుండే సరైన లైంగిక విద్యను నిపుణులు అందించాలి అని అన్నారు.