న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పేరు చెప్పగానే అన్నీ దేశాలు వానికిపోతున్నాయి. ఈ కరోనా వైరస్ చైనా నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలకు పాకి ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. కరోనా వైరస్ అనే పేరు వింటేనే చైనాలోని ప్రజలు జంకుతున్నారు.

ఈ వైరస్ ఒకరినుంచి ఒకరికి వ్యాపిస్తూ ప్రస్తుతం అన్నీ దేశాలకు పాకింది. చైనా లోని అన్నీ నగరాలలో దీని బారిన పడి చాలా మంది ప్రాణాలను విడిచారు. ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 1500 మంది మృతి చెందారని అమెరికా గణాంకాలు చెబుతున్నాయి.

also read మళ్ళీ తేరుచుకొనున్న ఆపిల్ ఐఫోన్ స్టోర్లు....

కేవలం శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 143 మంది మరణించారనే వార్తలు వస్తున్నాయి.  అంతకు ముందు రోజు సుమారు 240 మందికి పైగా చనిపోయారు. దీని ప్రభావం అటు వ్యాపారా రంగలపై, చైనా ఎగుమతి, దిగిమతులపై కూడా తీవ్ర ప్రభావం పడింది.

కాగా కరోనా వైరస్ ప్రభావం ఫిబ్రవరి 14న జరుపుకునే వాలంటైన్స్ డే మీద కూడా పడింది. చైనాలో ఒక్క  ప్రేమికుల రోజున ఎన్నో పూలు అమ్ముడుపోయేవి. ఇప్పుడు గత ఏడాదితో పోలిస్తే ఈసారి పూల విక్రయాలు గణనీయంగా తగ్గాయి.


పూవులే కాదు పువ్వుల వ్యాపారం కూడా భారీగా పడిపోయింది. పువ్వుల వ్యాపారం చేసుకునే ఎంతో మంది ఈ రోజు కోసం ఎదురు చూస్తుంటారు. సంవత్సరం మొత్తం ఎన్నడూ లేని విధంగా ఈ రోజు పువ్వులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది.

ఒక్కో పువ్వుకి ఒక్కో రేటును నిర్ణయిస్తారు. దీని వల్ల పువ్వుల వ్యాపారులకు, పువ్వుల పెంపకం దారులకు మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది. చైనాలోని షాంఘై పట్టణానికి చెందిన ఒక పూల వ్యాపారి మీడియాతో మాట్లాడుతూ తాము 12 ఏళ్లుగా పూలను విక్రయిస్తున్నామని అన్నారు.

వాలంటైన్స్ డే సందర్బంగా తాము పూల గుత్తులను భారీ సంఖ్యలో సిద్ధం చేస్తుంటామని తెలిపారు. గత ఏడాది వాలంటైన్స్ వీక్ సందర్భంగా లెక్కకుమించి పూల గుత్తులు విక్రయమయ్యాయని, అయితే వాటిని సిద్ధం చేసేందుకు చాలామంది రాత్రి పగలు పనిచేయాల్సి వచ్చిందని అన్నారు.

also read స్టార్లను మించిన క్రేజ్... సోషల్ మీడియాలో దూకుకెళ్తున్నా వ్యాపారవేత్తలు

అయితే ఈసారి వాలంటైన్స్ డేకి అంత సందడి కనిపించలేదని అన్నారు. పూలను సిద్ధం చేసేవారంతా ఇళ్లలో బంది అయ్యారన్నారు. దీనికి కరోనా వైరస్ భయమే ప్రధాన కారణమన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 10 శాతం పూలు కూడా విక్రయమవలేదని వాపోయారు.

కరోనా వైరస్ కారణంగా జనాలు ఉద్యోగాలకు వెళ్లడం కూడా మానేశారు. ఈ సారి పూల వ్యాపారం కూడా తీవ్రంగా దెబ్బతింది అని అన్నారు.