Asianet News TeluguAsianet News Telugu

కరోనాకు మందు కనిపెట్టిన వారికి కోటి రూపాయలు:జాకీ చాన్

 ఈ కరోన వైరస్ చైనా లో మొదలై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యికి మంది మృతి చెందగా వెలది మందికి ఈ వైరస్ సోకి ఆసుపత్రిలో చికిస్తా పొందుతున్నారు. 

china actor jackie chan announces 1crore offer for coronavirus cure medicine
Author
Hyderabad, First Published Feb 11, 2020, 12:57 PM IST

ప్రపంచ దేశాలను వానికిస్తున్న మహమ్మారి కరోనవైరస్ దేశదేశాలకు వ్యాపించి జనాలను భయాందోళనకు గురిచేస్తుంది. బయటికి వెల్లలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ కరోన వైరస్ చైనా లో మొదలై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యికి మంది మృతి చెందగా వెలది మందికి ఈ వైరస్ సోకి ఆసుపత్రిలో చికిస్తా పొందుతున్నారు.

అంతే కాకుండా ఈ వైరస్ కరణంగా వ్యాపారాలు, స్టాక్ మార్కెట్లు, దేశ ఆర్ధిక వ్యవ్స్థపై కూడా తివ్ర ప్రభావం చూపుతుంది. చైనాను కరోనా వైరస్ కకావికలం చేస్తోంది. కరోనా  వైరస్ దెబ్బకు వూహాన్ నగరంలో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. వ్యాధి భయంతో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు.

 also read  కరోనా వైరస్ నుంచి కరుణ లభించేదెప్పుడు..? వారు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు...

రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయి బయటకు రాక ఆ నగర వీధుల్లో నిశ్శబ్ధం సంతరించుకుంది. తమ దేశ పరిస్థితిని చూసి అక్కడి  కంపెనీలు పెద్ద మొత్తంలో విరాళాలు కూడా ఇస్తున్నాయి. అలీబాబా గ్రూప్, టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ సహా పలువురు వ్యాపారవేత్తలు తమకు తోచిన సాయం చేస్తున్నాయి.

china actor jackie chan announces 1crore offer for coronavirus cure medicine

తాజాగా చైనా ప్రముఖ నటుడు జాకీ చాన్ సైతం కరోనా వైరస్‌పై స్పందించారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో మాస్క్‌లు, ఇతర సామాగ్రిని విరాళం ఇచ్చిన ఆయన మరో కీలక ప్రకటన కూడా చేశారు. కరోనా వైరస్ కు మందు కనిపెట్టిన వారికి కోటి రూపయల రివార్డ్ ఇస్తానని ప్రకటించారు.

ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎన్ని ఏర్పాట్లను చేసిన కొత్తగా వైరస్ సోకిన కేసులు నమోదవుతున్నాయి. చైనా నుంచి ఇతర దేశాలకు రాకపోకలను నియంత్రించారు. ఇండియాలో కూడా కరోన వైరస్ సోకిన కొన్ని అనుమానిత కేసులు నమోదయ్యాయి. కొన్ని దిగ్గజ కంపెనీలు కూడా ఉత్పత్తిని ఆపేసి మూసేశారు. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులకు తాత్కాలిక సెలవును ప్రకటించారు. 

also read తెలంగాణకు గుడ్ న్యూస్... అమెజాన్ భారీ పెట్టుబడులు...

కరోనా వైరస్ పై పోరాటం కోసం చైనా ప్రభుత్వానికి ప్రముఖ వ్యాపారదిగ్గజం, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రూ.14.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.103 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఇక టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అధినేత 'పోని మా' సైతం 300 మిలియన్ యువాన్లు (రూ.309 కోట్లు) సాయం చేశారు. కాగా, కరోనా వైరస్ ప్రభావంతో చైనాలో దాదాపు వెయ్యి మంది చనిపోయారు.

వేలాది మంది వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ రోజురోజుకూ విస్తరిస్తుండడంతో చైనాతో పాటు ఇతర దేశాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దేశ ఆర్ధిక స్థితి కూడా పడిపోతుంది. చైనా దేశం నుండి ఎగుమతులు, దిగుమతులు కూడా బాగా పడిపోయాయి. ఈ వైరస్ కరణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పై కూడా ప్రభావం చూపిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios