CIBIL స్కోర్ తక్కువగా ఉందని ఎడ్యుకేషన్ లోన్ తిరస్కరించవచ్చా..? కేరళ హై కోర్టు తీర్పు ఏం చెబుతోంది..?

తక్కువ CIBIL లేదా క్రెడిట్ స్కోర్ కారణంగా విద్యార్థులకు విద్యా రుణాలను నిరాకరించరాదని కేరళ హైకోర్టు పేర్కొంది. విద్యార్థులను రేపటి దేశ నిర్మాతలుగా అభివర్ణిస్తూ జస్టిస్ పివి కున్ని కృష్ణన్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

Can education loan be rejected due to low CIBIL score..? What does the Kerala High Court judgment say MKA

నోయెల్ పాల్ ఫ్రెడ్డీ వర్సెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య కేసును పరిశీలిస్తున్న సందర్భంగా కేరళ ఉన్నత న్యాయస్థానం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. విద్యార్థి తనకు అవసరమైన రూ.4,07,200 విద్యా రుణాన్ని నిర్ణీత గడువులోగా మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఉన్నత న్యాయస్థానం విద్యార్థి కళాశాల చదువు కోసం రుణం మంజూరు చేయాలని బ్యాంకును ఆదేశించింది.

“విద్యా రుణం కోసం దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్నప్పుడు, బ్యాంకులకు మానవీయ విధానం అవసరం. విద్యార్థులే రేపటి జాతి నిర్మాతలు. భవిష్యత్తులో ఈ దేశానికి నాయకత్వం వహించాల్సిన వారు. "విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నందున బ్యాంకు విద్యా రుణ దరఖాస్తును తిరస్కరించకూడదని నేను భావిస్తున్నాను" అని కోర్టు పేర్కొంది. ఈ కేసులో తీర్పు 2020 నాటి రెండు కేరళ హైకోర్టు తీర్పులుపై ఆధారపడి ఉన్నాయి. నిజానికి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (CIBIL) స్కోర్ అనేది ఒకరి క్రెడిట్ హిస్టరీ, ఇది ఒక నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఒక వ్యక్తి యొక్క క్రెడిట్ చెల్లింపు హిస్టరీని కలిగి ఉంటుంది.

గతంలో కేరళ హైకోర్టు తీర్పులు ఏమి చెబుతున్నాయి?
KM జార్జ్  కేసులో బ్రాంచ్ మేనేజర్‌ విద్యార్థి  తండ్రి పేలవమైన క్రెడిట్ స్కోర్ ఆధారంగా విద్యార్థి ఎడ్యుకేషన్ లోన్  దరఖాస్తును తిరస్కరించడం ఏకపక్షమని, ఏప్రిల్ 28, 2001న భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన సర్క్యులర్‌ను ఉల్లంఘించిందని కోర్టు పేర్కొంది.

ఈ కేసులో, విద్యార్థి మెరిట్ ఆధారంగా విద్యార్థికి మొదటి రెండు సెమిస్టర్‌ల ఫీజు కోసం యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌ను మంజూరు చేసినప్పుడు, విద్యార్థి కోర్సు సాధ్యత, భవిష్యత్తు ఆధారంగా తిరిగి చెల్లింపు అవకాశాలను అంచనా వేయడంలో బ్యాంక్ విఫలమైందని కోర్టు గమనించింది. ఫలితంగా అతను తన చదువును కొనసాగించే అవకాశాన్ని కోల్పోయాడు.

ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం నిరాకరించబడకుండా ఉండేలా ప్రభుత్వ విధాన నిర్ణయం ఆధారంగా షెడ్యూల్డ్, కమర్షియల్ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన సర్క్యులర్‌లో ఉన్న నిబంధనలను విశ్లేషించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ రూపొందించిన మోడల్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్‌లో, "ఉత్తమ విద్యార్ధులు ఆర్థికంగా లేని కారణంగా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోవడమే విద్యా రుణ పథకం యొక్క లక్ష్యం" అని కోర్టు పేర్కొంది. 

అదేవిధంగా, ప్రణవ్ ఎస్ఆర్ వర్సెస్ బ్రాంచ్ మేనేజర్ విషయంలో, పిటిషనర్ OBC కేటగిరీకి చెందినవాడు. అతని B.Tech చదువును కొనసాగించడానికి విద్యా రుణం కోరాడు. “దరఖాస్తుదారుడి తల్లిదండ్రుల  క్రెడిట్ స్కోర్‌ తక్కువగా ఉందని ఎడ్యుకేషన్ లోన్ తిరస్కరించారు. ఎడ్యుకేషన్ లోన్ విషయంలో విద్యార్థి చదువు తర్వాత తిరిగి చెల్లించే సామర్థ్యం నిర్ణయించే అంశంగా ఉండాలని కోర్టు పేర్కొంది.

RBI సర్క్యులర్ ఏం చెబుతోంది?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్ 28, 2001న ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది, దీనిలో అన్ని బ్యాంకులు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) రూపొందించిన సమగ్ర “మోడల్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్”ని అనుసరించాలని పేర్కొనబడింది. భారతదేశంతో పాటు, విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అర్హులైన విద్యార్థులకు బ్యాంకింగ్ వ్యవస్థ నుండి ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం. అలాగే, 2001-2002 బడ్జెట్‌లో ప్రకటించారు. విద్యా రుణాలను ప్రారంభించడానికి ఈ పథకం బ్యాంకులకు విస్తృత మార్గదర్శకాలను అందించినప్పటికీ, దానిని అమలు చేయడంలో బ్యాంకులు భిన్నమైన విధానాలను అవలంబిస్తున్నాయి.  24 జూన్ 2019న, RBI అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులను 2001లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఏర్పాటు చేసిన విద్యా రుణ పథకాన్ని స్వీకరించాలని ఆదేశించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios