Asianet News TeluguAsianet News Telugu

Budget Expectations 2024 : ఈ సారి బడ్జెట్ లో జీఎస్టీ 2.0 ఉంటుందా ? పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా?

పెట్రోలియం ఉత్పత్తులను GST పరిధిలోకి తీసుకురావడం కేంద్రం, రాష్ట్రాల మధ్య చిక్కు సమస్యగా ఉంది, ఎందుకంటే పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు ఇటు రాష్ట్రాలకు, అటు కేంద్రానికి ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉండడమే.

Budget Estimates 2024 : Will there be GST 2.0? Sitharaman says outline plans? - bsb
Author
First Published Jan 29, 2024, 9:19 AM IST

న్యూఢిల్లీ : ఆన్‌లైన్ పోర్టల్స్‌లో అవాంతరాలు, ఇన్‌వాయిస్ మ్యాచింగ్, రీఫండ్‌లలో జాప్యం లాంటి అనేక ప్రాథమిక సమస్యలు చాలా వరకు పరిష్కరించబడ్డాయి. నెలవారీ ఆదాయం సగటున రూ. 1.6 లక్షల కోట్లకు పైగా చేరుకుంది. దీంతో, కేంద్రం వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) లో రెండవ తరం సంస్కరణలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ఫిబ్రవరి 1న సమర్పించనున్న మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ వ్యవస్థలో సంస్కరణలపై విస్తృతంగా తెలిపే అవకాశం ఉందని డెలాయిట్ ఇండియా భాగస్వామి ఎంఎస్ మణి తెలిపారు.

"జిఎస్‌టి మార్పులకు జిఎస్‌టి కౌన్సిల్ సమ్మతి అవసరం అయితే, జిఎస్‌టి సంస్కరణల తరువాతి దశపై ఆలోచనా విధానాన్ని, ఎలా దిశానిర్ధేశం చేయనున్నారనేదాన్ని వ్యాపారాలు మెచ్చుకుంటాయి" అని అన్నారు.

Indirect Tax : మీకు తెలియకుండానే.. మీ జేబులు ఖాళీ చేసే పన్నులు..

GSTలో సెకండ్ స్టేజ్ సంస్కరణను సూచించే రెండు విస్తృత సమస్యలు ఉన్నాయి. ఒకటి, పన్ను శ్లాబుల హేతుబద్ధీకరణ, రెండవది, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం. జీఎస్ టీ లేదా దేశవ్యాప్త పన్నులు ఉన్న చాలా దేశాల్లో ఒకటి లేదా రెండు స్లాబ్‌లు మాత్రమే ఉన్నాయి. కానీ, మనదేశంలో, నాలుగు ప్రధాన జీఎస్ టీ పన్ను స్లాబ్‌లు ఉన్నాయి - 5%, 12%, 18%, 28% వర్తించే సెస్. ఇది కాకుండా, కొన్ని ప్రత్యేక రేట్లు ఉన్నాయి. బంగారంపై 3% పన్ను విధించబడుతుంది, అలాగే విలువైన, పాక్షిక విలువైన రాళ్లపై 0.25% జీఎస్ టీ వర్తిస్తుంది.

2021లో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్యానెల్ అధ్యక్షతన మంత్రుల బృందం (GoM) ఏర్పడింది, జూన్ 2022లో మధ్యంతర నివేదికను సమర్పించింది. రేట్లపై వారి సిఫార్సులపై జీఎస్ టీ కౌన్సిల్ నుండి మరింత సమయం కోరింది. అయితే, కర్ణాటకలో ప్రభుత్వం మారిన తర్వాత, ప్యానెల్ ను పునర్నిర్మించారు. ఇప్పుడు దీనికి ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా నేతృత్వం వహిస్తున్నారు. ఏడుగురు సభ్యుల ప్యానెల్‌లో కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్, గోవా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఉన్నారు.

ఈ సారి బడ్జెట్ లో పన్ను శ్లాబులు మూడుకు తగ్గే అవకాశం ఉందని మణి చెప్పారు. “12% స్లాబ్ పూర్తిగా తొలగించబడుతుందని అంచనా. 5% శ్లాబ్‌ను 8% అధిక రేటులోకి మార్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మెజారిటీ ఉత్పత్తులపై 18% పన్ను విధించబడుతుంది. లగ్జరీ, డీమెరిట్, సిన్ గూడ్స్‌పై అత్యధిక శ్లాబ్ 28% ప్లస్ సెస్ విధించబడుతుంది. జిఎస్‌టి కౌన్సిల్ వివిధ ఉత్పత్తుల రేట్లను పలుమార్లు సవరించింది.

ఇండస్ట్రీ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) కూడా మూడు రేట్ల నిర్మాణం కోసం పిచ్ చేసింది. “నిత్యావసరాలకు తక్కువ రేటు, చాలా వస్తువులకు ప్రామాణిక రేటు, లగ్జరీ, డీమెరిట్ వస్తువులకు అధిక రేటు. ప్రస్తుతం జీఎస్టీ పరిధికి బైట ఉన్న ఉత్పత్తులను (పెట్రోలియం ఉత్పత్తులు, విద్యుత్, రియల్ ఎస్టేట్) తీసుకురావడానికి సిగ్నల్" అని సీఐఐ యూనియన్ బడ్జెట్ కోసం తన సిఫార్సులలో పేర్కొంది.

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం కేంద్రం, రాష్ట్రాల మధ్య చిక్కు సమస్యగా ఉంది, ఎందుకంటే పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు అందరికీ ముఖ్యమైన ఆదాయ వనరే. పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుండగా, చాలా రాష్ట్రాలు సందేహాస్పదంగా ఉన్నాయి. "రాష్ట్రాలు అంగీకరించిన తర్వాత, పెట్రోలియం ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తీసుకొస్తాం" అని సీతారామన్ గతేడాది బడ్జెట్ తరువాత సెషన్‌లో మాట్లాడుతూ అన్నారు.

డీజిల్, పెట్రోల్‌తో పోల్చినప్పుడు ఈ ఉత్పత్తులపై రాష్ట్రాల వ్యతిరేకత తక్కువగా ఉన్నందున ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్), సహజ వాయువును GST పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం ఒత్తిడి చేయవచ్చని మణి చెప్పారు.

పెండింగ్‌లో ఉన్న సంస్కరణలను ముందుకు తీసుకురావడానికి ఉల్లాసమైన పన్ను వసూళ్లు ప్రభుత్వానికి చాలా విశ్వాసాన్ని ఇస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో సగటు నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ. 1.66 లక్షల కోట్లుగా ఉన్నాయి, ఇది ఏడాదితో పోలిస్తే 12% ఎక్కువ.

Follow Us:
Download App:
  • android
  • ios