Asianet News TeluguAsianet News Telugu

స్మాల్ సేవింగ్స్‌పై కేంద్రమంత్రి నజర్... 2.5 లక్షల వరకు రాయితీ...!

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్​ వచ్చేనెల ఒకటో తేదీన వచ్చే ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్‌లో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో చిన్న మొత్తాల పొదుపుపై మరింతగా పన్ను రాయితీలు కల్పించవచ్చని విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఇప్పటి వరకు రూ.1.50 లక్షల వరకు చేసే పొదుపులకే పన్ను రాయితీలు వర్తిస్తున్నాయి. ఇక రూ.2.50 లక్షల వరకు పొదుపుచేసినా రాయితీలు కల్పిస్తూ చట్టంలో సవరణలు తేనున్నారు.

Budget 2020 proposal for salaried professionals: PPF, NSC
Author
Hyderabad, First Published Jan 18, 2020, 4:36 PM IST

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపుపై పన్ను రాయితీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించే బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఈ రాయితీలు కల్పించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

ఆదాయం పన్నుశాఖ చట్టం (ఐటీ)లోని 80 సీ సెక్షన్ ప్రకారం ప్రస్తుతం పన్ను రాయితీ కోసం ఉన్న సాధనాల్లో పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) కింద గరిష్ఠంగా ఏటా రూ.1.50 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. ఇకపై రూ.2.50 లక్షల వరకు పొదుపు చేసినా రాయితీ పొందేలా సవరణలు చేయనున్నారు. 

also read రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్... ఉచితంగా కొత్త సర్వీస్

అదనంగా నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ) కింద రూ.50 వేలు పొదుపు చేయడానికి కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వీలు కలిగించనున్నారు. మొత్తంమీద 80 (సీ) మినహాయింపు పరిమితి రూ.1.50 లక్షల నుంచి రూ.2.50లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.

Budget 2020 proposal for salaried professionals: PPF, NSC

పీఎం-యశస్వీ పథకం కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాల్లో కేంద్రం వాటా పెరగనుంది. ప్రస్తుతం 10 శాతం నిధులను కేంద్రం ఇస్తుండగా, మిగతా 90 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ఇకపై 60 శాతం నిధులు ఇవ్వాలని కేంద్రం ఆలోచిస్తోంది. దీనివల్ల ఓబీసీ, ఈబీసీ, ఎస్‌సీ, సంచార జాతులు, ఇతర వర్గాలకు మేలు కలగనుంది.

also read పెరుగుతున్న బంగారం ధరలు... ఇండియన్ కరెన్సీ ఎఫెక్ట్ కారణమా ?

2011-12 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 23.6 శాతంగా ఉన్న స్మాల్ సేవింగ్స్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో నాటికి 17.2 శాతానికి పడిపోయింది. అంటే 2011-12 నుంచి హౌస్ హోల్డ్ సేవింగ్స్ దేశ జీడీపీలో సుమారు ఏడు శాతం తగ్గిపోయాయి. బ్యాంక్ డిపాజిట్ల విభాగానికి వచ్చే సరికి అత్యధికంగా 27 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో పొదుపు మొత్తం పెంపొందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. 

పీపీఎఫ్ పరిమితిని రూ. లక్ష మొదలు రూ.1.5 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు పెంచాలని తద్వారా పొదుపు మొత్తాలను పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే రూ.5 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం పొదుపు చేస్తున్న పన్ను చెల్లింపు దారులు మూడు కోట్ల మందికి పైనే ఉంటారని తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios