Asianet News TeluguAsianet News Telugu

భారతి టెలికాంలో విదేశీ సంస్థల పెట్టుబడులు...ఇక విదేశీ సంస్థగా

ప్రస్తుతం భారతి టెలికాంలో సునీల్ భారతి మిట్టల్ (భారతి ఎంటర్ ప్రైజెస్ చైర్మన్) ఇంకా అతని కుటుంబానికి 52 శాతం వాటా కలిగి ఉన్నారు. విదేశీ సంస్థల ద్వారా భారతి టెలికాంలోని విదేశీ వాటాను 50 శాతానికి పెంచుతుంది. అలాగే విదేశీ యాజమాన్య సంస్థగా మారుతుందని అభివృద్ధి గురించి తెలిసిన ఒక అధికారి పిటిఐకి తెలిపారు.

Bharti Telecom seeks Rs 4,900 crore funds from singtel
Author
Hyderabad, First Published Dec 9, 2019, 12:11 PM IST

న్యూ ఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ ప్రమోటర్ అయిన భారతి టెలికాం సింగపూర్‌కు చెందిన సింగ్‌టెల్, ఇతర విదేశీ సంస్థల నుండి రూ .4,900 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వన్ని అనుమతి కోరింది. ఈ ఫండ్ ద్వారా భారతి టెలికాంలోని విదేశీ వాటాను 50 శాతానికి పెంచుతుంది. అలాగే విదేశీ యాజమాన్య సంస్థగా మారుతుందని అభివృద్ధి గురించి తెలిసిన ఒక అధికారి పిటిఐకి తెలిపారు.

ప్రస్తుతం భారతి టెలికాంలో సునీల్ భారతి మిట్టల్ (భారతి ఎంటర్ ప్రైజెస్ చైర్మన్) ఇంకా అతని కుటుంబానికి 52 శాతం వాటా కలిగి ఉన్నారు.భారతి ఎయిర్‌టెల్‌లో భారతి టెలికాం 41 శాతం వాటాను కలిగి ఉండగా, టెలికాం సంస్థలో విదేశీ ప్రమోటర్ సంస్థలు 21.46 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రభుత్వ వాటాదారులకు కంపెనీలో 37 శాతం వాటా ఉంది.

also read  గ్రామాల్లో గిరాకీ గోవిందా... మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగిన రాజన్


"భారతి టెలికాం సింగ్ టెల్ ఇంకా విదేశీ పెట్టుబడిదారుల నుండి సంస్థలో రూ .4,900 కోట్ల పెట్టుబడుల  కోసం ప్రభుత్వ అనుమతి కోరింది. దీంతో ఇక భారతి టెలికాం విదేశీ సంస్థగా మారనుంది, ఎందుకంటే విదేశీ పెట్టుబడిదారులు ఎక్కువ వాటా కలిగి ఉంటారు. అయితే ఈ నెలలో పెట్టుబడులను ఆమోదించడానికి టెలికమ్యూనికేషన్ విభాగం భావిస్తుందని"అని ఓ రిపోర్ట్ ద్వారా తెలిపింది.

విదేశీ పెట్టుబడిదారులపై కంపెనీ స్పష్టత ఇవ్వకపోవడంతో భారతీ ఎయిర్‌టెల్ ఎఫ్‌డిఐ దరఖాస్తును టెలికాం విభాగం ఈ ఏడాది ప్రారంభంలో తిరస్కరించింది.

 

also read ఆ రంగం ప్రమాదంలో ఉంది.. ఇన్వెస్టర్స్‌కు రఘురామ్‌ రాజన్‌ హెచ్చరిక


భారతి ఎయిర్‌టెల్‌లో ప్రస్తుతం మొత్తం విదేశీ వాటా 43 శాతం కలిగి ఉంది. ప్రమోటర్ సంస్థ భారతి టెలికాం విదేశీ సంస్థగా మారడంతో కంపెనీలో విదేశీ వాటా 84 శాతం దాటుతుందని ఆ వర్గాలు తెలిపాయి. భారతి ఎయిర్‌టెల్ ఇప్పటికే ఫండ్  కోసం సింగ్‌టెల్ మరియు ఇతర సంస్థలతో చర్చలు జరిపింది.


కొంత రుణాన్ని విరమించుకునేందుకు భారతి టెలికాం తన ప్రస్తుత ప్రమోటర్ గ్రూప్ నుండి ఈక్విటీని కోరవచ్చని ఆగస్టులో కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.సంస్థలో ఎఫ్‌డిఐ పరిమితిని 100 శాతానికి పెంచడానికి భారతి ఎయిర్‌టెల్ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. భారతి ఎయిర్‌టెల్ సంస్థ ఎజిఆర్ బకాయిలు రూ .43,000 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios