Asianet News TeluguAsianet News Telugu

బ్యాంకు లాకర్‌లో బంగారు నగలు, ఆస్తి పేపర్లు పెడుతున్నారా ? జాగ్రత్త..

 మీరు మీ నగలు, డాకుమెంట్స్  లేదా ఇతర విలువైన వస్తువులను లాకర్‌లో పెట్టాలని  ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఎలాంటి నష్టాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.

Are you going to keep gold jewelry and property documents in the bank locker? Make a note of all this-sak
Author
First Published Apr 19, 2024, 9:04 PM IST

ప్రస్తుతం భారతదేశంలో 60 లక్షల బ్యాంకు లాకర్లు మాత్రమే ఉన్నాయి. లాకర్ సర్వీస్ ప్రొవైడర్ ఆర్మ్ నివేదిక ప్రకారం, 2030 నాటికి దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మందికి లాకర్ సౌకర్యం అవసరం కావచ్చు. ఈ నివేదిక ప్రకారం, బ్యాంకు లాకర్ల సంఖ్య ఇంకా  పెరుగుతున్న డిమాండ్ మధ్య ఇప్పటికీ చాల  గ్యాప్  ఉంది. మీరు మీ నగలు, డాకుమెంట్స్  లేదా ఇతర విలువైన వస్తువులను లాకర్‌లో పెట్టాలని  ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఎలాంటి నష్టాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.

బ్యాంకులు లాకర్ల రక్షణకు భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మీరు మీ వస్తువులను మూడవ వ్యక్తికి ఇచ్చారని మర్చిపోవద్దు, బ్యాంకులు బాధ్యత తీసుకున్నా ప్రమాదం పూర్తిగా లేదని కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి జాతీయ బ్యాంకులు, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ ఇంకా  యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు సేఫ్ డిపాజిట్ లాకర్ సౌకర్యాలను అందిస్తున్నాయి. మీరు మరొక ఆర్థిక సంస్థ లేదా ప్రైవేట్ లాకర్ సర్వీస్  నుండి లాకర్ సదుపాయాన్ని పొందినప్పటికీ, మీరు దానిలో ఉన్న నష్టాల గురించి తెలుసుకోవాలి.

మీరు మీ లాకర్‌ నష్టానికి బ్యాంకులు బాధ్యత వహించవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, ప్రకృతి వైపరీత్యాలు, మీ నిర్లక్ష్యం ఇతర బలవంతపు పరిస్థితులలో లాకర్ రెంట్  ఒప్పందం బ్యాంకులను ఎలాంటి బాధ్యత నుండి మినహాయిస్తుంది. మీరు ఏ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ నుండి లాకర్ సౌకర్యాన్ని పొందుతున్నారో, మీరు ముందుగా వాటి  చార్జెస్  పోల్చి చూడాలి. బ్యాంకు లాకర్ చార్జెస్  ఏడాదికి రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తాయి.

మీరు లాకర్ సౌకర్యం కోసం బ్యాంకుని  నిర్ణయించుకున్నప్పుడల్లా, మీ ఫైనల్  అప్షన్ చేసుకునే ముందు ఖర్చుల గురించి పూర్తి సమాచారాన్ని పొందడం చాలా అవసరం. ముఖ్యమైన డాకుమెంట్స్ , ఆభరణాలు ఎక్కడైనా దూరంగా ఉన్న బ్యాంకులో  ఉంటె మీ  సమీపంలోని బ్యాంకును సెలెక్ట్ చేసుకోండి. లాకర్‌లోని వస్తువులను తరచూ బయటకు తీయాల్సి వస్తే దగ్గర్లోనే బ్యాంక్ లాకర్ ఉంటే మంచిది. కాబట్టి, లాకర్ నుండి వస్తువులను ఇంటికి తీసుకెళ్లేటప్పుడు మీరు దొంగతనం లేదా దోపిడీ ప్రమాదం ఉండదు.  

మీరు లాకర్ కీని పోగొట్టుకున్న తర్వాత లాకర్‌ తీయడానికి ప్రయత్నిస్తే, మీరు ఆర్థికంగా పెనాల్టీని ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి కీని జాగ్రత్తగా ఉంచుకోండి. లాకర్‌ని ఉపయోగించే రూల్స్  మీరు తెలుసుకోవడం ముఖ్యం. మీ లాకర్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్ తెరిచే వేళలు ఏంటి, సాధారణంగా ఈ గంటలు ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. శనివారాల్లో పరిమిత సేవలు మాత్రమే ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios