న్యూ ఢిల్లీ:  ఈ కామర్స్ దిగ్గజం అమేజాన్ సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్  భారతదేశంలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని ప్రకటించిన ఒక రోజు తర్వాత, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ అమెజాన్ దేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్‌కు  పెద్ద ఉపకారమేమీ చేయడం లేదని అన్నారు.

ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్థ "ఇంత పెద్ద నష్టాలను" ఎలా పొందగలిగింది అని ఆయన ప్రశ్నించారు.జెఫ్  బెజోస్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వని గోయల్, ఇ-కామర్స్ కంపెనీలు భారతీయ నియమాలను పాటించాలని, దీని ద్వారా మల్టీ-బ్రాండ్ రిటైల్ విభాగంలో బ్యాక్ డోర్ ద్వారా ఎంట్రీ లొసుగులను చూడవద్దని చెప్పారు.

also read క్రెడిట్/ డెబిట్ కార్డులపై కొత్త ఫీచర్..ఏంటంటే ?


మల్టీ-బ్రాండ్ రిటైలింగ్‌లో 49 శాతానికి మించి విదేశీ పెట్టుబడులను భారత్ అనుమతించదు అలాగే విదేశీ రిటైలర్ల నుండి ఇప్పటివరకు ఎలాంటి  దరఖాస్తును ఆమోదించలేదు."అమెజాన్  బిలియన్ డాలర్లను కలిగి ఉండవచ్చు, కాని వారు ప్రతి సంవత్సరం ఒక బిలియన్ డాలర్ల నష్టాన్ని చూస్తున్నారు కాబట్టి, వారు ఒక బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినప్పుడు వారు భారతదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కాదు "అని అన్నారు.


చిన్న, మధ్యతరహా వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి అమెజాన్ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఒక సంస్థ కొనుగోలుదారులను ఇంకా అమ్మకందారులకు ఐటి ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది, తెలిసి తెలిసి భారీ నష్టాలను ఎందుకు ఎదుర్కొంటుందని మంత్రి ఆశ్చర్యపోయారు.


"వారు కొన్నేళ్లుగా కొన్ని ఇతర కార్యకలాపాలలో డబ్బును పెట్టుబడిగా పెట్టారు ఇది చాలా మంచిది. కానీ వారు ఎక్కువగా ఆర్ధిక నష్టాలను తెచ్చుకుంటున్నారు "అని గోయల్ చెప్పారు. 10 బిలియన్ డాలర్ల టర్నోవర్ ఉన్న మార్కెట్-ప్లేస్ మోడల్‌లో, ఒక సంస్థ బిలియన్ డాలర్ల నష్టాన్ని చూస్తుంటే, అ నష్టం ఎక్కడ నుండి వచ్చింది అనే ప్రశ్నలను ఖచ్చితంగా ఆలోచించేల చేస్తుంది" అని ఆయన అన్నారు.

also read 42వేల పాయింట్లను తాకిన సెన్సెక్స్... మార్కెట్ పై ప్రభావం చూపనున్న సుప్రీం తీర్పు


"కొన్ని అన్యాయమైన బిజినెస్ పద్ధతుల్లో మునిగిపోతే తప్ప ఇంత పెద్ద నష్టాన్ని ఎలా పొందగలదని గోయల్ చెప్పారు."ఈ  కచ్చితమైన ప్రశ్నలకు  సమాధానాలు తప్పకుండ కావాలి అని ఆయన అన్నారు.ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఇటీవల ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు కారణంగా దర్యాప్తునకు ఆదేశించింది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పద్ధతులపై సిసిఐ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఇది ఖచ్చితంగా ప్రతి భారతీయుడికి ఆలోచన కలిగించే అంశం "అని మంత్రి అన్నారు.కాన్ఫిడరేషన్ ఆఫ్ అల్ ఇండియా ట్రేడర్స్ (బిజెపి) వాణిజ్య మంత్రి చేసిన ధైర్యమైన స్టేట్ మెంట్ ను ప్రశంసించింది.

ఇ-కామర్స్ దిగ్గజాల దుష్ప్రవర్తనలతో తీవ్రంగా ప్రభావితమైన ఏడు కోట్ల మంది వ్యాపారుల ప్రయోజనాలపై ప్రభుత్వం సున్నితంగా ఉందని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు అని ఒక ప్రకటనలో తెలిపింది.