అమెజాన్ ఫౌండర్, సీఈవో  జెఫ్ బెజోస్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ఆయన తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ తో కలిసి ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్ లు ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి..ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ మహల్ ను సందర్శించారు.

తాజ్ మహల్ ముందు చక్కగా ఫోజులు ఇచ్చి ఫోటోలు కూడా దిగారు. ఇప్పుడు వీరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో జెఫ్ బెజోస్ సింపుల్ గా సూట్ ధరించగా... లారెన్ మాత్రం ఆరెంజ్, తెలుపు రంగు కలయికతో ఉన్న గౌను ధరించారు. ఇద్దరూ చక్కగా నవ్వుతూ ఫోటోలను ఫోజులు ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. గతేడాది జెఫ్ బెజోస్ తన భార్య మెకంజీకి విడాకులు ఇచ్చారు. దాదాపు 25ఏళ్లపాటు వైవాహిక జీవితం గడిపిన ఆ జంట గతేడాది మొదట్లో విడిపోయారు. కాగా... వీరి విడాకులు కూడా సంచలనంగా మారాయి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విడాకుల్లో అగ్రస్థానం ఆయనకు దక్కింది.

Also Read జోమాటో చేతికి ఉబెర్ ఈట్స్ ఇండియా...

విడాకుల భరణం కింద ఆయన తన భార్య మెకంజీకి సుమారు 38.3 బిలియన్ డాలర్లు ఇచ్చారు. తొలుత 68బిలియన్ డాలర్లు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ వాషింగ్టన్ లోని సీటెల్ కోర్టు న్యాయమూర్తి 38.3 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదిర్చింది.

ఇంత మొత్తం భార్యకు భరణంగా ఇచ్చినప్పటీ జెఫ్ ఇప్పటికీ సంపన్నుడిగా ఉండటం గమనార్హం. మెకంజీతో విడిపోయిన తర్వాత లారెన్ శాంచెతో జెఫ్ తన రిలేషన్ ప్రారంభించారు.