Asianet News TeluguAsianet News Telugu

ఆధార్‌ నంబర్ ఉంటే చాలు. పది నిమిషాల్లో పాన్‌ కార్డు జారీ

ఆధార్ కార్డు ఉంటే ఇక పాన్ కార్డు సులభంగా తీసుకొనే అవకాశం  ఉంది. మైనర్లు మినహా ఇదివరకెన్నడూ పాన్‌ కార్డు తీసుకోని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్‌తో మొబైల్‌ నంబర్ అనుసంధానించి ఉండాలి. 

Aadhaar card holders can now get a free PAN card in just 10 minutes. Here's how to apply
Author
New Delhi, First Published Feb 23, 2020, 2:24 PM IST

న్యూఢిల్లీ: మీరు కొత్తగా పాన్ (శాశ్వత ఖాతా నంబర్) కోసం ఎదురు చూస్తున్నారా? కొత్తగా పాన్‌ కార్డు కోసం రెండు పేజీల దరఖాస్తు నింపి, సమర్పించిన తర్వాత కొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదండోయ్‌. ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ఇప్పుడు ఆన్‌లైన్‌లో తక్షణమే పాన్‌ కార్డు జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. 

అయితే, ఈ సౌకర్యం ఆధార్‌ కార్డు ఉన్నవారికే సుమా. ఆధార్‌ ఆధారిత ఈ-కేవైసీ ద్వారా ఆన్‌లైన్‌లో నిమిషాల్లో ఉచితంగా పాన్‌ కార్డు జారీ చేస్తారు. మీరు చేయాల్సిందల్లా ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ www.incometaxindiaefiling.gov.inలోకి లాగిన్‌ కావడమే.

అటుపై పోర్టల్‌ మెయిన్‌ పేజీలోని ఎడమ భాగంలో కన్పించే క్విక్‌ లింక్స్‌ విభాగంలో ‘ఇన్‌స్టంట్‌ పాన్‌ థ్రూ ఆధార్‌’ అని ఉన్న ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. తద్వారా స్ర్కీన్‌పైన ప్రత్యక్షమయ్యే కొత్త పేజీలోని కింది భాగంలో కన్పించే ‘గెట్‌ న్యూ పాన్‌’ బటన్‌ను క్లిక్‌ చేయండి. కొత్త పాన్‌ కార్డు జారీ కోసం మీ ఆధార్‌ నంబర్‌తోపాటు స్ర్కీన్‌పై కన్పించే కోడ్‌ను ఎంటర్‌ చేశాక ‘జనరేట్‌ ఆధార్‌ ఓటీపీ’ అనే బటన్‌ను క్లిక్‌ చేయండి. 

దాంతో మీ ఆధార్‌ కార్డుతో అనుసంధానితమైన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేసి పోర్టల్‌లో రూఢీపర్చాలి. ఆ తర్వాత మీ ఆధార్‌ వివరాలనూ ధ్రువీకరించాలి.  ఈ-మెయిల్‌కు పాన్‌ కార్డు పొందగోరేవారు ఆ వివరాలను సైతం అందించాలి. 

ఈ-కేవైసీ ప్రక్రియలో భాగంగా మీరు అందించిన డేటాను యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) వద్ద ఉన్న సమాచారంతో సరిపోల్చి చూస్తారు. ఆ వెంటనే ఈ-పాన్‌ కార్డు జారీ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తానికి 10 నిమిషాల సమయం పట్టొచ్చు. 

Also read:ఇండో- అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌: ఇవీ గందరగోళానికి కారణాలు..

ఆ తర్వాత మీరు పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో మీ పాన్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ‘చెక్‌ స్టేటస్‌ లేదా డౌన్‌లోడ్‌ పాన్‌’ అప్షన్‌ను క్లిక్‌ చేసి ఆధార్‌ నంబర్ ఎంటర్‌ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ ఆధార్‌తో ఈ-మెయిల్‌ కూడా అనుసంధానమై ఉంటే, పాన్‌ పీడీఎఫ్‌ ఫైల్‌ మెయిల్‌ రూపంలో మీ ఇన్‌బాక్స్‌కు చేరుతుంది.

పాన్‌ కార్డు జారీ జారీ పూర్తి ఉచితం కావడంతోపాటు దరఖాస్తు చేయడం చాలా సులభం కూడా. కేవలం నిమిషాల్లో ముగిసే ప్రక్రియ ఇది. 

మైనర్లు మినహా ఇదివరకెన్నడూ పాన్‌ కార్డు తీసుకోని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్‌తో మొబైల్‌ నంబర్ అనుసంధానించి ఉండాలి. ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ పూర్తి వివరాలు ‘తేదీ-నెల-సంవత్సరం’ ఫార్మాట్‌లో ఉండాలి.

Follow Us:
Download App:
  • android
  • ios