Asianet News TeluguAsianet News Telugu

బ్యాంకుల ఏటీఎంలతో అందే సేవలివే.. టైం కూడా ఆదా

వివిధ బ్యాంకుల ఏటీఎంల ద్వారా ఇప్పటి వరకు నగదు విత్ డ్రాయల్స్, డిపాజిట్లు మాత్రమే చేసేవారం. కానీ ఇక నుంచి మొబైల్ ఫోన్ రీచార్జి మొదలు చెక్ బుక్ రిక్వెస్ట్, యుటిలిటీ సర్వీసెస్ బిల్లులు, పర్సనల్ లోన్స్ మంజూరుకు ప్రపోజల్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలు తెరువచ్చు.

9 useful services provided by the ATM
Author
Hyderabad, First Published Jan 19, 2020, 1:54 PM IST

న్యూఢిల్లీ: వివిధ బ్యాంకుల ఏటీఎంల్లో ఎక్కువ మంది నగదు తీసుకోవడానికి, తమ ఖాతాలో ఉన్న నిల్వను తెలుసుకోవడానికి వినియోగిస్తుంటారు. కానీ బ్యాంకులు తమ ఏటీఎంలలో పలు రకాల సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి. వీటిని వినియోగించుకుంటే ఖాతాదారులు తమ విలువైన టైం ఆదా చేసుకోవడమే కాక వ్యయ ప్రయాసలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సేవలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం..

బ్యాంకుల ఖాతాదారులు తమ మొబైల్‌ ఫోన్‌ రీచార్జ్‌ కోసం ఏటీఎంను వినియోగించుకోవచ్చు. మొబైల్‌ ఫోన్‌ నంబర్‌‌ను నమోదుచేసి ఆపరేటర్‌ను ఎంచుకున్న తర్వాత అవసరమైన మొత్తం రీచార్జి ఎంతో నమోదు చేస్తే ఫోన్ రీచార్జ్‌ అయిపోతుంది. మీ సొంత నంబర్‌నే కాక మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరుల మొబైల్ ఫోన్ల నంబర్లకు కూడా రీచార్జ్‌ చేయవచ్చు.

ఏటీఎం ద్వారా వివిధ రకాల బిల్లులు కూడా చెల్లించవచ్చు. టెలిఫోన్‌ బిల్లు, విద్యుత్‌ బిల్లు, గ్యాస్‌ బిల్లు తదితర వినియోగ బిల్లులను సులభంగా చెల్లించవచ్చు. బిల్లుల చెల్లింపులకు ముందు బ్యాంకు వెబ్‌సైట్‌లో ముందుగా బిల్లు వసూలు చేసే సంస్థ పేరును రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది. దీనికి అనుమతి వచ్చిన తర్వాత ఎప్పుడంటే అప్పుడు చెల్లింపులు జరుపవచ్చు.

ఏటీఎం నుంచే ఇతర బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో గానీ, బ్యాంకు శాఖ నుంచి తాము బదిలీ చేయాలని భావిస్తున్న వారి ఖాతా నంబర్ ముందు రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సులభంగా నగదు బదిలీ చేయవచ్చు. ఒక రోజులో రూ.40 వేల వరకు నగదు బదిలీ చేయవచ్చు. లావాదేవీల సంఖ్యపై మాత్రం పరిమితి ఉండదు.

ఏటీఎం ద్వారా బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) ఖాతాను కూడా తెరవచ్చు. ఏటీఎం స్ర్కీన్‌పై కనిపించే ఓపెన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకుని ఎంత సొమ్ము ఎంత కాలానికి డిపాజిట్‌ చేయాలో తెలియజేస్తే ఆ మేరకు ఖాతాలోని సొమ్ము ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాకు బదిలీ అవుతుంది.

బీమా కంపెనీల ప్రీమియం మొత్తం ఏటీఎం ద్వారా చెల్లించవచ్చు. ఎల్‌ఐసీ, హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ తదితర సంస్థలు ఈ వసతి అందుబాటులోకి తెచ్చాయి. ప్రీమియం చెల్లించడానికి పాలసీ నెంబర్‌, పుట్టిన తేదీ లేదా మొబైల్‌ నంబర్‌, ప్రీమియం అమౌంట్‌ వంటి వివరాల అవసరం ఉంటుంది.
 
వ్యక్తిగత రుణం కోసం కూడా ఏటీఎం వినియోగించుకోవచ్చు. ఏటీఎంల ద్వారా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్‌ రుణ వసతి కల్పిస్తున్నాయి. వ్యక్తిగత రుణ దరఖాస్తు సదుపాయం ఏటీఎంలోనే ఉండటం వల్ల బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.

పలు రకాల పన్ను చెల్లింపులను కూడా సులభంగా ఏటీఎం ద్వారా చెల్లించవచ్చు. ఆదాయ పన్ను, అడ్వాన్స్‌ టాక్స్‌, సెల్ఫ్‌ అసెస్మెంట్‌ టాక్స్‌, పన్ను బకాయిలను చెల్లించవచ్చు. ఇందుకు కోసం బ్యాంకు శాఖ లేదా బ్యాంకు వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

సాధారణంగా చెక్‌ బుక్‌ అవసరమైనప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అయితే ఏటీఎం ద్వారా కూడా చెక్‌ బుక్‌ కోసం అప్లయ్‌ చేయవచ్చు. ఇందుకోసం ఏటీఎంలో ‘రిక్వెస్ట్‌ చెక్‌ బుక్‌’ అన్న ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios