హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత 12 కంపెనీ షార్ట్ సెల్లింగ్ ద్వారా లాభం పొందాయి..ఈడీ విచారణలో సంచలన విషయాలు..
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సహా దాదాపు డజను కంపెనీలు, అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్‌లో లబ్ధిదారులుగా ఉన్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గుర్తించింది. ఈ మేరకు ఓ రిపోర్టులో పేర్కొంది.
గతంలో హిండెన్‌బర్గ్ ఏజెన్సీ రిపోర్ట్ ఆధారంగా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి. అయితే ఈ షార్ట్ సెల్లింగ్ నేపథ్యంలో 12 కంపెనీలు మాత్రం లాభాలను ఆర్జించాయి.దర్యాప్తు ఏజెన్సీ ED ప్రకారం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు , విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FPI/FII) సహా డజన్ల కొద్దీ కంపెనీలు అదానీ షేర్లను షార్ట్ సెల్లింగ్ ద్వారా భారీ లాభాలను ఆర్జించాయని పేర్కొంది.
గత జూలైలో మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)తో పంచుకున్న నివేదికల్లో ED ఈ వాదన చేసింది. అదానీ గ్రూప్ షేర్ల నుండి డబ్బుు ఆర్జిస్తున్న 12 కంపెనీలు లేదా సంస్థలలోె, మూడు భారతదేశంలోనే ఉన్నాయి. అయితే, మారిషస్‌లో నాలుగు, ఫ్రాన్స్, హాంకాంగ్, కేమన్ దీవులు, ఐర్లాండ్, లండన్‌లలో ఒక్కొక్కటి ఉన్నాయి. అయితే సదరు విదేశీ సంస్థాగత మదుపుదారులు FPI/FIIలు తమ యాజమాన్యం గురించి ఆదాయపు పన్ను అధికారులకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఒక రిపోర్ట్ ప్రకారం, రెండు భారతీయ కంపెనీలు , ఒక విదేశీ బ్యాంకు , భారతీయ శాఖ అత్యధిక షార్ట్ సెల్లర్లలో ఉన్నాయి. ఒక భారతీయ కంపెనీ న్యూఢిల్లీలో , మరొకటి ముంబైలో రిజిస్టర్ అయి ఉన్నాయి .పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడం ద్వారా స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేసినందుకు ఢిల్లీ రిజిస్టర్డ్ కంపెనీ ప్రమోటర్‌కు సెబీ లేఖ జారీ చేసింది.
అసలు షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి:
షాట్ సెల్లింగ్ అనేది స్టాక్ మార్కెట్‌లోని ఒక వ్యాపార వ్యూహం. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చినప్పటి నుండి ఈ పదం వార్తల్లో ఉంది. షార్ట్ సెల్లింగ్ అనేది చాలా క్లిష్టమైన వ్యాపార వ్యూహం. దీని ప్రకారం, మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వ్యాపారి మొదట షేర్లను ఎక్కువ ధరకు విక్రయించి, ఆపై తక్కువ ధరకు కొనుగోలు చేస్తాడు. రెండింటి మధ్య వచ్చే వ్యత్యాసం ద్వారా వ్యాపారికి లాభం వస్తుంది.
షార్ట్ సెల్లింగ్ ఎలా చేయాలి?
మార్కెట్‌లో షార్ట్ సెల్లింగ్ మూడు విధాలుగా జరుగుతుంది. మొదటిది - క్యాష్ , రెండవది - ఆప్షన్స్, మూడవది - ఫ్యూచర్స్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇంట్రాడే షార్ట్ సెల్లింగ్ మాత్రమే క్యాష్ రూపంలో జరుగుతుంది, అయితే ఆప్షన్‌లు, ఫ్యూచర్‌లలో షాట్‌లను ముందుకు తీసుకెళ్లవచ్చు. షార్ట్ సెల్లింగ్‌పై రెగ్యులేటర్ సెబీ నిశితంగా గమనిస్తుంది. ఏదైనా అవకతవకలు కనుగొంటే వెంటనే చర్య తీసుకుంటుంది.
షార్ట్ సెల్లింగ్ ఎలా చేస్తారో ఒక ఉదాహరణ
షార్ట్ సెల్లింగ్ ఉదాహరణ విషయానికి వస్తే, A అనే వ్యాపారి ABC కంపెనీ స్టాక్ ధర ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉందని, దాని షేరు ధర తగ్గుముఖం పట్టవచ్చని భావిస్తాడు. అప్పుడు అతను తన సౌలభ్యం ప్రకారం షార్ట్ సృష్టించడానికి క్యాష్, ఆప్షన్స్ , ఫ్యూచర్ మార్గాలను ఎంచుకోవచ్చు. షార్ట్ సెల్లింగ్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ అని గుర్తుంచుకోండి. ఇందులో నైపుణ్యం అవసరం. మిస్టేక్ అయితే, మీరు ఆప్షన్స్, ఫ్యూచర్‌లలో పెట్టి మీ మూలధనంలో 100 శాతం కోల్పోవచ్చు.
షార్ట్ సెల్లింగ్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చు. దీని నెగిటివ్ ఏమిటంటే, షార్ట్ సెల్లింగ్ ద్వారా ఎవరైనా గ్రూప్‌గా ఏర్పడి ఫలానా కంపెనీ స్టాక్‌ను టార్గెట్ చేసి దానిని దించవచ్చు. పెద్ద మొత్తంలో షార్ట్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరతకు గురయ్యే ప్రమాదం ఉంది.
హిండెన్‌బర్గ్‌కు చెందిన అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న సెబీ రిపోర్ట్ ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోబోతోంది. సెబీ గతవారం సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్టును సమర్పించింది. రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ ప్రకారం, అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్‌కు సంబంధించిన కొన్ని సాంకేతిక నిబంధనలను ఉల్లంఘించింది. అదానీ గ్రూపునకు జరిమానా విధించవచ్చని కూడా రిపోర్ట్ పేర్కొంది.