వారంలో ఆరు రోజులు సెక్స్ చేయండి.. వ్యాపారవేత్త షాకింగ్ కామెంట్స్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 15, May 2019, 2:25 PM IST
"Sex For Six Days, Six Times": Jack Ma's Latest Advice After "996"
Highlights

వారంలో ఆరు రోజులు సెక్స్ చేయండి అంటూ... ఓ ప్రముఖ వ్యాపారవేత్త సూచించడం ఇప్పుడు సంచలనంగా మారింది. చైనాకి చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా తన ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

వారంలో ఆరు రోజులు సెక్స్ చేయండి అంటూ... ఓ ప్రముఖ వ్యాపారవేత్త సూచించడం ఇప్పుడు సంచలనంగా మారింది. చైనాకి చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా తన ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ‘అలీబాబా’ ఆధ్వర్యంలో చైనాలోని హ్యాంగ్స్యూలో సామూహిక వివాహక వేడుకను నిర్వహించారు. 102 జంటలకు పెళ్లి చేశారు. 

ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ‘‘‘‘పెళ్లంటే డబ్బు సంపాదన, ఇల్లు, కార్లు కొనడం కాదు. పిల్లలను కనడం. ఇందుకు 669 పాటిస్తూ.. వారంలో ఆరు రోజులు, ఆరు సార్లు సెక్స్ చేయండి’’ అని అన్నారు. కాగా... ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అంటూ నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. 

జాక్ ఈ విషయాలను 996, 669 నెంబర్లను ఉపయోగించి చెప్పడం విశేషం.ఆయన చేసిన వ్యాఖ్యల్లో ‘996’ అంటే.. వారంలోని ఆరు రోజుల్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేయడం. చైనాలోని అలీబాబా ఉద్యోగులంతా ఈ షిఫ్టులోనే పనిచేస్తున్నారు. అంటే వారంలో ఆరు రోజులు 12 గంటల సేపు పనిచేయాలి. అలాగే, చైనాలో 9 సంఖ్యను ‘సుదీర్ఘం’ అని భావిస్తారు. ఇక జాక్ మా చెప్పిన ‘669’ సంఖ్య విషయానికి వస్తే.. వారంలో ఆరు రోజులు.. ఆరుసార్లు సుదీర్ఘంగా సెక్స్ చేయాలని సూచిస్తుంది. 
 

loader