మహిళలకు మోడీ వరం, మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన కింద రూ. 2 లక్షలపై 7.5 శాతం వడ్డీ, పూర్తి వివరాలు మీకోసం

Mahila Samman Saving Certificate: రెండు సంవత్సరాల పాటు మీ కుమార్తె, సోదరి లేదా భార్య పేరిట మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజనలో రెండు లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయగలరు. ఇందులో మీకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో డిపాజిట్ చేసిన డబ్బులో కొంత భాగాన్ని కూడా మహిళలు విత్‌డ్రా చేసుకోవచ్చు.

Mahila Samman Saving Certificate Modi boon to women Rs. 2 lakhs at 7.5 percent interest, full details for you MKA

Mahila Samman Saving Certificate: మహిళా శిశు సంక్షేమం కోసం బడ్జెట్ 2023-24 ఆర్థిక మంత్రి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు, ఇది మహిళలకు అతి పెద్ద బహుమతిని అందజేస్తుంది. ఇందులో మహిళలకు 2 లక్షల పొదుపుపై ​​7.5% వడ్డీ  చెల్లించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.ఈ ప్రకటనతో ప్రభుత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్‌ను బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకాన్ని ప్రారంభిస్తామని  ప్రకటించారు. ఇందులో మహిళలకు 2 లక్షల పొదుపుపై ​​7.5% వడ్డీ లభిస్తుంది.  మహిళా సమ్మాన్ బచత్ పాత్ర మార్చి 2025 వరకు అందుబాటులో ఉంటుంది, మహిళ  పేరుతో రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజనలో డిపాజిట్ చేసిన డబ్బుపై ఎలాంటి పన్ను ఉండదు. మీరు రెండు సంవత్సరాల పాటు మీ కుమార్తె, సోదరి లేదా భార్య పేరిట మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజనలో రెండు లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయగలరు. ఇందులో మీకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో డిపాజిట్ చేసిన డబ్బులో కొంత భాగాన్ని కూడా మహిళలు విత్‌డ్రా చేసుకోవచ్చు.

Mahila Samman Saving Certificate Modi boon to women Rs. 2 lakhs at 7.5 percent interest, full details for you MKA

ఉదాహరణకు, మీ ఆదాయం సంవత్సరానికి 9 లక్షల రూపాయలు ఉంటే, మీరు దానిపై పన్ను చెల్లించాలి. కానీ మీరు మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజనలో సంవత్సరానికి రూ. 9 లక్షలలో రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే, ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు పెట్టుబడిగా చూపి పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రెండేళ్లలో రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయవచ్చు. రూ.7 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు ఉన్న కారణంగా మీరు పన్ను చెల్లించాల్సిన పనిలేదు.  ఆదాయపు పన్ను శ్లాబుల సంఖ్యను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు.  రూ.3 నుంచి 6 లక్షల వరకు 5 శాతం, రూ.6 నుంచి 9 లక్షల వరకు 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షలపై 15 శాతం, రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలపై 20 శాతం, అంతకంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం పన్ను పడుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios