Asianet News TeluguAsianet News Telugu

Union Budget 2022: రూ. 39.45 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్.. రంగాల వారీగా కేటాయింపులు ఇవే..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 39 లక్షల 45 వేల కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందు ఉంచారు. బడ్జెట్‌లో ముఖ్యంగా మౌలిక సదుపాయాల వ్యయంపై అత్యధిక దృష్టి పెట్టారు. 

Budget 2022 Total expenditure to be Rs 39 45 lakh crore
Author
New Delhi, First Published Feb 1, 2022, 3:18 PM IST


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 39 లక్షల 45 వేల కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందు ఉంచారు. బడ్జెట్‌లో ముఖ్యంగా మౌలిక సదుపాయాల వ్యయంపై అత్యధిక దృష్టి పెట్టారు. ట్యాక్స్ అసెస్‌మెంట్ ఇయర్ ముగింపు నుండి రెండేళ్లలోపు అప్‌డేటేడ్ ట్యాక్స్ ను చెల్లించవచ్చని కేంద్ర మంత్రి వివరించారు.  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్ పన్ను మినహాయింపు పరిమితిని 10 శాతం నుండి 14 శాతానికి పెంచినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. స్టార్టప్‌లకు పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగించనున్నట్టుగా తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే  దేశీయ తయారీ కంపెనీలకు పన్ను రాయితీలు ఇస్తామన్నారు. 

అయితే వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో మాత్రం ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. కార్పొరేటు సర్‌ఛార్జ్ 12 నుంచి 7 శాతానికి తగ్గించబడింది. అదే విధంగా త్వరలోనే డిజిటల్ కరెన్సీ తీసుకురానున్నట్టుగా నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీపై 30 శాతం పన్ను విధించనున్నట్టుగా చెప్పారు. మరోవైపు 5జీ సేవలను వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలిపారు.  రాష్ట్రాలకు రూ. లక్ష కోట్లను సాయంగా కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ వడ్డీ రహిత రుణాలు.. రాష్ట్రాల సాధారణ రుణాలకు అదనమని పేర్కొన్నారు. 

బడ్జెట్‌ గణంకాలు..
మొత్తం బడ్జెట్‌ అంచనాలు- రూ. 39.45 లక్షల కోట్లు
బడ్జెట్‌లో ద్రవ్య లోటు అంచనా- 6.4 శాతం
2021-22 ద్రవ్యలోటు- 6.9 శాతం (2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు)
2022-23 ఆదాయ వనరులు- రూ.22.84 లక్షల కోట్లు
రక్షణ రంగం - రూ. 5.25 లక్షల కోట్లు
రైల్వేలు - రూ. 1,40,367 కోట్లు
గ్రామీణభివృద్ది శాఖ - రూ. 1,38,203 కోట్లు
కమ్యూనికేషన్ - రూ. 1,05,406 కోట్లు
రసాయనాలు, ఎరువులు - రూ. 1,07,715 కోట్లు 
హోం శాఖ - రూ. 1,85,776 కోట్లు
ప్రధాని స్వాస్థ సురక్ష యోజన- రూ.10 వేల కోట్లు
ఆహారం, ప్రజా పంపిణీ- రూ. 2,17,684 కోట్లు
మైక్రో, చిన్న తరహా పరిశ్రమలు- రూ. 2 లక్షల కోట్లు
సోలార్ ప్లేట్ల తయారీ- రూ. 19,500 కోట్లు
ఆతిథ్య రంగం- రూ. 5 లక్షల కోట్లు
పెట్టుబడుల కోసం- రూ. 10.68 లక్షల కోట్లు
రహదారులు- రూ. 1,99,107 కోట్లు
ఆత్మ నిర్బర్ భారత్- రూ. 6,400 కోట్లు
వ్యవసాయం, రైతు సంక్షేమం- రూ. 1,32,513 కోట్లు

Follow Us:
Download App:
  • android
  • ios